iDreamPost

OTT Suggestion: భార్యాభర్తలు మాట్లాడుకుంటే ఇక అంతే! OTT లో వాట్ నెక్స్ట్ అనిపించే మూవీ

  • Published Jun 28, 2024 | 6:05 PMUpdated Jun 28, 2024 | 6:05 PM

OTT Best Suspense Thriller: సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే అందరికి ఇష్టమే.. ఈ జోనర్ కంటెంట్ ను ఇష్టపడే వారైతే ఈ సిరీస్ ను మిస్ చేసి ఉండరు. ఒకవేళ మిస్ అయితే మాత్రం ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను మిస్ అయినట్లే.

OTT Best Suspense Thriller: సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే అందరికి ఇష్టమే.. ఈ జోనర్ కంటెంట్ ను ఇష్టపడే వారైతే ఈ సిరీస్ ను మిస్ చేసి ఉండరు. ఒకవేళ మిస్ అయితే మాత్రం ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను మిస్ అయినట్లే.

  • Published Jun 28, 2024 | 6:05 PMUpdated Jun 28, 2024 | 6:05 PM
OTT Suggestion: భార్యాభర్తలు మాట్లాడుకుంటే ఇక అంతే! OTT లో వాట్ నెక్స్ట్ అనిపించే మూవీ

ఇప్పటివరకు చూసిన వెబ్ సిరీస్ లన్నీ ఓ రకమైన ఇంట్రెస్ట్ ను కలిగిస్తే.. ఓ వెబ్ సిరీస్ నెక్ట్ లెవెల్ ఇంట్రెస్ట్ ను రప్పిస్తుంది. ఆల్రెడీ ఇదే వెబ్ సిరీస్ తో నెట్ ఫ్లిక్స్ లో ఓ వెబ్ సిరీస్ ఉంది. కానీ ఇప్పుడు చెప్పుకోబోయేది మాత్రం రెగ్యులర్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమింగ్ అయ్యే వెబ్ సిరీస్ కాదు. రెగ్యులర్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కాకుండా ఇంకా ఎన్నో ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ కూడా అలాంటిదే. ఈ సిరీస్ పేరు “ది సైలెన్స్”. ప్రస్తుతం డబ్బు కోసం ఏదైనా చేసి బ్రతికేస్తున్నారు. ఎంత దూరం వెళ్లడానికైనా రెడీ అయిపోతున్నారు. డబ్బుకోసం అత్యాశకు పోతే ఏమౌతుంది. అనేది ఈ సినిమాలో చాలా డిఫ్ఫరెంట్ గా చూపించారు మేకర్స్. అసలు ఈ సినిమా కథేంటి..ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సిరీస్ స్టార్టింగ్ లో ఒక చూపులేని ముసలి వ్యక్తి తన మెడిసిన్స్ కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. అక్కడ పాము ఉంటుంది. దానిని తన కోడలు చూస్తున్నా సరే ఆమె సైలెంట్ గానే ఉంటుంది . కట్ చేస్తే కథ ఫ్లాష్ బ్యాక్ ను చూపిస్తూ ఉంటారు. రూబీ , అయాన్ అనే భార్య భర్తలు ఉంటారు. వారు ఓ మిడిల్ క్లాస్ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. రూబీ ఓ ముసలావిడ దగ్గర హోమ్ నర్స్ గా పని చేస్తూ ఉంటుంది. ఆయన ఒక క్యాబ్ డ్రైవర్. వీరిద్దరూ సింపుల్ గా డబ్బు సందించాలని చూస్తూ ఉంటారు. దీనితో రూబీ.. తను పనిచేసే ముసలావిడ ఇంట్లో దొంగతనాలు చేస్తుంది. అయాన్ క్యాబ్ లో ఎక్కే వ్యక్తుల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుని.. వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. డబ్బులు లేకపోయినా సరే అందరి దగ్గర రిచ్ గా బ్రతుకుతూ ఉంటారు. ఈ క్రమంలో వారిలో ఇబ్లీస్ అనే ఒక బిజినెస్ మ్యాన్ పరిచయమవుతాడు.

The Silence

రూబీ, అయాన్ కలిసి ఇబ్లీస్ దగ్గరకు వెళ్తారు. అక్కడ అతను అందరితో వింత గేమ్స్ ఆడిస్తూ గెలిచిన వారికి డబ్బులు, ఓడిపోయిన వారికీ కఠిన శిక్షలు విధిస్తుంటాడు. ఇది చూసి రూబీ, అయాన్ కూడా ఒక గేమ్ ఆడి డబ్బులు గెలుచుకుంటారు. అలా కొద్దీ రోజులు అక్కడే ఉండి వారు డబ్బు సంపాదించే పనిలో ఉంటారు. కొన్నాళ్ల తర్వాత అక్కడ వారికి జమాన్, అఫ్రోజా అనే జంట పరిచయం అవుతారు. వారికి అలాంటి గేమ్స్ ఆడించడం అంటే ఇష్టమని.. వారు చెప్పిన గేమ్స్ ఆడితే.. రూ.10 కోట్లు ఇస్తామని ఆ జంట రూబీ, అయాన్ లకు ఆఫర్ ఇస్తారు. దానితో ఒకే దెబ్బకు వారి జీవితం పెద్ద మలుపు తిరుగుతుందని అనుకుంటారు. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటంటే.. ఒక సంవత్సరం పాటు వారి ఎవరితోనూ మాట్లాడకూడదు. అలా చేస్తే.. రూ.10 కోట్లు ఇస్తామని చెప్తారు.

ఇది వారికి చాలా కష్టమైన పనే అయినా కూడా.. డబ్బు మీద ఆశతో ఆ పని చేయడానికి ఒప్పుకుంటారు. దానికోసం 14 కండిషన్స్ తో ఉన్న ఓ అగ్రిమెంట్ ను కూడా వారు కుదుర్చుకుంటారు. ఆ కాంట్రాక్టులో భాగంగా వారు ఆ డీల్ పూర్తయ్యే వరకు జమాన్, అఫ్రోజా ఇంట్లోనే ఉండాలి. అక్కడ వారి మెడకు ఓ బ్యాండ్ ను వేస్తారు. వారు మాట్లాడానికి ప్రయత్నించినప్పుడల్లా ఆ బ్యాండ్ ద్వారా జమాన్, అఫ్రోజా లకు ఇండికేషన్ వెళ్తుంది. డబ్బు మీద ఆశతో అయాన్ తన తల్లి చనిపోయినా, తన తండ్రిని పాము కాటేయబోయినా, చివరికి వారిద్దరిని కొట్టినా , వాళ్ళ కళ్ళ ముందు హత్య జరిగిన సరే అసలు మాట్లాడారు. ఆ తర్వాత ఏం జరిగింది ! అసలు సరిగ్గా సంవత్సరం పాటు ఎందుకు ఈ గేమ్ ను ఆడాలనే రూల్ పెట్టారు ! వారు ఈ గేమ్ లో గెలిచారా లేదా ! ఇవన్నీ తెలియాలంటే “ది సైలెన్స్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. అయితే ఈ సినిమా ప్రస్తుతం బింగ్ అనే స్పెషల్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేస్తే మాత్రం.. వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి