iDreamPost

HDFC ఖాతాదారులకు అలర్ట్.. ఇకపై ఆ సేవలు బంద్

  • Published Jun 24, 2024 | 4:03 PMUpdated Jun 24, 2024 | 4:03 PM

ప్రముఖ దేశీయ దిగ్గజ ప్రైవేట్ బ్యాంకు రంగల్లో ఒకటైన హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఈ బ్యాంకు తమ కస్టమర్లకు ఓ ముఖ్యమైన అప్ డేట్ ను జారీ చేసింది. ఇంతకి అదేమిటంటే..

ప్రముఖ దేశీయ దిగ్గజ ప్రైవేట్ బ్యాంకు రంగల్లో ఒకటైన హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఈ బ్యాంకు తమ కస్టమర్లకు ఓ ముఖ్యమైన అప్ డేట్ ను జారీ చేసింది. ఇంతకి అదేమిటంటే..

  • Published Jun 24, 2024 | 4:03 PMUpdated Jun 24, 2024 | 4:03 PM
HDFC ఖాతాదారులకు అలర్ట్.. ఇకపై ఆ సేవలు బంద్

ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్స్ యుగం నడుస్తుంది. ఈ క్రమంలోనే దేశంలో యూపీఐ చెల్లింపులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అన్ని రకాల బ్యాంకులు తమ ఖాతాదారులకు యూపీఐ సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. దీంతో కస్టమర్లు చిన్న చిన్న షాపుల దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ఈ యూపీఐ పేమెంట్స్ నే ఎక్కువగా అనుసరిస్తున్నారు. ముఖ్యంగా రూ.10, 50, 100లకు కూడా ఎక్కువగా యూపీఐనే వినియోగించడం గమన్హారం. ఇలా ఎక్కడ చూసిన భారీ స్థాయిలో బ్యాంకుల నుంచి ఈ యూపీఐ ట్రాన్సెక్సన్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో తాజాగా ప్రముఖ దిగ్గజ బ్యాంకు అయిన హెచ్ డీఎఫ్ సీ తమ కస్టమర్లకు ఓ ముఖ్యమైన అప్ డేట్ ను జారీ చేసింది. ఇంతకి అదేమిటంటే..

ప్రముఖ దేశీయ దిగ్గజ ప్రైవేట్ బ్యాంకు రంగల్లో హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు కూడా ఒకటి. ఇక ఈ బ్యాంకు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. అనేక రకాల సౌకర్యలను తమ కస్టమర్లకు అందించడంలో హెచ్ ఎడీఫ్ సీ ఎప్పుడు ముందుంటుంది. అలాగే వడ్డీ రేట్లు విషయాలో కూడా పలు రకాల కీలక నిర్ణయాలు తీసుకుంటూ తమ కస్టమర్లకు ఏదో ఒక గుడ్ న్యూస్ ను అప్ డేట్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు తమ కస్టమర్లకు ఒక ముఖ్యమైన అప్ డేట్ ను జారీ చేసింది. ఇంతకి అదేమిటంటే.. రేపటి నుంచి అనగా.. జూన్ 25 మంగళవారం నుంచి ఈ ప్రైవేట్ బ్యాంకులో అతి తక్కువ మొత్తంలో ఉండే యూపీఐ లావాదేవీలకు సంబంధించి కస్టమర్‌లకు ఎస్ఎమ్ఎస్ (SMS) హెచ్చరికలను పంపడాన్ని నిలిపివేస్తోంది. ఇక రేపటి నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ కస్టమర్లు ఎవరైనా యూపీఐ ద్వారా రూ.100 కంటే తక్కువ పంపితే ఆ డబ్బులకు సంబంధించి టెక్స్ట్ సందేశాలు పంపడం జరగదు. దీంతో పాటు, హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారులకు వారి ఖాతాలో మొత్తం రూ. 500 కంటే తక్కువ ఉన్న కూడా టెక్స్ట్ సందేశాలు రావు. అయితే, ఖాతాలో చేసిన లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని కస్టమర్‌లు ఇమెయిల్ ద్వారా స్వీకరిస్తూనే ఉంటారు.

ఇక బ్యాంక్ కస్టమర్లు వెంటనే ఇమెయిల్ సంబంధిత పనిని చేయవలసి ఉంటుంది. పైగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాకు వారి ఇమెయిల్ ఐడీని లింక్ చేసిన బ్యాంక్ కస్టమర్‌లు లావాదేవీలకు సంబంధించిన ఇమెయిల్ హెచ్చరికలను స్వీకరిస్తారు. ఇక యూపీఐ (UPI) లావాదేవీ హెచ్చరికల కోసం బ్యాంక్ కస్టమర్‌లు ఇమెయిల్ ఐడీని అప్‌డేట్ చేయవచ్చు. అందుకోసం బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

అయితే ఇమెయిల్ ఐడీని ఇలా అప్ డేట్ చేయండి.

  • ముందుగా మీరు www.hdfc.comని అనే వెబ్ సైట్ ను  సందర్శించాలి.
  • ఆ తర్వాత సంబంధిత బ్యాంక్ వెబ్‌సైట్‌లోని ఇన్‌స్టా సర్వీస్ ఎంపికపై క్లిక్ చేయాలి.
  • దీని వెంటనే మెనుని క్రిందికి స్క్రోల్ చేసి, వెంటనే అప్‌డేట్ ఇమెయిల్ ఐడీ ఎంపికను కనుగొనాలి.
  • ఆ తర్వాత మీరు లెట్స్ బిగిన్‌పై ట్యాప్ చేయాలి. ఇక దానిలో మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.
  • ఇక అందులో DOB, PAN లేదా కస్టమర్ ID ధృవీకరించబడాలి.
  • వెంటనే గెట్ OTPని ట్యాప్ చేస్తే.. అందులో OTPని నమోదు చేసి తదుపరి సూచనలను అనుసరించాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి