iDreamPost
android-app
ios-app

PVR ఐనాక్స్ ఆఫర్‌.. ‘సినిమాకు రండి.. ఫ్రీగా ఛాయ్‌, సమోసా ఇస్తాం..’

  • Published Jul 15, 2024 | 10:18 AM Updated Updated Jul 15, 2024 | 10:18 AM

PVR Inox-Free Tea, Samosa, Sarfira Movie: తమ థియేటర్‌కు వచ్చి సినిమా చూస్తే.. ఉచితంగా ఛామ్‌, సమోసా ఇస్తామంటూ.. పీవీఆర్‌ ఐనాక్స్‌ చేసిన ప్రకటన ఇప్పుడు వైరల్‌గా మారింది.

PVR Inox-Free Tea, Samosa, Sarfira Movie: తమ థియేటర్‌కు వచ్చి సినిమా చూస్తే.. ఉచితంగా ఛామ్‌, సమోసా ఇస్తామంటూ.. పీవీఆర్‌ ఐనాక్స్‌ చేసిన ప్రకటన ఇప్పుడు వైరల్‌గా మారింది.

  • Published Jul 15, 2024 | 10:18 AMUpdated Jul 15, 2024 | 10:18 AM
PVR ఐనాక్స్ ఆఫర్‌.. ‘సినిమాకు రండి.. ఫ్రీగా ఛాయ్‌, సమోసా ఇస్తాం..’

బాక్సాఫీస్‌ వద్ద టాలీవుడ్‌ సినిమాలు దుమ్ము రేపుతున్నాయి. కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి. ఇక తాజాగా విడుదలైన కల్కి చిత్రం.. రెండు వారాల్లోనే సుమారు 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్‌ చేసి.. ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద తెలుగు సినిమాలు సత్తా చాటుతున్నాయి. మన సినిమాలు భారీ వసూళ్లు సాధించి.. దూసుకుపోతుండగా.. బాలీవుడ్‌ సినిమాలు మాత్రం ఈ రేసులో చతికిలబడుతున్నాయి. ఒకప్పుడు ఇండియన్‌ సినిమా అంటే బాలీవుడ్‌ మూవీలే అన్నట్లుగా ఉండేవి. కానీ ఇప్పుడా పరిస్థితి మారింది. ఇండియన్‌ సినిమా అంటే.. దక్షిణాది సినిమాలు.. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌ చిత్రాలే అంతర్జాతీయ వేదికల మీద సత్తా చాటుతున్నాయి. ఆస్కార్‌ లాంటి అత్యున్నత పురస్కారం కూడా టాలీవుడ్‌కే తరలి వచ్చింది. అదలా ఉంచితే తాజాగా విడుదలైన ఓ బాలీవుడ్‌ సినిమాను చూడమంటూ ఏకంగా పీవీఆర్‌ ఐనాక్స్‌ ప్రేక్షకులను బ్రతిమిలాడుతుంది. సినిమాకు వస్తే ఉచితంగా ఛాయ్‌, సమోసా ఇస్తామని ప్రకటించింది. ఆ వివరాలు..

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాలు అంటే.. భారీ కలెక్షన్లు అనే మాట వినిపించేది. అక్షయ్‌ కుమార్‌ సినిమా అంటే కచ్చితంగా లాభాలే అన్న నమ్మకం ఉండేది. ఒకప్పుడు వరుస విజయాలు చవి చూసిన అక్షయ్‌ కుమార్‌.. ఇప్పుడు మాత్రం వరుస ప్లాఫ్‌లు చవి చూస్తున్నాడు. ముఖ్యంగా కరోనా తర్వాత నుంచి ఈ స్టార్ హీరో నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద వరుసగా బోల్తా పడుతున్నాయి. ఇలా ఉండగా.. తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘సర్ఫిరా’ విడుదలైంది. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని ఎదుర్కొంటుంది. కోట్లాది రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాపై ప్రేక్షకులు అసలు ఆసక్తి చూపడం లేదు.

దాంతో ప్రేక్షకులను ఆకర్షించి.. సినిమాకు రప్పించడం కోసం మల్టిప్లేక్సులు.. ఉచితంగా టీ, సమోసాలు అందించాలని నిర్ణయించుకున్నాయి. సాధారణంగా మొదటి రోజు స్టార్ సినిమాలు బాగా కలెక్ట్ చేయాలి. కానీ ‘సర్ఫిరా’ సినిమా తొలిరోజు (జూలై 12న) కేవలం రూ.2.50 కోట్లు మాత్రమే వసూలు చేసింది. రెండో రోజు రూ.4.50 కోట్లు రాబట్టింది. సినిమా కలెక్షన్లు పెంచాలని భావిస్తోన్న మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు టీ, సమోసాలను ఆఫర్ చేసింది. ఈ విషయాన్ని ‘పీవీఆర్ ఐనాక్స్’ మల్టీప్లెక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సర్ఫిరా సినిమా చూసేందుకు వచ్చే వారికి 2 సమోసాలు, 1 టీ, 1 లగేజీ ట్యాగ్ ఉచితంగా ఇవ్వనున్నట్లు అందులో ప్రకటించింది.

ఇక సర్ఫిరా సినిమా విషయానికి వస్తే.. ప్రముఖ డైరెక్టర్‌.. సుధా కొంగర దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. కాగా ఇది తమిళ చిత్రం ‘సురారై పోట్రు’ (తెలుగులో ఆకాశమే హద్దురా)కి హిందీ రీమేక్‌. ఆ తమిళ సినిమా గతంలో హిందీలోకి డబ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. మళ్లీ అదే సినిమాను అక్షయ్‌ కుమార్‌తో హిందీలో రీమేక్ చేయడంతో జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇప్పటికే ఈ సినిమా కథ అందరికి తెలిసిపోవడంతో ‘సర్ఫిరా’ సినిమా చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తి చూపడం లేదు. దాంతో వసూళ్లు చాలా తక్కువగా ఉన్నాయి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbetJojobet GirişjojobetHoliganbet Giriş