iDreamPost

నోరు జారుతున్న రేవంత్! కాంగ్రెస్‌ని ముంచేలా ఉన్నాడే!

  • Published Nov 08, 2023 | 3:51 PMUpdated Nov 08, 2023 | 3:51 PM

ఎన్నికల సందర్భంగా రేవంత్‌ రెడ్డి చేస్తోన్న విమర్శలపై సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారు. ఆయన వైఖరి ఇలానే కొనసాగితే.. పార్టీకి ప్రమాదం అంటున్నారంట. ఆ వివరాలు.

ఎన్నికల సందర్భంగా రేవంత్‌ రెడ్డి చేస్తోన్న విమర్శలపై సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారు. ఆయన వైఖరి ఇలానే కొనసాగితే.. పార్టీకి ప్రమాదం అంటున్నారంట. ఆ వివరాలు.

  • Published Nov 08, 2023 | 3:51 PMUpdated Nov 08, 2023 | 3:51 PM
నోరు జారుతున్న రేవంత్! కాంగ్రెస్‌ని ముంచేలా ఉన్నాడే!

తెలంగాణలో ఎన్నికల సమరం కొనసాగుతుంది. నవంబర్‌ 30న పోలింగ్‌ జరగనుండగా.. డిసెంబర్‌ 3న ఫలితాలు వెల్లడిస్తారు. ప్రస్తుతం పార్టలన్నీ ప్రచార కార్యక్రమాలతో బీజిగా ఉన్నాయి. గెలుపు కోసం అన్ని రకాలుగా శ్రమిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల తరఫున ఢిల్లీ పెద్దలు వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఇక బీఆర్‌ఎస్‌ తరఫున కేసీఆర్‌, హరీష్‌రావు, కేటీఆర్‌ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక ఎన్నికల వేళ పార్టీలన్ని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజం. అయితే ఇవి విధానాల పరంగా, రాజకీయ సిద్ధాంతాల పరంగా ఉంటే బాగుటుంది. కానీ ప్రస్తుత నాయకులు మాత్రం వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. అసభ్యకరంగా మాట్లాడుతున్నారు.

ఇక ఇలా నోరు పారేసుకుంటున్న వారిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. టీడీపీ నుంచి బయటకు వచ్చిన రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆ తర్వాత పార్టీ బలోపేతం కోసం ఆయన తీవ్రంగానే శ్రమించారు. మరీ ముఖ్యంగా అధికార పార్టీపై దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఓవైపు పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూనే.. మరోవైపు అధికార పార్టీ లోటుపాట్లను ఎత్తి చూపుతూ.. ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఇక ఎన్నికల ప్రచార సమయంలో మరింత దూకుడుగా ఉండాలి. అయితే అవి హద్దు మీరితే మనకే నష్టం కలిగిస్తోంది. ప్రస్తుతం రేవంత్‌ వ్యాఖ్యలు చూసిన జనాలు.. ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్‌ మీద విమర్శలు చేస్తోన్న రేవంత్‌ రెడ్డి.. వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. సీఎం కేసీఆర్‌పై వ్యక్తిగత దూషణలకు దిగారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార సభలో రేవంత్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ గురించి.. నోటితో అనలేని మాటలు అన్నాడు. ఇక తాజాగా మీడియాపై కూడా విరుచుకుపడ్డారు రేవంత్‌రెడ్డి. ఏకంగా గాడిద కొడుకులు, పండబెట్టి తొక్కుతానంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రేవంత్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎన్నికల వేళ ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిది. పార్టీల పరంగా, సిద్ధాంతాల పరంగా విమర్శలు ఉండాలి తప్ప.. అవి వ్యక్తిగత దూషణలుగా మారకూడదు. ఇలా చేస్తే జనాల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. ప్రస్తుతం రేవంత్‌ వైఖరి కారణంగా కాంగ్రెస్‌ పార్టీ ఇలాంటి పరిస్థితులను చవి చూడాల్సి వస్తోంది. గతంతో పోల్చితే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ కాస్త పుంజుకుంది. ఈ విషయాన్ని అనేక సర్వేలు వెల్లడించాయి కూడా. దాంతో అధిష్టానం కూడా మెజారిటీ స్థానాల్లో గెలుపు కోసం కృషి చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్‌ వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతుంది అని భావిస్తున్నారనట కాంగ్రెస్‌ సీనియర్లు. రేవంత్‌ వైఖరి చూస్తే కాంగ్రెస్‌ను ముంచేలా ఉన్నాడే అని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలే చర్చించుకుంటున్నారని తెలుస్తోంది. రేవంత్‌ వ్యాఖ్యలపై జనాలు కూడా విమర్శలు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి