Krishna Kowshik
ఈ రోజుల్లో ఒకరిని కనడానికి నానా తంటాలు పడుతున్నారు భార్యా భర్తలు. కానీ ఈ వ్యక్తి 48 ఏళ్లకు 165 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. అలాగే మరో 10 మంది పిల్లలు పుట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా..?
ఈ రోజుల్లో ఒకరిని కనడానికి నానా తంటాలు పడుతున్నారు భార్యా భర్తలు. కానీ ఈ వ్యక్తి 48 ఏళ్లకు 165 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. అలాగే మరో 10 మంది పిల్లలు పుట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా..?
Krishna Kowshik
ఒకప్పుడు భార్యా భర్తలకు గంపెడు మంది పిల్లలు ఉండేవారు. వీరిని ఆస్తులుగా భావించే వారు తల్లిదండ్రులు. కానీ ఆర్థిక సమస్యలు వెంటాడుతుండటంతో పిల్లలకు సరిగ్గా ఫుడ్ పెట్టలేని పరిస్థితి. దీంతో ఆలోచనో మార్పు వచ్చింది. అలాగే ప్రభుత్వాలు కూడా దేశ జనాభా నియంత్రణ నిమిత్తం పలు చర్యలు చేపట్టాయి. ముగ్గురు ముద్దు అనే నినాదాన్ని తీసుకు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరుంటే చాలు అనుకున్నారు. కానీ ఈ రోజుల్లో ఒక్కరితో సరిపెట్టేస్తున్నారు. ఆ ఒక్కరిని కూడా కనడానికి, వారిని పెంచేందుకు నానా అవస్థలు పడుతున్నారు పేరెంట్స్. కానీ ఈ మహానుభావుడు మాత్రం గంపెండు కాదు .. ఏకంగా 165 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. ఇటీవల తన 48వ ఏట 165వ బిడ్డకు నాన్నయ్యాడు.
పోనీ ఏమన్నా చదువుకోలేదా అంటే.. అతడో మ్యాథ్స్ ప్రొఫెసర్. ఇక్కడ మీకొక డౌట్ రావాలి.. 48 ఏళ్లకే 165 పిల్లలకు తండ్రి ఎలా అయ్యాడబ్బా అని. ఆ విషయమే చెబుతున్నా.. అతడు స్పెర్మ్ డోనర్. ఇంతకు అతడిది ఏ ఊరు అంటే. అమెరికాలో. యుఎస్ బ్రూక్లిన్‌కు చెందిన 48 ఏళ్ల గణిత ప్రొఫెసర్ అరి నాగెల్. ఒక వైపు ప్రొఫెసర్‌గా కొనసాగుతూనే ఉన్నా..తన స్పెర్మ్ దానం చేసి పిల్లలు లేని వారికి సంతాన భాగ్యం కలిగేలా చేస్తున్నాడు. అందుకే అతడ్ని ‘ది స్పెర్మినేటర్’ అని కూడా పిలుస్తుంటారు. ప్రపంచంలోని దాదాపు అన్ని ఖండాలలో అరి నాగెల్‌కు పిల్లలు ఉన్నారు. అమెరికా, ఆసియా, ఆఫ్రికా, యూరప్ సహా అనేక దేశాల్లోని మహిళలు.. అతడి స్పెర్మ్ ద్వారా బిడ్డల్ని కన్నారు. అలా 165 మంది బిడ్డలకు తండ్రయ్యాడు ఈ మ్యాథ్స్ ప్రొఫెసర్.
అయితే తనకు 50 ఏళ్లు వచ్చేటప్పటికీ ఈ స్పెర్మ్ డోనర్‌ను ఆపేస్తానని, ఇకపై ఈ స్పెర్మ్ఇవ్వడం వల్ల ఆటిజం వంటి సమస్యలతో పిల్లలు పుట్టే అవకాశాలుంటాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు నాగెల్. తన డొనేషన్ చేసిన స్పెర్మ్ ద్వారా ప్రస్తుతం మరో 10 మంది మహిళలు గర్భవతులుగా ఉన్నారని, వారిలో ఒకరు ఏ క్షణంలోనైనా ప్రసవించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు. జులై, ఆగస్టులో ఇద్దరు పిల్లలు పుట్టనున్నట్లు చెప్పాడు. తన ద్వారా కలిగిన సంతానాన్ని తరచుగా కలుస్తుంటానని తెలిపాడు. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్‌లో నివసించే పిల్లలు.. తమ ఫోటోలను ఇన్ స్టా వేదికగా పంచుకుంటారని పేర్కొన్నాడు. ఎనిమిది సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన స్పెర్మ్ డోనర్ వృత్తి తనకు ఆనందాన్ని ఇస్తుందని వెల్లడించాడు. మరో రెండు సంవత్సరాలు ఈ దానం చేసి.. 175 మంది పిల్లలకు తండ్రినవ్వాలని కోరికను వ్యక్తం చేశాడు.