Nidhan
ఇంగ్లండ్‌తో నాకౌట్ ఫైట్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. టీ20 వరల్డ్ కప్-2022 సెమీస్ పరాజయానికి రివేంజ్ తీర్చుకుంది రోహిత్ సేన. ఇంగ్లీష్ టీమ్‌పై విజయంతో ఫైనల్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకుంది భారత్.
ఇంగ్లండ్‌తో నాకౌట్ ఫైట్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. టీ20 వరల్డ్ కప్-2022 సెమీస్ పరాజయానికి రివేంజ్ తీర్చుకుంది రోహిత్ సేన. ఇంగ్లీష్ టీమ్‌పై విజయంతో ఫైనల్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకుంది భారత్.
Nidhan
ఇంగ్లండ్‌తో నాకౌట్ ఫైట్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. 2022లో జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీస్ పరాజయానికి రివేంజ్ తీర్చుకుంది రోహిత్ సేన. ఇంగ్లీష్ టీమ్‌పై విజయంతో ఫైనల్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకుంది భారత్. నిన్నటి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన మెన్ ఇన్ బ్లూ అన్ని ఓవర్లు ఆడి 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. 103 పరుగులకే కుప్పకూలింది. టీ20 ప్రపంచ కప్-2022లో బట్లర్ సేన చేతుల్లో ఎదురైన పరాభవానికి నిన్న పగ తీర్చుకుంది భారత్. ఆ టీమ్‌ను 68 పరుగుల తేడాతో చిత్తు చేసింది. రెండూ టాప్ టీమ్స్, మంచి ఫామ్‌లో ఉన్నాయి కాబట్టి మ్యాచ్ లాస్ట్ బాల్ వరకు వెళ్తుందని అంతా అనుకున్నారు. ఎవరు గెలిచినా స్మాల్ మార్జిన్‌తోనే అని ఫిక్స్ అయ్యారు. కానీ రోహిత్ సేన దూకుడు ముంందు ఇంగ్లండ్ నిలబడలేకపోయింది.
నిన్నటి మ్యాచ్‌లో ఎక్కడా ఇంగ్లండ్‌కు ఛాన్స్ ఇవ్వలేదు భారత్. ఒక్క విరాట్ కోహ్లీ ఔట్ అయిన సందర్భంలో తప్ప మళ్లీ ఆ టీమ్ హవా నడిపించింది లేదు. మ్యాచ్‌లో మెజారిటీ మూమెంట్స్‌లో రోహిత్ సేన ఆధిపత్యమే నడిచింది. అయితే మ్యాచ్‌కు ముందు వర్షం పడటంతో గయానా వికెట్ బ్యాటింగ్‌కు కష్టంగా మారింది. బౌన్స్ రాకపోవడం, బంతులు మోకాలు కంటే తక్కువ ఎత్తులో వస్తుండటంతో షాట్ మేకింగ్ క్లిష్టంగా మారింది. ఈ టైమ్‌లో రాంగ్ షాట్ కొడితే ఔట్ అయ్యే ప్రమాదం పొంచి ఉంది. కోహ్లీ ఇలాగే అనవసర షాట్‌కు వెళ్లి వికెట్ సమర్పించుకున్నాడు. కానీ పిచ్‌ను అర్థం చేసుకున్న కెప్టెన్ రోహిత్ మాత్రం క్రీజులో సెటిల్ అవడంపై ఫోకస్ పెట్టాడు. సూర్యకుమార్ యాదవ్‌తో కలసి ఇన్నింగ్స్‌ను బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలో 7వ ఓవర్ వేసేందుకు వచ్చాడు ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్.
మెగాటోర్నీలో తన స్పిన్ బౌలింగ్‌తో వికెట్లు తీస్తూ ఇంగ్లండ్ విజయాల్లో కీలకంగా మారాడు ఆదిల్ రషీద్. భారత్ మీద కూడా అతడు ఎఫెక్టివ్‌గా బౌలింగ్ చేయాలని ఆ టీమ్ ఫ్యాన్స్ కోరుకున్నారు. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుండటంతో రషీద్ బౌలింగ్‌లో రోహిత్ ఎలా ఆడతాడోనని అంతా సందేహించారు. అయితే రివర్స్ స్వీప్ రూపంలో ఫస్ట్ బాల్కే బౌండరీ కొట్టి రషీద్‌కు వెల్కమ్ చెప్పాడు హిట్‌మ్యాన్. ఆ తర్వాత కూడా అతడి బౌలింగ్‌లో భారీ షాట్లు బాదాడు. అయితే ఆ రివర్స్ స్వీప్ అన్నింటి కంటే స్పెషల్ అనే చెప్పాలి. కఠిన పిచ్‌పై అలాంటి షాట్ కొట్టడంతో రోహిత్ మరింత రెచ్చిపోయాడు. ఆ షాట్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఇంగ్లండ్ బౌలర్లను ఉతికిఆరేశాడు.
హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్‌తో స్ఫూర్తి పొందిన సూర్య, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా కూడా ధనాధన్ షాట్లు బాదుతూ టీమ్ భారీ స్కోరు చేరుకునేలా చేశారు. అదే ఇంగ్లండ్ జట్టు ఛేజింగ్ టైమ్‌లో ఇదే మ్యాజిక్ చేయలేకపోయింది. రోహిత్‌లాగే అటాకింగ్‌గా ఆడి భారత్‌ను బ్యాక్ స్టెప్‌కు నెట్టాలని చూశాడు జోస్ బట్లర్. అందుకే మొదట్లో అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఎడాపెడా షాట్లు బాదాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్‌ను కూడా ఇలాగే కొట్టబోయి దొరికిపోయాడు. ఒకవేళ అక్షర్ బౌలింగ్‌లో గనుక క్లిక్ అయి ఉంటే బట్లర్ మరింత రెచ్చిపోయేవాడు. గత వరల్డ్ కప్‌లో ఇలాగే భువనేశ్వర్ బౌలింగ్‌లో చెలరేగిపోయిన బట్లర్.. నాటౌట్‌గా ఉండి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. నిన్న కూడా అలాగే చేద్దామనుకున్నాడు. కానీ వర్కౌట్ కాలేదు. ఆ రకంగా చూసుకుంటే రోహిత్ షాట్ భారత్‌ను మ్యాచ్‌లో పట్టుబిగించేలా చేస్తే.. బట్లర్ మిస్ షాట్ ఇంగ్లండ్‌కు విజయాన్ని దూరం చేసిందని చెప్పొచ్చు.
Adil Rashid in 2022 T20I WC Semi Final: 4-0-20-1.
In 2024 T20 WC, he was their best bowler — comes in the 7th over when India’s RR was just over 7 and Rohit Sharma played this beautiful reverse sweep in the first ball of Rashid’s spell at Guyana.
The MOMENT OF THE SEMI-FINAL. pic.twitter.com/ayKH65Qt4x
— Johns. (@CricCrazyJohns) June 28, 2024