iDreamPost

OTT Suggestion: హిందూ మైథలాజితో హాలీవుడ్ హర్రర్ మూవీ.. OTT లో అదిరిపోయే క్లైమాక్స్ తో..!

  • Published Jun 28, 2024 | 5:26 PMUpdated Jun 28, 2024 | 5:26 PM

Must Watch Horror Movie: ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించడానికి చాలానే సినిమాలు వస్తున్నాయి. కానీ వాటిలో హిందీ మైథలాజిని తలపించే సినిమాలు మాత్రం ఎప్పుడు కాస్త స్పెషల్ గానే ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే.

Must Watch Horror Movie: ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించడానికి చాలానే సినిమాలు వస్తున్నాయి. కానీ వాటిలో హిందీ మైథలాజిని తలపించే సినిమాలు మాత్రం ఎప్పుడు కాస్త స్పెషల్ గానే ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే.

  • Published Jun 28, 2024 | 5:26 PMUpdated Jun 28, 2024 | 5:26 PM
OTT Suggestion: హిందూ మైథలాజితో హాలీవుడ్ హర్రర్ మూవీ.. OTT లో అదిరిపోయే క్లైమాక్స్ తో..!

ప్రపంచంలో ఏ దేశం వారికైనా సరే భారతీయ సంప్రదాయం అంటే ప్రత్యేకమైన అభిప్రాయం ఉంటుంది. ముఖ్యంగా అమెరికన్స్ ఇండియన్ కల్చర్ ను చాలా ఇష్టపడుతుంటారు. ఇలాంటి ఓ మైథలాజికల్ కథకు హర్రర్ టచ్ ఇస్తే.. ఇక ఆ సినిమా మరో లెవెల్ లో ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. 2023 లో వచ్చిన ఈ సినిమా అమెరికన్స్ కు తెగ నచ్చేసింది. అప్పట్లో ఈ సినిమాకు మంచి రేటింగ్స్ కూడా వచ్చాయి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. చాలా సైలెంట్ గా ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. మూవీ స్టార్టింగ్ లోనే కొన్ని భయంకరమైన సీన్స్ చూపిస్తారు. హాల్ లో శవాలు పడి వుండడం.. దూరం నుంచి భయంకరమైన అరుపులు వినిపించడం.. కాలి పోయిన శరీరాల నుంచి పొగలు రావడం.. లాంటి సీన్స్ కనిపిస్తూ ఉంటాయి. అయితే, వాటిలో ఓ శవం చేయి ఓ గాజు జార్ వైపుకు చూపిస్తూ ఉంటుంది. ఇంతకీ అసలు ఆ గాజు జార్ లో ఏముంది.. వారందరిని ఎవరు చంపారు అనే ప్రశ్నలు మొదలుతూ ఉంటాయి. కట్ చేస్తే ఇక్కడ మరొక సీన్ ను చూపిస్తారు. తమీరా అనే అమ్మాయి తనలో తానే మాట్లాడుకుంటూ ఎదో గాజు జార్ తో స్కూల్ లో తిరుగుతూ ఉంటుంది. దీనితో ఆ స్కూల్ టీచర్ భయపడి పోయి.. సమిధ అనే అమ్మాయిని తనతో మాట్లాడమని చెప్తుంది.

కానీ సమిధకు మాత్రం ఇండియన్స్ అన్నా ఇండియన్ కల్చర్ అన్నా కూడా అసలు ఇష్టం ఉండదు. తన తల్లి దండ్రులు ఎంత చెప్పినా కూడా ఆమె ఇండియన్స్ తో మాట్లాడడానికి ఇష్టపడేది కాదు. దీనితో స్కూల్ లో టీచర్.. తమీరతో మాట్లాడమని చెప్పగానే ఆమె బ్రౌన్ గర్ల్స్ తో నేను మాట్లాడాను అని చెప్తుంది. కానీ తమీర మాత్రం ఆ గ్లాస్ జార్ ను తీసుకుని.. ఆమెకు హెల్ప్ చేయాలనీ సమిధను కలుస్తుంది. తనతో మాట్లాడానికే ఇష్టపడని సమిధ.. కంగారులో ఆ జార్ ను చేత్తో కొట్టడంతో.. ఆ జార్ పగిలిపోయి.. వెంటనే దట్టమైన పొగలు కమ్ముకుంటాయి.. ఆ పొగలో తమీర మాయమైపోతుంది.

ఎదో శక్తీ ఆమెను బలవంతంగా లాక్కెళ్లిపోతున్నట్లుగా అనిపిస్తుంది. దీనితో అప్పటివరకు ఇండియన్ కల్చర్ ను నమ్మని.. సమిధ.. అప్పటినుంచి తమీరను ఎలాగైనా కాపాడాలంటూ దేవుడిని కోరుకుంటుంది. ఆమె కూడా తమిరా కోసం వెతకడం స్టార్ట్ చేస్తుంది. అసలు సమిధకు తమిరా కు సంబంధం ఏంటి ! తమిరా ఆ గ్లాస్ జార్ ను పట్టుకుని ఎందుకు తిరుగుతుంది ! ఇండియన్ మైథలాజికి ఈ కథకు ఏంటి సంబంధం ! చివరకు ఈ కథ ఎలా ముగిసింది ! ఇవన్నీ తెలియాలంటే “ఇట్ లీవ్స్ ఇన్సైడ్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేస్తే కనుక వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి