iDreamPost

హెయిర్ లాస్‌తో బాధపడుతున్న వారికి గుడ్ న్యూస్.. కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తల కొత్త ఆవిష్కరణ!

Hair Loss Solution: చాలా మంది హెయిర్ లాస్ తో బాధపడుతున్నారు. ఎన్ని చికిత్సలు చేయించుకున్నా గానీ పెద్దగా ఫలితం కనిపించడం లేదు. పైగా సహజమైన జుట్టు రావడం లేదు. అయితే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెయిర్ లాస్ కి సరికొత్త ఆవిష్కరణను కనుగొన్నారు.

Hair Loss Solution: చాలా మంది హెయిర్ లాస్ తో బాధపడుతున్నారు. ఎన్ని చికిత్సలు చేయించుకున్నా గానీ పెద్దగా ఫలితం కనిపించడం లేదు. పైగా సహజమైన జుట్టు రావడం లేదు. అయితే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెయిర్ లాస్ కి సరికొత్త ఆవిష్కరణను కనుగొన్నారు.

హెయిర్ లాస్‌తో బాధపడుతున్న వారికి గుడ్ న్యూస్.. కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తల కొత్త ఆవిష్కరణ!

సెల్స్ యొక్క సింగిల్ పాపులేషన్ లో ఉండే రెగ్యులేటరీ టీ సెల్స్ అనేవి శరీరమంతా ప్రయాణం చేసి డ్యామేజ్ అయిన కణజాలాన్ని రిపేర్ చేస్తాయని కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తలు జరిపిన కొత్త అధ్యయనంలో నిరూపితమైంది. దీని వల్ల జుట్టు తిరిగి మొలిపించడం, అవయవ మార్పిడి గ్రహీతలకు చికిత్స చేయడం సహా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ టీ సెల్స్ అనేవి ఒక రకమైన తెల్ల రక్త కణాలు. ఇవి శరీరంలో ఉన్న నయం కానటువంటి వ్యాధులతో పోరాడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ టీ సెల్స్ అనేవి గతంలో శరీరంలోని పరిమిత ప్రదేశాల్లో మాత్రమే మల్టీ స్పెషలిస్ట్ పాపులేషన్స్ ఫంక్షనింగ్ గా ఉండేది. అంటే కేవలం శరీరంలోని కొన్ని ప్రదేశాల్లో మాత్రమే డ్యామేజ్ అయిన కణజాలాన్ని రిపేర్ చేయగలుగుతాయి. అయితే జూన్ 18న కేంబ్రిడ్జ్ స్టడీ పబ్లిష్ చేసిన దాని ప్రకారం.. సెల్స్ లోని సింగిల్ పాపులేషన్ టీ సెల్స్ కూడా శరీరమంతా ప్రయాణం చేసి డ్యామేజ్ అయిన కణజాలాన్ని రిపేర్ చేస్తాయి.

ఎలుకల శరీరాల్లో 48 రకాల కణజాలాల్లో ఉన్న టీ సెల్స్ ని గమనించడం, అనలైజ్ చేసిన తర్వాత ఈ కన్ క్లూజన్ కి వచ్చారు. ఈ ప్రయోగం ద్వారా టీ సెల్స్ అనేవి శరీరంలోని ఒక ప్రాంతం దగ్గరే ఉండవని.. అవి బాడీ మొత్తం కదులుతూ ఉంటాయని తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అన్వేషణ ద్వారా శరీరంలోని నిర్దిష్ట ప్రాంతం లేదా అవయవాలను టార్గెట్ చేసుకుని మెడిసిన్ ని క్రియేట్ చేసుకోవచ్చునని వెల్లడించారు. ఇది యాంటీ-ఇన్ఫ్లమేటరీ మెడిసిన్ ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుందని అన్నారు. అయితే శరీరంలోని నొప్పి కలిగించే ప్రాంతాల్లో కాకుండా మిగతా ప్రాంతాల్లో ప్రభావం చూపిస్తుంది. రెగ్యులేటరీ టీ సెల్స్ అనేవి హెయిర్ టిష్యూస్ స్టెమ్ సెల్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా జుట్టు పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పేను కొరుకుడు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కారణంగా హెయిర్ జుట్టు కుదుళ్ళు పాడవ్వడం వల్ల జుట్టు ఊడిపోతుంది. ఇలాంటి వ్యాధులను కూడా ఈ టీ సెల్స్ చికిత్స చేసి నయం చేస్తాయి. ఇలాంటి మెకానిజంలు రెగ్యులేటరీ టీ సెల్స్ తో సాధ్యమవుతుందని.. దాన్ని ఈ కొత్త ఆవిష్కరణ మెరుగుపరచడంలో సహాయం చేస్తుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు. మరొక ఉదాహరణ అవయవ మార్పిడి. అవయవమార్పిడి చేయించుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో.. వారు ఏ అవయవాన్ని అయితే మార్పిడి చేయించుకున్నారో దాని వల్ల శరీరానికి వ్యతిరేకంగా బలమైన నిరోధక శక్తి ఉత్పత్తి అవుతుంది. దీన్ని తగ్గించడానికి డ్రగ్స్ తీసుకుంటున్నారు. దీని వల్ల వారు ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు.

అయితే ఈ కొత్త రెగ్యులేటరీ టీ సెల్స్ ఆవిష్కరణతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చునని చెబుతున్నారు. అవయవమార్పిడి చేసిన వ్యక్తులకు కొత్త అవయవానికి బలమైన నిరోధక శక్తి అనేది కావాలి. కానీ అది శరీరం మొత్తం విస్తరిస్తే ప్రమాదం కాబట్టి.. ఎక్కడైతే కొత్త అవయవం పెట్టారో దానికి మాత్రమే బలమైన రోగ రోగనిరోధక ఉండేలా.. శరీరంలోని మిగతా ప్రాంతాల్లో ఉండకుండా నిరోధించేలా మెడిసిన్ ని క్రియేట్ చేయడంలో ఈ కొత్త ఆవిష్కరణ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. దీని వల్ల ఆ వ్యక్తి ఇతర వ్యాధులకు గురయ్యే సంభావ్యత అనేది తగ్గుతుంది. మొత్తానికి కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తలు హెయిర్ రీగ్రోత్ కోసం ఆవిష్కరణను అయితే కనుగొన్నారు. దీన్ని త్వరగా మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొస్తే చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి