iDreamPost

యాపిల్ నుంచి మార్కెట్లోకి సరికొత్త స్పీకర్.. ఫీచర్స్, ధర వివరాలు!

Beats Pill Speaker: ఇప్పటికే మార్కెట్లో యాపిల్ ఇయర్ బడ్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా యాపిల్ కంపెనీ నుంచి సరికొత్త స్పీకర్ రాబోతుంది. అది కూడా బడ్జెట్ లో వస్తుండడం విశేషం. దీంతో ఇయర్ బడ్స్ ధరకే మీరు ఈ హై క్వాలిటీ స్పీకర్ ని సొంతం చేసుకోవచ్చు. మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందంటే?

Beats Pill Speaker: ఇప్పటికే మార్కెట్లో యాపిల్ ఇయర్ బడ్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా యాపిల్ కంపెనీ నుంచి సరికొత్త స్పీకర్ రాబోతుంది. అది కూడా బడ్జెట్ లో వస్తుండడం విశేషం. దీంతో ఇయర్ బడ్స్ ధరకే మీరు ఈ హై క్వాలిటీ స్పీకర్ ని సొంతం చేసుకోవచ్చు. మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందంటే?

యాపిల్ నుంచి మార్కెట్లోకి సరికొత్త స్పీకర్.. ఫీచర్స్, ధర వివరాలు!

యాపిల్ కంపెనీకి చెందిన నెక్స్ట్ జనరేషన్ బీట్స్ పిల్ స్పీకర్ కి సంబంధించి వీడియో ఒకటి లీక్ అయ్యింది. ఇది వచ్చే వారం యాపిల్ స్టోర్స్ లో అందుబాటులోకి రానుంది. లెబ్రాన్ జేమ్స్, లిల్ వేన్ వంటి సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఈ బీట్స్ పిల్ స్పీకర్ కి సంబంధించిన వీడియోని పోస్ట్ చేశారు. యాపిల్ కంపెనీ నుంచి వస్తున్న బీట్స్ పిల్ స్పీకర్ కంటే ముందు పిల్ ప్లస్ పేరుతో 2015లో ఒక స్పీకర్ వచ్చింది. కొన్ని కారణాల వల్ల 2022 నుంచి ఈ స్పీకర్స్ తయారీని యాపిల్ కంపెనీ నిలిపివేసింది. బాస్కెట్ బాల్ స్టార్ లెబ్రాన్ జేమ్స్, మ్యుజిషియన్ లిల్ వేన్ వంటి సెలబ్రిటీలు ఈ స్పీకర్ కి సంబంధించిన యాడ్ లో నటించడంతో బేస్ పిల్ స్పీకర్ ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది.

ఈ యాడ్ లో కనిపించిన 6.25 నంబర్ బట్టి ఈ స్పీకర్ జూన్ 25న లాంఛ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ స్పీకర్ కి డిటాచబుల్ క్యారీ స్ట్రాప్ ఉంది. యాపిల్ బీట్స్ పిల్ లో ఉండే బ్లూటూత్ ఖచ్చితంగా పెద్ద సౌండ్, పెద్ద బాస్, ఉత్తమ టొనాలిటీ విషయంలో అప్డేట్ తోనే రాబోతుంది. ఇది రీడిజైన్డ్ రేస్ ట్రాక్ ఊఫర్ తో రాబోతుందని.. 28 శాతం అధిక మోటార్ ఫోర్స్ ని జనరేట్ చేస్తుందని.. 90 శాతం అధిక సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తుందని.. లో-ఫ్రీక్వెన్సీ డిస్టోరేషన్ ని తగ్గిస్తుందని మార్క్ గుర్మన్ అనే జర్నలిస్ట్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. మార్క్ గుర్మన్ అనే జర్నలిస్ట్ బీట్స్ పిల్ స్పీకర్ గురించి తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు.

ఈ కొత్త బీట్స్ పిల్ స్పీకర్ యాపిల్ రిటైల్ స్టోర్స్ లో వచ్చే వారం నుంచి అందుబాటులోకి వస్తాయని.. దీని ధర 149 డాలర్లని వెల్లడించారు. మన కరెన్సీ ప్రకారం 12,450 రూపాయలు. ఇది ఎరుపు, నలుపు, గోల్డ్ కలర్స్ లో వస్తుందని చెప్పారు. ముందుగా ప్రకటించినట్టే యాపిల్ బీట్స్ సోలో బడ్స్ జూన్ 21 నుంచి అందుబాటులో ఉంటాయని ట్వీట్ చేశారు. ఎన్హ్యాన్స్డ్ స్టెబిలిటీ కోసం డెడికేటెడ్ హోసింగ్, క్రిస్ప్ హై నోట్స్, డీటెయిల్డ్ మిడ్ రేంజ్ టోన్స్ ని డెలివర్ చేయడానికి సరికొత్త డిజైన్ తో వస్తుంది. ఈ స్పీకర్ 20 డిగ్రీల అప్వార్డ్ టిల్ట్ తో వస్తుంది. చెవుల వైపు సౌండ్ ని ట్రావెల్ అయ్యేలా.. దగ్గరలో ఉన్న వస్తువుల డిస్టర్బెన్స్ ని తగ్గిస్తుంది. దీంతో అద్భుతమైన సౌండ్ క్వాలిటీని ఆస్వాదించగలుగుతారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి