iDreamPost

Sooryavanshi : ఆశలన్నీ ఈ మల్టీ స్టారర్ మీదనే

Sooryavanshi :  ఆశలన్నీ ఈ మల్టీ స్టారర్ మీదనే

కరోనా లాక్ డౌన్ టైంలో మతులు పోయే ఆఫర్లు వచ్చినా టెంప్ట్ కాకుండా తమ సినిమాను నిలబెట్టుకుంటూ వచ్చిన బాలీవుడ్ క్రేజీ మల్టీ స్టారర్ సూర్య వంశీ నిర్మాతలు ఎట్టకేలకు నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ మొదలైపోయింది. అక్షయ్ కుమార్ తో పాటు అజయ్ దేవగన్, రణ్వీర్ సింగ్ లు ప్రత్యేకంగా డేట్లు అడ్జస్ట్ చేసుకుని మరీ పబ్లిసిటీ లో పాల్గొంటున్నారు. దీపావళి పండగ కూడా కలిసి వస్తుండటంతో ట్రేడ్ భారీ వసూళ్లను ఆశిస్తోంది. ఓపెనింగ్స్ విషయంలో గత రెండేళ్లలో ఏ సినిమాకూ రాని కలెక్షన్లను ఇది సొంతం చేసుకుంటుందని ఇప్పటికే గట్టి అంచనాకు వచ్చేశారు.

డిస్ట్రిబ్యూటర్స్ టాక్ ప్రకారం సుమారు 2800 నుంచి 3000 స్క్రీన్ల మధ్యలో సూర్యవంశీ ఫస్ట్ డే హడావిడి చేయబోతున్నాడు. మల్టీ ప్లెక్సులు సైతం ఎక్కువ షోలు ఇచ్చేందుకు సంసిద్దత చూపిస్తున్నాయి. పోటీకి ఇతర చిత్రాలేవీ రావడం లేదు. రజినీకాంత్ అన్నాతే ఉంది కానీ దాని హంగామా సౌత్ లోనే ఎక్కువ కాబట్టి నార్త్ లో పెద్దగా పట్టించుకోకపోవచ్చు. పైగా అది అరవ స్టైల్ లో సాగే పక్కా విలేజ్ డ్రామా. సో సూర్యవంశీకి ఇబ్బందేమీ లేదు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ పోలీస్ యాక్షన్ డ్రామాని 100 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. ట్రైలర్ వచ్చి ఏడాదిన్నర దాటిందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు

ఇప్పుడీ సినిమాకు వచ్చే రెస్పాన్స్ మీదే పాన్ ఇండియా సినిమా కళ్లన్నీ ఉన్నాయి. పుష్ప, రాధే శ్యామ్, ఆచార్య, కెజిఎఫ్ 2 లాంటి ప్రొడ్యూసర్లు సూర్యవంశీ ఎలాంటి రికార్డులు నమోదు చేయబోతోందనే దాని మీద ఆసక్తిగా ఉన్నారు. ఒకవేళ అది కనక కనీసం ఓ రెండు వందల కోట్లు రాబట్టుకోగలిగితే ఆర్ఆర్ఆర్ కు ఈజీగా సూర్యవంశీకి మూడింతలు కలెక్షన్లను ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. ప్రస్తుతానికి వీకెండ్స్ లో తప్ప మిగిలిన రోజుల్లో థియేటర్ల వద్ద సందడి తక్కువగా ఉంది. దీన్ని బ్రేక్ చేయాల్సిన బాధ్యత కూడా సూర్యవంశీ మీదే ఉంది. నిర్మాణ సంస్థ పాటు ఇండస్ట్రీకి సంబంధం ఉన్న అన్ని వర్గాల చూపు ఇంతగా దీని మీద ఉండటంలో ఆశ్చర్యం ఏముంది

Also Read : Maha Samudram : ఒక్క ఫ్లాపు ఎన్నో లెక్కలను మారుస్తోంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి