Maha Samudram : ఒక్క ఫ్లాపు ఎన్నో లెక్కలను మారుస్తోంది

By iDream Post Oct. 20, 2021, 06:30 pm IST
Maha Samudram  :  ఒక్క ఫ్లాపు ఎన్నో లెక్కలను మారుస్తోంది

తాము రాసిందే గొప్ప కథనే భ్రమలో నుంచి బయటికి వచ్చి దర్శకులు ప్రాక్టికల్ గా ఆలోచించాలి. లేదంటే ఏమవుతుందో మహా సముద్రం నిరూపించింది. మంచి అంచనాలతో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ దిశగా పరుగులు పెడుతూ కోలుకునే సూచనలు చూపించడం లేదు.కొందరు హీరోలు నో చెప్పినా తాను గొప్పగా తీశానని పదే పదే చెప్పిన అజయ్ భూపతికి ఇది కొంచెం గట్టి దెబ్బే. ఇతని జడ్జ్ మెంట్ ని ఇకపై నిర్మాతలు గుడ్డిగా ఒప్పుకోకపోవచ్చు. హీరోలు మార్పులు చేయమనే కండిషన్ పెట్టొచ్చు. కేవలం ఒక్క ఫ్లాప్ తో ఏ డైరెక్టర్ జాతకం సమూలంగా మారిపోదు కానీ సరైన టైంలో జరిగిన లోపాలను సరిచేసుకుంటే హిట్టు ట్రాక్ పట్టడం కష్టమేమి కాదు.

నిజానికీ మహా సముద్రం ముందు నాగ చైతన్య, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రవితేజ వద్దకు వెళ్ళింది. వీళ్ళ పేర్లే గతంలో బయటికి వచ్చాయి. మొదటి ఇద్దరూ ట్రై చేశారు కానీ ఫైనల్ గా కుదరలేదు. ఇప్పుడు అదితి రావు హైదరి చేసిన క్యారెక్టర్ ని సమంతాతో వేయించాలని అజయ్ భూపతి అనుకున్నారు. కానీ జరగలేదు. బహుశా మోసం చేసి వెళ్ళిపోయిన సెకండ్ హీరో బిడ్డ తల్లిగా నటించడం ఇష్టం లేకపోవడం వల్ల కావొచ్చు. ఆ తర్వాత రవితేజ ఎస్ చెప్పి డ్రాప్ అవ్వడం గురించి చిన్నపాటి వివాదం కూడా రేగింది. కట్ చేస్తే ఫైనల్ గా శర్వా-సిద్ధార్థ్ కాంబినేషన్ ని సెట్ చేసుకుంటే ఇలా జరిగిపోయింది. భయపడినంతా అయ్యింది. నష్టం మిగిలింది.

ఏదైనా విభిన్న ప్రయత్నం చేసేటప్పుడు ఆయా బాషల ఆడియన్స్ సెన్సిబిలిటీస్ తో పాటు క్యారెక్టరైజేషన్ల విషయంలో జాగ్రత్త వహించాలి. ట్రైలర్ కట్లు ఆసక్తి రేపితే మహా అయితే ఓపెనింగ్స్ వస్తాయి. ఆ తర్వాత సినిమాను నడిపించాల్సింది పబ్లిక్ టాకే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లో ఈ అంశం బాగా పని చేసింది. కానీ మహా సముద్రం కనీసం మ్యూజికల్ గానూ మెప్పించేలా లేకపోవడం మరో దెబ్బ. దీని వల్లే ధనుష్ తో ప్రతిపాదన స్టేజి లో ఉన్న అజయ్ భూపతి మూడో సినిమా ఇప్పుడు హోల్డ్ లో పడినట్టు చెన్నై టాక్. మైత్రి సంస్థ కోసం ఓ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న ఈ దర్శకుడు నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నాడో ఆసక్తికరంగా మారింది

Also Read : Natyam : సత్యం రామలింగరాజు కోడలే ‘నాట్యం’ హీరోయిన్!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp