iDreamPost

మరిదితో వివాహేతర సంబంధం!.. చివరకు ఏం జరిగిందంటే?

సమాజంలో మానవతా విలువలు కనుమరుగవుతున్నాయి. వావివరుసలు మరిచి ప్రవర్తిస్తున్నారు కొందరు వ్యక్తులు. ఓ మహిళ వరుసకు మరిది అయిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. చివరకు ఏం జరిగిందంటే?

సమాజంలో మానవతా విలువలు కనుమరుగవుతున్నాయి. వావివరుసలు మరిచి ప్రవర్తిస్తున్నారు కొందరు వ్యక్తులు. ఓ మహిళ వరుసకు మరిది అయిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. చివరకు ఏం జరిగిందంటే?

మరిదితో వివాహేతర సంబంధం!.. చివరకు ఏం జరిగిందంటే?

ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. విలువలు మరిచిపోయి ఇష్టారీతిలో వ్యవహరించి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. పరువు ప్రతిష్టల గురించి ఆలోచించకుండా ఎంతకైనా తెగిస్తున్నారు. పరాయి వ్యక్తి మోజులో పడి దారుణాలకు ఒడిగడుతున్నారు. వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు రగిలిస్తున్నాయి. ఈ క్రమంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ వరుసకు మరిది అయిన వ్యకితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నది. కొంతకాలంగా ఈ వ్యవహారాన్ని గుట్టుగా నడిపిస్తున్నారు. ఈ క్రమంలో వీరి వివాహేతర సంబంధం గురించి ఇంట్లో తెలిసిపోయింది. చివరకు ఏం జరిగిందంటే?

ఆంధ్రప్రదేశ్ లో వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలిగొన్నది. వీరి అక్రమసంబంధం ఇంట్లో తెలియడంతో భయపడిపోయిన ఈ జంట బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎంతో భవిష్యత్ ఉన్న వారు వివాహేతర సంబంధానికి బలైపోయారు. జలాశయంలో దూకి ప్రాణాలు తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుత్తి మండలం బేతాపల్లికి చెందిన నిజామా(35) వరుసకు మరిది అయిన తాడిపత్రి మండలం గన్నెవారిపల్లికి చెందిన మహబూబ్‌బాషా(26)తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా వీరి అక్రమసంబంధాన్ని కొనసాగిస్తున్నారు.

అయితే రెండు రోజుల కిందట ఇంటి నుంచి ఇద్దరూ బయటికి వచ్చేశారు. ఎట్టకేలకు ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఈ జంట దారుణ నిర్ణయం తీసుకున్నారు. పరువు పోతుందని భావించి కుటుంబ సభ్యులకు ముఖాలు చూపించుకోలేక పెద్దపప్పూరు మండలంలోని చాగల్లు జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వీరి మరణంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి