iDreamPost
android-app
ios-app

ఫస్ట్ డే 3.5 కోట్లు రాని.. హీరోలు కూడా 35 కోట్లు అడుగుతున్నారు: కరణ్ జోహార్

Karan Johar On Stars Remuneration: బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, హోస్ట్ కరణ్ జోహార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుత పరిస్థితులు, స్టార్స్ తీసుకునే రెమ్యూనరేషన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Karan Johar On Stars Remuneration: బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, హోస్ట్ కరణ్ జోహార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుత పరిస్థితులు, స్టార్స్ తీసుకునే రెమ్యూనరేషన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఫస్ట్ డే 3.5 కోట్లు రాని.. హీరోలు కూడా 35 కోట్లు అడుగుతున్నారు: కరణ్ జోహార్

కరణ్ జోహార్.. ఈ నిర్మాత, హోస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా లెవల్లో ఎన్నో అద్భుతమైన హిట్స్ ఇచ్చారు. అలాగే ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలకు గాడ్ ఫాదర్ గా కూడా ఉన్నారు. సినిమాలు తీయడం, కాఫీ విత్ కరణ్ అనే షో చేయడం మాత్రమే కాకుండా.. ఇండస్ట్రీ గురించి, అందులో జరిగే హ్యాపినింగ్స్ ఈయన తన అభిప్రాయాలను బాహాటంగానే వెల్లడిస్తూ ఉంటారు. అదులో భాగంగానే తాజాగా హీరోల రెమ్యూనరేషన్ విషయంలో కరణ్ జోహార్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఫస్ట్ డే రోజు రూ.3.5 కోట్లు కూడా కలెక్ట్ చేయలేని హీరోలు రూ.35 కోట్లు అడుగుతున్నారు అంటూ కరణ్ జోహార్ వ్యాఖ్యానించారు.

సినిమా ఇండస్ట్రీలో అన్నీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అయిపోయాయి. ఒక వేళ రీజనల్ సినిమా అయినా కూడా బడ్జెట్ మాత్రం కనీసం రూ.50 కోట్లు అవుతోందని పలు సందర్భాల్లో నిర్మాతలు చెప్పడం చూశాం. అయితే ఇందులో ఎక్కువ భాగం రెమ్యూనరేషన్లకే సరిపోతుంది అనేది నిర్మాతల కామెంట్. అంటే నటీనటులు వారి వారి పారితోషకాలు పెంచేశారు అందుకే నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతోంది అనేది వారి వాదన. ఇలాంటి వ్యాఖ్యలకు కరణ్ జోహార్ తాజా కామెంట్స్ బలం చేకూరుస్తున్నాయి. అంటే కనీసం కలెక్షన్స్ తీసుకురాలేని వాళ్లు కూడా కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు అనే ధోరణిలో ఆయన కామెంట్స్ ఉన్నాయి.

Karan Johar

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ స్టార్ ప్రొడ్యూసర్ సినిమా మేకింగ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే సినిమా ఏంటి? దానిని ఎలా నిర్మిస్తారు? ఎంత ఖర్చు అవుతుంది? సినిమా తీసిన తర్వాత ఎంత ఖర్చు ఉంటుంది? ఇలాంటి విషయాలపై చాలా మందికి కనీస అవగాహన లేదు అంటూ కామెంట్ చేశారు. అలాగే బాలీవుడ్ లో నిర్మాణ వ్యయం పెరిగిపోవడం గురించి కూడా కరణ్ జోహార్ స్పందించారు. ‘బాలీవుడ్ లో 10 మంది స్టార్స్ ఉన్నారు. వాళ్లు ఎంత అడిగితే అంత రెమ్యూనరేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత సినిమా చేయాలి. దానిని మార్కెట్ చేయాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో క్రియేటివ్ క్రైసిస్ నడుస్తోంది.

ఇంకా కొంత మంది హీరోలు అయితే సినిమా రిలీజ్ కి ఫస్ట్ డే రూ.3.5 కోట్లు కూడా కలెక్ట్ చేయలేరు.. కానీ, రూ.35 కోట్లు డిమాండ్ చేస్తుంటారు. అంటూ కరణ్ జోహార్ కామెంట్ చేశారు. అలాగే సినిమాలు ఎప్పుడూ ఫెయిల్ కావు.. బడ్జెట్స్ మాత్రమే ఫెయిల్ అవుతాయి అంటూ చేసిన కామెంట్స్.. 30 ఏళ్ల తన సినీ ప్రయాణంలో నేర్చుకున్న గొప్ప పాఠాలు అనే ధోరణిలో చెప్పారు. ఈ ఇంటర్వ్యూలో సక్సెస్ గురించి కాకుండా.. ఎక్కువగా ఫెయిల్యూర్స్ గురించే చర్చించడం గమనార్హం. కరణ్ జోహార్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి