iDreamPost

పోలీస్ శాఖకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. ఇకపై వారి ఆటలు సాగవు

ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి పోలీసులకు కీలకమైన ఆదేశాలను జారీ చేశారు. ఈ క్రమంలో పోలీసులు హైదరాబాద్ వాసులకు పలు హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై అలా చేసేవారిపట్ల కఠిన చర్యలు తీసుకోనున్నారు.

ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి పోలీసులకు కీలకమైన ఆదేశాలను జారీ చేశారు. ఈ క్రమంలో పోలీసులు హైదరాబాద్ వాసులకు పలు హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై అలా చేసేవారిపట్ల కఠిన చర్యలు తీసుకోనున్నారు.

పోలీస్ శాఖకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. ఇకపై వారి ఆటలు సాగవు

తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన మార్క్ పాలనతో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో పోలీస్ శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో పోలీసులు హైదరాబాద్ వాసులకు పలు హెచ్చరికలు జారీ చేసినట్లు కాంగ్రెస్ సోషల్ మీడియాలో (ఎక్స్ లో) వెల్లడించింది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగొద్దు. రోడ్లపై అల్లర్లు సృష్టించొద్దు. అనుమానాస్పద వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వొద్దు. షాపులను రాత్రి 10.30-11 గంటల్లోపు మూసేయాలి. గంజాయి సరఫరాదారులను, గంజాయి తీసుకునే వారిని వదిలిపెట్టేది లేదు. అర్ధరాత్రి జులాయిగా ఎవరైనా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటా అని తెలుపుతూ ఓ పోస్టర్ ను షేర్ చేసింది.

గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. వరుస హత్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. మరోవైపు నగరంలోని ఓ ప్రాంతంలో గంజాయి మత్తులో కొందరు యువకులు ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల కొందరు పోకిరీలు బైక్ రేసింగ్ లతో నానా రచ్చ చేస్తున్నారు. పోలీసులు బైక్ రేసింగ్ లకు పాల్పడే వారిని అదుపులోకి తీసుకుని బైక్ లను సీజ్ చేస్తున్నప్పటికీ వారిలో మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ శాఖకు కీలక ఆదేశాలను జారీ చేశారు. ఇకపై ఎవరైనా పోలీసు హెచ్చరికలను అతిక్రమిస్తే కఠినమైన చర్యలకు గురికావాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మత్తు పదార్థాల నిర్మూళనకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. డ్రగ్స్ సరఫరాకు పాల్పడే వారి పట్ల ఉక్కుపాదం మోపుతున్నది. అయినప్పటికీ పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువత డ్రగ్స్ మత్తులో పడి జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. డ్రగ్స్ మత్తులో దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ కారణం చేతనే హైదరాబాద్ లో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చట్ట వ్యతిరేక శక్తుల ఆటలు సాగకుండా పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి