iDreamPost
android-app
ios-app

రూటు మార్చిన వరుణ్ తేజ్! ఇకపై అన్నీ క్రేజీ ప్రాజెక్ట్స్!

  • Published Jul 23, 2024 | 8:54 PM Updated Updated Jul 23, 2024 | 8:54 PM

Varun Tej Upcoming Films: టాలీవుడ్ హీరోల సినిమాల కోసం ప్రేక్షకులు ఎంత గానో ఎదురుచూస్తున్నారు. అందులోను మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే సినిమాల కోసం అయితే ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మూవీస్ కు సంబంధించిన ఓ క్రేజి అప్ డేట్ వచ్చేసింది.

Varun Tej Upcoming Films: టాలీవుడ్ హీరోల సినిమాల కోసం ప్రేక్షకులు ఎంత గానో ఎదురుచూస్తున్నారు. అందులోను మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే సినిమాల కోసం అయితే ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మూవీస్ కు సంబంధించిన ఓ క్రేజి అప్ డేట్ వచ్చేసింది.

  • Published Jul 23, 2024 | 8:54 PMUpdated Jul 23, 2024 | 8:54 PM
రూటు మార్చిన వరుణ్ తేజ్! ఇకపై అన్నీ క్రేజీ ప్రాజెక్ట్స్!

ఇండస్ట్రీలో ఇప్పటికి టాలీవుడ్ హీరోల వరుస సినిమాలు లైన్ అప్ లో ఉన్నాయి. అయినా సరే ఇంకా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. ఇక అందులోను మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే సినిమాల కోసం అయితే ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మూవీస్ కు సంబంధించిన ఓ క్రేజి అప్ డేట్ వచ్చేసింది. అయితే వరుణ్ తేజ్ ఖాతాలో ఓ మంచి హిట్ పడి చాలా రోజులే అయింది. చివరగా.. వరుణ్ తేజ్ గాండీవదారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలలో కనిపించాడు. కానీ ఆ రెండు సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ మంచి హిట్స్ తో కమ్ బ్యాక్ ఇవ్వడానికి వరుస సినిమాలతో రెడీ అవుతున్నారట. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం వరుణ్ తేజ్ డిఫరెంట్ కథలను ఎంపిక చేసుకునే.. ప్రయత్నంలో ఉన్నారు. వాటితో పాటు పాన్ ఇండియా సినిమాలను కథలను కూడా వింటున్నారట. ఈ క్రమంలో ఇప్పుడు కరుణ కుమార్ దర్శకత్వంలో.. ‘మట్కా’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు వరుణ్ తేజ్. ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే.. ఈ మూవీ కథ అంతా కూడా.. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో ఉండే మాఫియా గ్యాంగ్ తో కూడిన.. ఓ పిరియాడికల్ జోనర్ మూవీగా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. 2025లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు వరుణ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా.. ఈ సినిమా రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో అయినా వరుణ్ బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదో చూడాలి. అయితే వరుణ్ ప్రస్తుతం రూటు మార్చినట్టు తెలుస్తుంది. ఈ సినిమాతో పాటు.. మరిన్ని క్రేజి ప్రాజెక్ట్స్ ను లైన్ అప్ చేస్తున్నాడు వరుణ్.

అలా ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే.. వరుణ్ మరికొన్ని సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. యంగ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో.. ఓ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ చేయడానికి వరుణ్ ఒకే చెప్పాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను స్టార్ చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. ఇక ఆ తర్వాత.. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో.. టచ్ చేసి చూడు ఫేమ్ విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ఓ ప్రేమ కథను కూడా వరుణ్ చేస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ చివరిలో స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ లెక్కన చూసినట్లయితే ప్రస్తుతం వరుణ్ చేతిలో మూడు క్రేజి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటి హిట్ టాక్ సంపాదించుకున్నా కానీ.. వరుణ్ కెరీర్ లో మళ్ళీ వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం లేదు. మరి ఏమౌతుందనేది వేచి చూడాలి. ఈ సినిమాలపై మరిన్ని అప్ డేట్స్ ఇంకా రావాల్సి ఉంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletPusulabetPusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis Giriş