iDreamPost

అమెరికా వెళ్లేవాళ్లు ఈ వస్తువులు తీసుకెళ్లడం నేరం.. భారీ జరిమానా, జైలు శిక్ష కూడా!

Don't Bring These Items To US: అమెరికా వెళ్ళేటప్పుడు చాలా మంది తమ వెంట కొన్ని వస్తువులను తీసుకెళ్తూ ఉంటారు. అయితే కొన్ని తీసుకెళ్లకూడని వస్తువులు ఉన్నాయి. అవి తీసుకెళ్ళడం నేరం. పొరపాటున తీసుకెళ్తే వాటిని సీజ్ చేయడమే కాకుండా పెనాల్టీ విధిస్తారు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా విధిస్తారు.

Don't Bring These Items To US: అమెరికా వెళ్ళేటప్పుడు చాలా మంది తమ వెంట కొన్ని వస్తువులను తీసుకెళ్తూ ఉంటారు. అయితే కొన్ని తీసుకెళ్లకూడని వస్తువులు ఉన్నాయి. అవి తీసుకెళ్ళడం నేరం. పొరపాటున తీసుకెళ్తే వాటిని సీజ్ చేయడమే కాకుండా పెనాల్టీ విధిస్తారు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా విధిస్తారు.

అమెరికా వెళ్లేవాళ్లు ఈ వస్తువులు తీసుకెళ్లడం నేరం.. భారీ జరిమానా, జైలు శిక్ష కూడా!

భారత్ నుంచి అమెరికా వెళ్ళేవాళ్ళు తమతో పాటు అనేక రకాల వస్తువులు తీసుకెళ్తుంటారు. బట్టలతో పాటు స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, ఇయర్ బడ్స్ వంటి గాడ్జెట్స్ తీసుకెళ్తుంటారు. కొందరు పచ్చళ్ళు పట్టుకెళ్తుంటారు. అయితే అమెరికా వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా తీసుకెళ్లకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి. అవి పొరపాటున కూడా తీసుకెళ్లకూడదు. మీకు తెలియకుండా తీసుకెళ్లినా గానీ నేరమే అవుతుంది. అందుకే యూఎస్ వెళ్ళేవాళ్ళు బయలుదేరేముందు బాగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అమెరికా దేశం ఈ వస్తువులను నిషేధించింది. నిషేధించబడ్డ వస్తువులతో అక్కడి ఎయిర్ పోర్టులో పట్టుబడితే కస్టమ్స్ అధికారులు మీ వస్తువులను సీజ్ చేయడమే కాకుండా పెనాల్టీ కూడా విధించే అవకాశం ఉంది. కొన్నిసార్లు వస్తువుల తీవ్రతను బట్టి కేసు కూడా పెడతారు.   

లివైస్, నైకీ, అడిడాస్, పూమా వంటి బ్రాండ్స్ కి చెందిన షూస్, దుస్తులు వంటి వస్తువులు ఉంటాయి. అయితే వీటికి నకిలీ ఉత్పత్తులు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. నకిలీ లేబుల్స్ తో చీప్ రేట్లకే దుస్తులు, షూస్ వంటివి దొరుకుతున్నాయి. అలాంటి వాటిని మీరు ఇక్కడ కొని అమెరికా పట్టుకెళ్తే కనుక అక్కడ అధికారులకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. బ్రాండ్ ఉత్పత్తుల్లా కనిపించే నకిలీ ఉత్పత్తులను అడ్డుకునేందుకు కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. ఈ మధ్య కాలంలో బ్రాండ్స్ పేరు కలిగిన నకిలీ ఉత్పత్తులను వెంట తీసుకుని అమెరికా వెళ్లిన విద్యార్థులు, భారతీయుల నకిలీ వస్తువులను అధికారులు సీజ్ చేశారు.

ఝార్ఖండ్ కి చెందిన ఒక టీచర్ అమెరికాలో ఉన్న ఆమె కొడుకును చూసేందుకు వెళ్లారు. అయితే ఆమె వెంట కొడుకుకి అవసరమని చెప్పి 8 చొక్కాలు, నాలుగు ప్యాంట్లు, సాక్స్ లు, షూస్ పట్టుకెళ్లారు. అయితే అమెరికాలోని ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు ఆమెను ఆపి నకిలీ ఉత్పత్తులుగా గుర్తించారు. నకిలీ బ్రాండెడ్ దుస్తులు, వస్తువుల గురించి ప్రశ్నించారని.. దీనిపై క్రిమినల్ కేసు కూడా పెడతామని బెదిరించారని ఆమె వెల్లడించింది. దీంతో భయపడి ఆమె ఆ బట్టలను, షూస్ ని చెత్తబుట్టలో పడేసినట్లు చెప్పుకొచ్చారు. దీని వల్ల తనకు 30 వేలు నష్టం వచ్చిందని అన్నారు. ఇలానే ఓ విద్యార్ధి విషయంలో జరిగింది. హైదరాబాద్ నుంచి కాలిఫోర్నియా వెళ్లిన స్టూడెంట్ కి చెందిన వస్తువులను నకిలీ బ్రాండెడ్ విగా గుర్తించి సీజ్ చేశారు.

తనకు ఇవి తీసుకురావడం నేరం అని తెలియదని చెప్పినా వినలేదని.. దీంతో చెత్త కుప్పలో పడేయాల్సి వచ్చిందని ఆ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. 2023లో 2.3 కోట్ల నకిలీ బ్రాండెడ్ వస్తువులను అధికారులు సీజ్ చేశారు. నకిలీ బ్రాండెడ్ వస్తువుల తయారీ మేధా సంపత్తి హక్కుల ఉల్లంఘన కింద నేరం అని.. తాము సీజ్ చేసిన వస్తువుల విలువ 270 కోట్ల డాలర్లు ఉంటుందని కస్టమ్స్ అధికారి వెల్లడించారు. బ్రాండెడ్ వస్తువులను కాపీ కొట్టే నకిలీ కంపెనీల ఉత్పత్తులకు చెక్ పెట్టేందుకు అమెరికా ఈ చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికీ తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి