iDreamPost

స్టార్ యాక్టర్ ఇంట్లో విషాదం.. పుట్టెడు దు:ఖంలో

ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కొంత మంది అనారోగ్య సమస్యలతో మరణిస్తే... మరికొంత మంది అనూమానాస్పద రీతిలో చనిపోయారు. తాజాగా మరో స్టార్ యాక్టర్ ఇంట్లో విషాదం నెలకొంటుంది.

ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కొంత మంది అనారోగ్య సమస్యలతో మరణిస్తే... మరికొంత మంది అనూమానాస్పద రీతిలో చనిపోయారు. తాజాగా మరో స్టార్ యాక్టర్ ఇంట్లో విషాదం నెలకొంటుంది.

స్టార్ యాక్టర్ ఇంట్లో విషాదం.. పుట్టెడు దు:ఖంలో

ఇండస్ట్రీలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు పలువురు సినీ సెలబ్రిటీలు మరణించారు. ఈ ఆరు నెలలో కాలంలో ఇండియన్ ఇండస్ట్రీ అనేక మందికి కోల్పోయింది. కొంత మంది అనారోగ్య సమస్యలతో మరణిస్తే… మరికొంత మంది అనూమానాస్పద రీతిలో చనిపోయారు. గత నెల రోజులుగా చూస్తే త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి విదితమే. ఆ వెంటనే ఆ ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే నటి నూర్ మాలాబికా దాస్ ముంబయిలోని తన ఫ్లాట్‌లో విగత జీవిగా కనిపించారు. అలాగే కోలీవుడ నటుడు ప్రదీప్ కే విజయన్ కూడా అనుమానాస్పద రీతిలో మరణిచింది.ప్రముఖ స్టార్ ఇంట్లో విషాదం నెలకొంది.

మలయాళ సీనియర్ నటుడు సిద్ధిక్ ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. సిద్దిక్ పెద్ద కుమారుడు రషీన్ మరణించాడు. అతడి వయసు కేవలం 37 ఏళ్లు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న అతడ్ని. ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ గురువారం మరణించారు. అతడ్ని సప్పీ అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే అతడు విభిన్న ప్రతిభావంతుడని తెలుస్తుంది. అతడ్ని నిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు కుటుంబ సభ్యులు. అతడి మరణంతో సిద్దిక్ కుటుంబం శోక సంద్రంలో మునిగి తేలిపోయింది. ఇదిలా ఉంటే.. సిద్దిక్ చిన్న కుమారుడు షాహీన్ సిద్దిక్ కూడా పలు సినిమాల్లో నటించి పేరు తెచ్చుకుంటున్నాడు. రషీన్ భౌతికకాయానికి పహాద్ ఫజిల్, దిలీప్, కావ్య మాధవన్ తదితరులు నివాళులు అర్పించారు.

ఇక సిద్దిక్ సినిమాల విషయానికి వస్తే.. మలయాళ ఇండస్ట్రీలో బిజీయెస్ట్ ఆర్టిస్ట్. 1985 నుండి పరిశ్రమలో కొనసాగుతున్నారు. తొలుత కామెడీ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నాడు. విలన్ రోల్స్ పోషించాడు. సపోర్టింగ్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు..నిర్మాత, దర్శకుడు కూడా. మలయాళంలో 350కి పైగా చిత్రాల్లో నటించాడు. మలయాళంలో దృశ్యం చిత్రాలతో తెలుగు వారికి నోటబుల్ అయ్యాడు. అయితే ఆయన తమిళంతో పాటు తెలుగులో కూడా సినిమాలు చేశాడు. కృష్ణం రాజు హీరోగా వచ్చిన అంతిమ తీర్పు చిత్రంలో యాక్ట్ చేశాడు. ఇందులో మరో మలయాళనటుడు సురేష్ గోపీ కూడా ఉన్నారు. ఆ తర్వాత 15 ఏళ్ల గ్యాప్ తర్వాత నా బంగారు తల్లి అనే మూవీతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించాడు సిద్దిక్. అగ్ని నక్షత్రం అనే మూవీ చేయగా.. విడుదల కావాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి