iDreamPost
android-app
ios-app

అబ్బాయ్ మెచ్చిన దర్శకుడితో.. బాబాయ్! ఈసారి హిట్ పక్కానా?

  • Published Jul 12, 2024 | 3:18 PM Updated Updated Jul 12, 2024 | 3:18 PM

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబో సెట్ అయినట్లు తెలుస్తోంది. విరాట పర్వం దర్శకుడితో వెంకీ మామ ఓ సినిమా చేయబోతున్నాడని సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబో సెట్ అయినట్లు తెలుస్తోంది. విరాట పర్వం దర్శకుడితో వెంకీ మామ ఓ సినిమా చేయబోతున్నాడని సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Jul 12, 2024 | 3:18 PMUpdated Jul 12, 2024 | 3:18 PM
అబ్బాయ్ మెచ్చిన  దర్శకుడితో.. బాబాయ్! ఈసారి హిట్ పక్కానా?

చేసింది ఒకటి, రెండు సినిమాలే అయినప్పటికీ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కొందరు డైరెక్టర్లు. అలాంటి వారిలో ఒకడు టాలెంటెడ్ దర్శకుడు వేణు ఉడుగుల. అతడు చేసింది రెండంటే రెండు చిత్రాలే. ఒకటి శ్రీ విష్ణుతో ‘నీదీ  నాదీ ఒకే కథ’ మరోటి రానాతో ‘విరాట పర్వం’. ఈ రెండు సినిమాలతో అభిరుచి గల డైరెక్టర్ గా ఇండస్ట్రీలో గుర్తింపు పొందాడు. సామాజిక బాధ్యత సినిమాలకు ఉందని, అందుకోసమే వాటితోనే ప్రయాణం చేస్తున్నాడు ఈ దర్శకుడు. ఇక తన మూడో సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ పరిశ్రమలో వైరల్ గా మారింది.

డైరెక్టర్ వేణు ఉడుగుల.. నీదీ నాదీ ఒకే కథ, విరాట పర్వం సినిమాలతో ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై కసరత్తులు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కోసం ఓ కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, ఇందులో వెంకటేష్ తో పాటుగా మరో ఇద్దరు హీరోలు కూడా ఉంటారని తెలుస్తోంది. ఆ ఇద్దరు యంగ్ హీరోలు ఎవరు అన్నది తెలియాల్సి ఉంది.

కాగా.. ప్రస్తుతం వెంకీ మామ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయ్యాకే.. వేణు ఉడుగుల చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. ఇక ఈ క్రేజీ కాంబో కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మరి ఈ కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss