iDreamPost
android-app
ios-app

పేదోళ్ల ఆకలి తీరుస్తున్న అమ్మ.. రూ.100కే మూడు పూటల భోజనం!

రూ.100కే ఈ రోజుల్లో ఒక పూట భోజనం రావడమే కష్టం. అలాంటిది కేవలం అదే వందకు ఉదయం, సాయంత్రం అల్పాహారం, మధ్యాహ్నం ఐదు రకాల కూరలు ఇంటికే సరఫరా చేస్తున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...

రూ.100కే ఈ రోజుల్లో ఒక పూట భోజనం రావడమే కష్టం. అలాంటిది కేవలం అదే వందకు ఉదయం, సాయంత్రం అల్పాహారం, మధ్యాహ్నం ఐదు రకాల కూరలు ఇంటికే సరఫరా చేస్తున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...

పేదోళ్ల ఆకలి తీరుస్తున్న అమ్మ.. రూ.100కే మూడు పూటల భోజనం!

నేటికాలంలో ఒకపూట భోజనం చేయాలంటే..కనీసం వంద రూపాయలు  ఖర్చు చేయాల్సిందే. అలాంటిది పూటలకు అంటే.. ఇంకా ఆ ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. సింపుల్ గా కర్రీపాయింట్లో మూడు రకాల కూరలు తీసుకుంటేనే రూ.60 నుంచి రూ.70 వరకు ఖర్చు అవుతుంది. అలాంటి మూడు పూటల భోజనం.. అది కూడా వంద రూపాయలకే ఒక ప్రాంతంలో ఆహారం లభిస్తుంది. ఉదయం, సాయంత్రం టిఫిన్ తో పాటు మధ్యాహ్నం ఐదు రకాల కూరలు ఇంటికే సప్లయ్ చేస్తున్నారు.  వంట చేసుకోలేని ఒంటరివాళ్లు, వృద్ధులకు ఇలాంటి మంచి సదుపాయాన్ని అందించింది ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

తెనాలి చెంచుపేటలోని పరుచూరి లక్ష్మి అనే మహిళ నివాసం ఉంటుంది. ‘కృష్ణాస్‌ లంచ్‌ బాక్స్‌’ పేరుతో ఆమె పలువురు మూడు పూట భోజనం సరఫరా చేస్తుంది. చెంచుపేటలోని ఓ సాధారణ డాబా ఇంటిలో ఈ మెస్ ను నడిపిస్తోన్నారు. అక్కడ ఒక పక్క వంటలు వండుతుంటే.. మరోవైపు వండిన వంటలను క్యారేజి బాక్సుల్లో సర్దుతున్నారు. వాటిని తీసుకెళ్లేందుకు డెలివరీ బాయ్స్‌ సిద్ధంగా ఉన్నారు.  అలా తమకు ఆర్డర్ ఇచ్చిన వారందరికి సకాలంలో భోజనం సరఫరా చేస్తుంటారు. లక్ష్మీ కుమారుడు  పవన్ కుమార్ విద్యుత్‌ శాఖలో లైన్‌మెన్‌గా చేస్తున్నాడు. ఆయన భార్య శ్రీలేఖ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పని చేస్తుంది. వీరిద్దరి సహకారం ఆమె ఈ మెస్ ను నడుపుతుంది. రెండున్నరేళ్ల క్రితం ఒక సహాయకుడితో కేవలం ఒక్కరికి భోజనం పంపటంతో ప్రారంభించారు.

ఇప్పుడు 125 మందికిపైగా కస్టమర్లకు రోజూ భోజనం సరఫరా చేస్తున్నారు. ఈ వినూత్నమైన ఆలోచనకు పరోక్షంగా 15 మందికిపైగా ఉపాధి లభిస్తోంది. 2022లో కంటి ఆపరేషన్ చేయించుకున్న పెద్దాయన చెప్పిన ఓ మాట ఈ కృష్ణాస్ లంచ్ బాక్స్ కి నాంది పలికింది.  తెలిసినవాళ్లు ఎవరైనా రెండువారాలు భోజనం పంపుతారేమో చూసిపెట్టండని ఆ పెద్దయన వీరికి చెప్పడంతో లంచ్ బాక్స్  సప్లయ్ కి పునాది పడింది. మనకు దగ్గర్లో ఉండే పెద్దాయనకు మనం వండి పంపితే సరిపోతుందని లక్ష్మీ భావించారు. ఆ విధంగా రోజూ తాము చేసుకున్న బ్రేక్‌ఫాస్ట్, భోజనం, రాత్రికి మరోసారి అల్పాహారం పంపుతూ వచ్చారు.  ఆ తరువాత అలా ఒంటరిగా, తోడులేని మరికొందరు.. కూడా ఇలానే తమకు కూడా పంపొచ్చు కదా అని అడిగారు. దీంతో అలాంటి వారికి సప్లయ్ చేస్తూ.. కృష్ణాస్‌ లంచ్‌ బ్యాక్స్‌ పెద్దగా విస్తరించినట్టు లక్ష్మి వెల్లడించారు.

మెను ప్రకారం..రోజూ మూడు పూటల వీరే ఇంటిక వద్దకు భోజనం సప్లయ్ చేస్తుంటారు. తెనాలి పట్టణంతో పాటు  పరిసర ప్రాంతాల్లోని 125 మందికిపైగా లంచ్‌ బాక్స్‌ మూడు పూటలా వెళ్తోంది. అలానే ప్రతి ఆదివారం కూరలతో పాటు చికెన్‌ కర్రీ, ఎగ్‌ పులుసు, చేపల పులుసులో ఏదో ఒకటి పంపుతామని నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా భోజనం అందించే విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం ఉండరు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధ పడే వారు మందులు వేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వారికి భోజనం లేటు కాకుండా ..కరెక్ట  సమయానికి అందిలే చూస్తారు. ఇక ఈ మెస్ గురించి ఆమె మాట్లాడుతూ.. తాము వ్యాపారం చేస్తున్నామని అనుకోవటం లేదని,  కేవలం సేవ భవంతోనే చేస్తున్నామని నిర్వహకురాలు లక్ష్మి తెలిపారు. ఇలా ఒంటరి వారికి, తోడులేని వారికి రూ.100కే భోజనం అందిస్తున్న లక్ష్మి, ఆమె కుమారుడి సేవపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.