iDreamPost

థాంక్యూ సార్ అనడమే తప్పయింది.. చంటి బిడ్డతో ఉన్న మహిళను విమానంలోంచి..

Flight Attendant Rude Behavior: ఎవరైనా సహాయం చేస్తే థాంక్యూ అని చెప్పడం మామూలే. థాంక్యూ సార్ అని, థాంక్యూ మేడమ్ అని చెప్పడం సంస్కారం. కానీ విచిత్రంగా ఇక్కడ ‘థాంక్యూ సార్’ అన్నందుకు ఒక చంటి బిడ్డతో ఉన్న మహిళను విమానంలోంచి..

Flight Attendant Rude Behavior: ఎవరైనా సహాయం చేస్తే థాంక్యూ అని చెప్పడం మామూలే. థాంక్యూ సార్ అని, థాంక్యూ మేడమ్ అని చెప్పడం సంస్కారం. కానీ విచిత్రంగా ఇక్కడ ‘థాంక్యూ సార్’ అన్నందుకు ఒక చంటి బిడ్డతో ఉన్న మహిళను విమానంలోంచి..

థాంక్యూ సార్ అనడమే తప్పయింది.. చంటి బిడ్డతో ఉన్న మహిళను విమానంలోంచి..

సార్ అనే పిలుపు కోసం ఎంతోమంది తహతహలాడతారు. పెద్ద వయసున్న వారితో కూడా సార్ అనే పిలిపించుకుంటారు. కాల్ మీ సార్ అని డిమాండింగ్, కమాండింగ్ చేసేస్తారు. అయితే ఇక్కడ ఒక మహిళ సార్ అనడమే తప్పైపోయింది. థాంక్యూ సార్ అనడమే ఆమె చేసిన తప్పైపోయింది. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి, 16 నెలల బాబు ఉన్నారు. అయినా గానీ సార్ అన్న ఒకే ఒక్క  నిర్ధాక్షిణ్యంగా ఆ మహిళను, ఆమె తల్లిని, 16 నెలల బాబుని విమానంలోంచి..  

టెక్సాస్ కి చెందిన జెన్నా లాంగోరియా అనే మహిళ.. తన 16 నెలల కొడుకు, తల్లితో కలిసి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఆస్టిన్ వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకి వెళ్లారు. విమానం ఎక్కే సమయంలో సిబ్బంది ఆ మహిళకు బోర్డింగ్ పాస్ ని ఇచ్చారు. ఆ మహిళ ఆ బోర్డింగ్ పాస్ ని తీసుకుని సిబ్బందికి థాంక్స్ చెప్పారు. సిబ్బందికి థాంక్యూ సార్ అని చెప్పారు. ఇక్కడ ఆమె చేసిన తప్పు ఏమీ లేదు. బోర్డింగ్ పాస్ అందించిన సిబ్బంది మహిళ. ఆ మహిళను పొరపాటున సార్ అన్నందుకు సదరు మహిళా సిబ్బంది ఆగ్రహానికి గురైంది. అంతే నన్నే సార్ అంటావా అంటూ ఆ మహిళా సిబ్బంది విమానంలోంచి దించేసింది. పొరపాటున పిలిచింది, చంటి బిడ్డతో ఉంది అని కూడా చూడకుండా నిర్ధాక్షిణ్యంగా విమానంలోంచి దించేసింది.

వేరే ఎవరైనా అయితే కంగారులో చూసుకోకుండా అన్నారేమో అని వదిలేస్తారు. ఆ విషయాన్ని అసలు పట్టించుకోరు. కానీ ఈ మహిళా సిబ్బంది మాత్రం సార్ అన్నందుకు శంక పెట్టుకుంది. విమానంలోనికి రానివ్వకుండా గేట్ దగ్గరే ఆపేసింది. దీంతో ఆ మహిళా ప్యాసింజర్ జెన్నా.. మరో సిబ్బంది సాయం కోరింది. తనను విమానం లోనికి రానివ్వడం లేదని వేరే విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. దానికి ఆ సిబ్బంది.. మీరు ఫిర్యాదు చేస్తున్న సిబ్బంది మగాడు కాదు.. ఆడది అని బదులిచ్చాడు. దీంతో జెన్నా.. సార్ అన్నందుకు ఆ మహిళా సిబ్బందికి క్షమాపణలు చెప్పింది.

అయినా కూడా ఆమెను విమానంలోకి అనుమతించలేదు. దీంతో జెన్నా.. తన తల్లి, 16 నెలల కొడుకుతో ఆమె అక్కడే ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఎక్కువ లగేజ్ ఉందని.. చిన్న బాబు ఉన్నాడని..  తనకు, తన తల్లికి  అనారోగ్యం అని ఆమె వెల్లడించింది. సిబ్బంది లగేజ్ తిరిగి తీసుకోనివ్వలేదని.. అందులో మెడిసిన్స్ ఉన్నాయని.. అవి లేకపోతే ఇబ్బంది అవుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. క్షమాపణలు చెప్పినా సిబ్బంది తీరు మారలేదు. దీంతో విసిగిపోయిన ఆమె ఆందోళనతో సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ విమాన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.    

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి