iDreamPost

నెల నెలా ఆదాయం కావాలా? ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే చాలు.. నెలకు 5 వేలు పొందొచ్చు

మీరు మంచి రాబడినిచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? నెల నెలా ఆదాయం ఉంటే బాగుండు అనుకుంటున్నారా? అయితే ఈ పథకంలో పెట్టుబడి పెడితే నెలకు 5 వేలు పొందొచ్చు.

మీరు మంచి రాబడినిచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? నెల నెలా ఆదాయం ఉంటే బాగుండు అనుకుంటున్నారా? అయితే ఈ పథకంలో పెట్టుబడి పెడితే నెలకు 5 వేలు పొందొచ్చు.

నెల నెలా ఆదాయం కావాలా? ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే చాలు.. నెలకు 5 వేలు పొందొచ్చు

ప్రస్తుత రోజుల్లో అన్ని ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఫ్యుయల్ రేట్స్, నిత్యావసరాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క వస్తువు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మరోవైపు ఆదాయాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. అందుకే చాలా మంది పార్ట్ టైమ్ జాబ్స్ చేసేందుకు రెడీ అవుతుంటారు. నేటి రోజుల్లో అదనపు ఆదాయం కావాలని కోరకుంటున్నారు. మరికొంత మంది ఆల్రెడీ సంపాదించిన డబ్బుపై ప్రతీ నెల కొంత ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం రిస్క్ లేని మంచి రాబడినిచ్చే పథకాల కోసం ఆరా తీస్తున్నారు. మరి మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ప్రభుత్వానికి చెందిన బెస్ట్ స్కీమ్ అందుబాటులో ఉంది. ఈ పథకంలో పెట్టుబడి పెడితే నెలకు రూ. 5 వేలు అందుకోవచ్చు. ఆ పథకం పేరు పోస్టాఫీస్ మంథ్లీ ఇన్ కమ్ స్కీమ్.

పోస్టాఫీస్ అందించే పథకాల్లో స్థిరమైన రాబడితో పాటు పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. అంతే కాదు పెట్టుబడిపై మంచి వడ్డీ లభిస్తుంది. పోస్టాఫీస్ దేశ ప్రజల కోసం అద్భుతమైన పథకాలను తీసుకొచ్చింది. వాటిల్లో ఒకటి పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌. నెల నెలా ఆదాయం కోరుకునే వారికి ఇది బెస్ట్ స్కీమ్ అని చెప్తున్నారు నిపుణులు. ఈ పథకంలో ఒకేసారి పెట్టుబడి పెట్టి 5 ఏళ్ల పాటు నెలవారీ ఆదాయం పొందొచ్చు. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో ఖాతాను వ్యక్తిగతంగా, జాయింటుగా తెరవొచ్చు. 10 ఏళ్లు నిండిన పిల్లల పేరుపై గార్డియన్‌ ఖాతా తెరవొచ్చు.

ఈ పథకంలో క‌నీసం రూ.1,000 ఇన్వెస్ట్ చేయొచ్చు. సింగిల్‌ అకౌంట్ లో అయితే గ‌రిష్ఠంగా రూ.9 లక్షలు, జాయింట్ అకౌంట్ అయితే గరిష్ఠంగా రూ.15 లక్షలు పెట్టుబ‌డి పెట్టొచ్చు. ప్రస్తుతం ఈ పథకంపై 7.4 శాతం వడ్డీ లభిస్తున్నది. ఈ పథకం కాల వ్యవధి 5 సంవత్సరాలు. ఈ పథకంలో ప్రతీ నెల 5 వేల ఆదాయం కావాలనుకుంటే 9 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పెట్టుబడిపై ప్రస్తుతం ఉన్న వడ్డీరేటు ప్రకారం.. ఏడాదికి రూ.66,600 వడ్డీ వస్తుంది. 5 సంవత్సరాలలో అనగా పథకం మెచ్యూరిటీ సమయానికి వడ్డీ రూపంలో మొత్తం రూ. 3,33,000 జమ అవుతుంది. ఈ మొత్తం నుంచి ప్రతి నెల 5 ఏళ్లపాటు రూ. 5,550 పొందొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి