iDreamPost
android-app
ios-app

నా సినిమా ఫ్లాప్ అయితే వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్!

  • Published Jul 13, 2024 | 11:04 AM Updated Updated Jul 13, 2024 | 11:04 AM

ఓ స్టార్ హీరో తన సినిమాలు ఫెయిల్యూర్ అయితే కొంత మంది దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మరి ఆ హీరో ఎవరు? ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేశాడు?

ఓ స్టార్ హీరో తన సినిమాలు ఫెయిల్యూర్ అయితే కొంత మంది దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మరి ఆ హీరో ఎవరు? ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేశాడు?

  • Published Jul 13, 2024 | 11:04 AMUpdated Jul 13, 2024 | 11:04 AM
నా సినిమా ఫ్లాప్ అయితే వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్!

సినిమా ఇండస్ట్రీలో హిట్, ఫ్లాప్ లు అన్నవి సర్వసాధారణమైన విషయాలు. వరుస విజయాలు చవిచూసిన ఓ హీరో.. ఆ తర్వాత వరుసగా డిజాస్టర్లు ఖాతాలో వేసుకోవచ్చు. అంత మాత్రానా.. ఆ హీరో పని అయిపోయినట్లు అర్ధం కాదు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెబుతున్నారు అనేగా మీ అనుమానం. దానికి ఓ కారణం ఉందడోయ్. ఓ స్టార్ హీరో తన సినిమాలు ఫెయిల్యూర్ అయితే కొంత మంది దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మరి ఆ హీరో ఎవరు? ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేశాడు? పూర్తి వివరాలు..

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. దానికి రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ పెళ్లికి హాజరుకాకపోవడం. ఇంకోటి తన సినిమాలు ఫ్లాప్ అయితే.. కొంత మంది దాన్ని ఎంజాయ్ చేస్తారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేయడం. లేటెస్ట్ గా అక్షయ్ నటించి మూవీ సర్పీరా(ఆకాశమే నీ హద్దురా రీమేక్). జూలై 12న భారతీయుడు 2తో పాటుగా విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో తీవ్ర నిరాశలో ఉన్నాడు అక్షయ్. అదీకాక ఏప్రిల్ 10న విడుదల అయిన  బడే మియా చోటే మియా మూవీ బోల్తా కొట్టింది. ఈ క్రమంలోనే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

అక్షయ్ కుమార్ మాట్లాడుతూ..”ఇండస్ట్రీలో ఫ్లాప్ లు వస్తే.. మనకు అవకాశాలు రావు. సెలక్టీవ్ గా పనిచేసే హీరోలకు సైతం ఫ్లాప్ లు వస్తాయి. కానీ.. నా సినిమాలు ఫెయిల్యూర్ అయితే మాత్రం కొంత మంది దాన్ని ఎంజాయ్ చేస్తూ.. సెలబ్రేట్ చేసుకుంటారు. నన్న అలా చూడటం వాళ్లకు ఇష్టం. అయితే ఈ విషయంలో నేను అమితాబ్ బచ్చన్ నుంచి ఒకటి నేర్చుకున్నాను. అపజయాలు వచ్చినా.. మన పనిని మనం చేసుకుంటూ పోవాలని, అదృష్టాన్ని నమ్ముకోవాలని బిగ్ బి నాతో చెప్పారు. అలా నేను శ్రమను నమ్ముకుని ముందుకు సాగుతున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు ఈ స్టార్ హీరో. కాగా.. ఇటీవల కాలంలో అక్షయ్ కుమార్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయాయి. మరి అక్షయ్ షాకింగ్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio