iDreamPost

విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్! రూ. 4 లక్షలు ఇప్పుడే పొందండి.!

Vidya Lakshmi Portal: విద్యార్థుల కోసం కూడా పలు స్కీమ్స్ ను ప్రారంభించింది. ఉన్నత చదువుల విషయంలో విద్యార్థులకు ఆర్థిక సమస్యలు రాకుండా ఉండేందుకు కేంద్రం ప్రభుత్వం వివిధ పథకాలను అందిస్తుంది.

Vidya Lakshmi Portal: విద్యార్థుల కోసం కూడా పలు స్కీమ్స్ ను ప్రారంభించింది. ఉన్నత చదువుల విషయంలో విద్యార్థులకు ఆర్థిక సమస్యలు రాకుండా ఉండేందుకు కేంద్రం ప్రభుత్వం వివిధ పథకాలను అందిస్తుంది.

విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్! రూ. 4 లక్షలు ఇప్పుడే పొందండి.!

కేంద్ర ప్రభుత్వం ప్రజలక కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రారంరభించారు. అలానే విద్యార్థుల కోసం కూడా పలు స్కీమ్స్ ను ప్రారంభించింది. ఉన్నత చదువుల విషయంలో విద్యార్థులకు ఆర్థిక సమస్యలు రాకుండా ఉండేందుకు కేంద్రం ప్రభుత్వం వివిధ పథకాలను అందిస్తుంది. అందుకే విద్యార్థుల కోసం ప్రత్యేక నిధుల ద్వారా ఆర్థిక సాయం అదిస్తుంది. ఈ క్రమంలోనే విద్యార్థులకు కేంద్రం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. వారి కోసం విద్య లక్ష్మీ అనే పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా విద్యార్థులు దాదాపు  రూ.4 లక్షలు పొందే అవకాశం ఉంది. మరి.. అసలు ఈ స్కీమ్ గురించి ఇప్పుడు చూద్దాం..

కేంద్ర ప్రభుత్వం విద్యాలక్ష్మీ పథకం ద్వారా విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తుంది. ఉన్నత విద్యను చదవాలి అనుకునే విద్యార్థులకు ఆర్థిక సమస్యలు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ విద్యా లక్ష్మీ పోర్టల్ ద్వారా విద్యార్థులు రుణాలు, స్కాలర్ షిప్ లను పొందుతారు. ఈ పోర్టల్ ని ప్రోటీన్ ఎగోవ్ టెక్నాలజీ లిమిటెడ్ నిర్వహించింది. ఈ పోర్టల్ బ్యాంకులకు, విద్యార్థుల మధ్యవర్తిగా పని చేయనుంది. కావున విద్యార్థులు ఈజీగా రుణాలను పొందుతారు. ఇక విద్యా రుణం కోసం విద్యార్థులు బ్యాంకుల చుట్టు తిరగాల్సిన పనిలేదు.

ఈ పోర్టల్ ద్వారా ఏదైనా బ్యాంకు రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు ఈ పోర్టల్ లో బ్యాంకులు అందించే రుణంకి సంబంధించిన సమాచారం కూడా తెలుసుకోవచ్చు. ఏకకాలంలో విద్యార్థులు ఇతర బ్యాంకులకు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు.  విద్యాలక్ష్మీ పోర్టల్ అనేది విద్య రుణ వడ్డీ ప్రయోజనాల కోసం, సెంట్రల్ సెక్టర్ వడ్డీ రాయితీకి కట్టుబడి ఉండేలా చూస్తుంది. ఇక ఈ విద్యాలక్ష్మీ పోర్టల్ లో దరఖాస్తు చేసుకునే వారు.. ఇండియన్ సిటిజన్స్ అయ్యి ఉండాలి. 12వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. భారతదేశంలో లేక ఇతర దేశాలలో విద్యార్థులు చదువుకునేందుకు రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు.

ఈ పోర్టల్ ద్వారా మీరు ఎటువంటి తనిఖీ లేకుండా రూ. 4 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు. ఈ రుణం వడ్డీ రేటు 8.4 శాతం నుండి ప్రారంభమవుతుంది. ఈ రుణం మొత్తాన్ని కూడా 15 ఏళ్లలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. విద్య లక్ష్మి పోర్టల్ దరఖాస్తు చేసుకోవటానికి KYC పత్రాలు, గత ఆరు నెలల బ్యాంక్ పాస్ బుక్ స్టేట్ మెంట్, పది, 12వ తరగతులు మార్క్ షీట్లు, గ్రాడ్యుయేషన్ కోర్సులు, ఫీజు వివరాలతో పాటు కాలేజీ లేక యూనివర్సిటీ అడ్మిషన్ కార్డు కాపీలు వంటివి పత్రాలు ఉండాలి. ఇక పూర్తి వివరాలకు https://www.vidyalakshmi.co.in/students తెలుసుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి