iDreamPost

Virat Kohli: వీడియో: IND vs ENG మ్యాచ్.. బాధలో విరాట్ కోహ్లీ! ఓదార్చిన ద్రవిడ్..

ఈ వరల్డ్ కప్ లో మెరుపులు మెరిపిస్తాడనుకున్న విరాట్ కోహ్లీ.. పూర్తిగా విఫలం అయ్యాడు. తాజాగా ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యాడు. ఈ క్రమంలో డ్రెస్సింగ్ రూమ్ లో బాధలో ఉన్న కోహ్లీని ద్రవిడ్ ఓదార్చాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఈ వరల్డ్ కప్ లో మెరుపులు మెరిపిస్తాడనుకున్న విరాట్ కోహ్లీ.. పూర్తిగా విఫలం అయ్యాడు. తాజాగా ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యాడు. ఈ క్రమంలో డ్రెస్సింగ్ రూమ్ లో బాధలో ఉన్న కోహ్లీని ద్రవిడ్ ఓదార్చాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Virat Kohli: వీడియో: IND vs ENG మ్యాచ్.. బాధలో విరాట్ కోహ్లీ! ఓదార్చిన ద్రవిడ్..

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో 68 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది టీమిండియా. దాంతో 2022 వరల్డ్ కప్ సెమీస్ లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ మెగాటోర్నీలో ఫుల్ స్వింగ్ లో ఉన్న టీమిండియా టైటిల్ పోరులో పటిష్టమైన సౌతాఫ్రికాను ఢీకొనబోతోంది. ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. కాగా.. ఈ వరల్డ్ కప్ లో మెరుపులు మెరిపిస్తాడనుకున్న విరాట్ కోహ్లీ.. దారుణంగా విఫలం అయ్యాడు. తాజాగా ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యాడు. ఈ క్రమంలో డ్రెస్సింగ్ రూమ్ లో బాధలో ఉన్న కోహ్లీని ద్రవిడ్ ఓదార్చాడు. అసలేం జరిగిందంటే?

ఐపీఎల్ 2024 సీజన్ లో పరుగుల సునామీ సృష్టించిన టీమిండియా రన్ మెషిన్.. టీ20 వరల్డ్ కప్ లో మాత్రం ఊహించని విధంగా విఫలం అయ్యాడు. గ్రూప్ దశలో, సూపర్ 8లో కూడా ఫామ్ ను అందుకోలేకపోయాడు. ఇక నాకౌట్స్ లో మంచి రికార్డ్స్ ఉండటంతో.. ఈ మ్యాచ్ లో అయినా తిరిగి టచ్ లోకి వస్తాడని భావించారు ఫ్యాన్స్. కానీ.. ఇంగ్లండ్ తో జరిగిన సెమీ ఫైనల్లో 9 బంతుల్లో 9 పరుగులు చేసి భారీ షాట్ కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు. దాంతో మరోసారి ఫ్యాన్స్ నిరాశకు గురైయ్యారు. ఇక ఔట్ అయిన తర్వాత నిరాశలో బ్యాట్ కు పంచు ఇచ్చి.. పెవిలియన్ చేరాడు.

విరాట్ కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిన తర్వాత కూడా దిగాలుగా కూర్చున్నాడు. పక్కనే ఉన్న సహచరులు రవీంద్ర జడేజా, బుమ్రా, కుల్దీప్ లతో ఏం మాట్లాడకుండా బాధగా ఉన్నాడు. ఇది గమనించిన కోచ్ రాహుల్ ద్రవిడ్ వెంటనే కోహ్లీ దగ్గరకు వెళ్లి ఓదార్చాడు. క్రికెట్ లో ఇలాంటివి సహజం అన్నట్లుగా ద్రవిడ్ సర్ధిచెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా.. ఫైనల్ మ్యాచ్ లో టీమిండియాను విరాట్ కోహ్లీనే గెలిపిస్తాడని చెప్పుకొచ్చాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఫైనల్ మ్యాచ్ లో అయినా విరాట్ రాణించి.. జట్టుక  వరల్డ్ కప్ అందిస్తే చూడాలనుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి