iDreamPost

బంగార్రాజు ఎఫ్3ల తక్షణ కర్తవ్యం

బంగార్రాజు ఎఫ్3ల తక్షణ కర్తవ్యం

నాగార్జునకు సోగ్గాడే చిన్ని నాయనా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టాక ఆ సీజన్ మీదే కన్ను ఉంది. అందుకే దాని సీక్వెల్ బంగార్రాజుని కూడా అదే బరిలో దింపాలని గట్టిగానే ప్లాన్ చేసుకున్నారు. ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు కూడా బాలకృష్ణ డిక్టేటర్, జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, ఎక్స్ ప్రెస్ రాజా పోటీని తట్టుకుని మరీ అది ఘనవిజయం సాధించింది. అదే కాన్ఫిడెన్స్ ఈసారి కూడా చూపించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఆర్ఆర్ఆర్ 7కి ఫిక్స్ కావడంతో సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ లే డౌట్ లో ఉన్నాయి. మార్చి లేదా ఏప్రిల్ కు పోస్ట్ పోన్ చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నాయి. సో బంగార్రాజు అంత ధైర్యం చేయగలడా.

దీంతో పాటు వెంకటేష్ వరుణ్ తేజ్ ల ఎఫ్3 కూడా పండగే లక్ష్యంగా షూట్ జరుపుకుంటోంది. తీరా చూస్తే ఇప్పుడు సీన్ టైట్ గా మారిపోయింది. ఈ నేపథ్యంలో రిస్క్ చేస్తే కలెక్షన్ల మీద ప్రభావం పడుతుంది. ఎఫ్2 కూడా వినయ విధేయ రామ, ఎన్టీఆర్ కథానాయకుడు, రజినీకాంత్ పేటల పోటీని తట్టుకుని మరీ బ్లాక్ బస్టర్ సాధించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. కరోనా వచ్చాక బాక్సాఫీస్ సమీకరణాలు అంత సులభంగా అర్థం కావడం లేదు. అందుకే తొందరపడితే నిర్మాతకే ఇబ్బంది. దర్శకుడు అనిల్ రావిపూడి వేగంగా పూర్తి చేస్తున్నాడు కానీ రెండేళ్లుగా ఫాలో అవుతున్న పండగ సెంటిమెంట్ తను కూడా మిస్ అవ్వాల్సి రావొచ్చు.

ఈ రెండు సినిమాలకు సంబంధించి ఇంకా ఎలాంటి అఫీషియల్ ప్రమోషన్ పెద్దగా మొదలుకాలేదు. వేచి చూసే ధోరణిలోనే ఇద్దరూ ఉన్నారు. ఆర్ఆర్ఆర్ కు ఉన్న క్రేజ్ ను మ్యాచ్ చేయడం అంత సులభం కాదు. ఒకవేళ దానికి బాహుబలి రేంజ్ టాక్ వచ్చిందా దగ్గరలో ఉన్న సినిమాలన్నీ నలిగిపోవడం ఖాయం. సంక్రాంతికి రెండు మూడు సినిమాలు ఆడటం సహజమే అయినా ఒకపక్క ఆర్ఆర్ఆర్ రెండోపక్క రాధే శ్యామ్ ని పెట్టుకుని సాహసం చేస్తే ఏమవుతుందో ఈజీగా ఊహించుకోవచ్చు. పైగా బంగార్రాజు, ఎఫ్3లు పాన్ ఇండియా మూవీస్ కాదు. రీజనల్ కంటెంట్ తో వస్తున్నవి. సో డ్రాప్ అవ్వడం మినహా వేరే ఆప్షన్ ఉండకపోవచ్చు

Also Read : ఆహా కోసం రంగంలోకి బాలకృష్ణ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి