iDreamPost

వీడియో: అమెరికాలో మరో ఇండియన్ మృతి.. ఒక్క గుద్దుతో ప్రాణం తీశాడు

ఉన్నత చదువులు, ఉద్యోగం అంటూ ఎన్నో కలలతో అమెరికా పయనం అవుతున్నారు ఇండియన్స్. కానీ వారినే కాదు.. భారత దేశంలో నివసిస్తున్న వారి కుటుంబాలకు చెందిన వారిని కూడా ఆందోళన కలిగించేలా చేస్తున్నాయి.

ఉన్నత చదువులు, ఉద్యోగం అంటూ ఎన్నో కలలతో అమెరికా పయనం అవుతున్నారు ఇండియన్స్. కానీ వారినే కాదు.. భారత దేశంలో నివసిస్తున్న వారి కుటుంబాలకు చెందిన వారిని కూడా ఆందోళన కలిగించేలా చేస్తున్నాయి.

వీడియో:  అమెరికాలో మరో ఇండియన్ మృతి.. ఒక్క గుద్దుతో ప్రాణం తీశాడు

విదేశాల్లో భారతీయులకు, భారత సంతతికి రక్షణ లేకుండా పోయింది. జాత్యంహర దాడులతో పాటు రోడ్డు ప్రమాదాలు, హత్యలు, ఊహించి యాక్సిండెంట్స్ కారణంగా పలువురు భారతీయులు మృతి చెందిన సంగతి విదితమే. వీరిలో తెలుగు వ్యక్తులు కూడా ఉన్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ అనే వ్యక్తిని అమెరికాలోని డల్లాస్‌లో దుండగుడు పొట్టన బెట్టుకున్న సంగతి తెలిసిందే. గోపీకృష్ణ పనిచేస్తున్న కన్వీనియన్స్ స్టోర్‌లో  చొరబడిన నిందితుడు.. అతడిపై కాల్పులు జరపడంతో చికిత్స పొందుతూ మరణించాడు. నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో భారత సంతతికి చెందిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఓ గొడవలో భాగంగా ఓ వ్యక్తి ఇండియన్ ముఖంపై బలంగా కొట్టడంతో చనిపోయాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఈ ఘటన జూన్ 22న ఓక్లహామాలో జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడు గుజరాత్ కు చెందిన 59 ఏళ్ల హేమంత్ మిస్ట్రీగా గుర్తించారు. మిస్త్రీ కొన్నేళ్లక్రితం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఓక్లహామాలో ఓ హోటల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. కాగా, గత శనివారం అతడి హోటల్‌కు వచ్చాడు రిచర్డ్ లూయిస్ అనే వ్యక్తి. ఏదో విషయంపై వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఇక్కడి నుండి వెళ్లిపో అంటూ మిస్ట్రీ గట్టిగా చెప్పడంతో.. ఆవేశానికి గురైన రిచర్డ్.. అతడి ముఖంపై బలంగా గుద్దాడు. అంతే అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు మిస్త్రీ. అనంతరం అక్కడి నుండి నిందితుడు జారుకున్నాడు.

మిస్త్రీ స్పృహ తప్పిపోయి పడిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. అనంతరం నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా… మెరిడియన్ అవెన్యూలోని 1900 బ్లాక్‌లోని ఓ హోట్లలో ఉన్నట్లు గుర్తించి, అరెస్టు చేశారు. అతడ్నికోర్టులో హాజరు పర్చగా.. లక్ష డాలర్ల ఫైన్ విధించినట్లు తెలుస్తుంది. తనను హోటల్ నుండి వెళ్లిపోమని చెప్పడంతోనే ఆవేశంతో కొట్టినట్లు నిందితుడు పేర్కొన్నట్లు తెలుస్తుంది. అసలు ఈ గొడవకు కారణమేమిటో తెలుసుకునే పనిలో పడ్డారు ఓక్లహామా పోలీసులు. కాగా, అమెరికాలో భారతీయులపై వరుస దాడులు కలవరపాటుకు గురి చేస్తుంది. ఈ ఏడాదిలో సుమారు 50 మంది వరకు చనిపోయి ఉంటారని అంచనా.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి