Dharani
TG Budget 2024-Rs 723 Crore For Subsidy Gas Cylinder Scheme: తెలంగాణ ప్రభుత్వం.. గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..
TG Budget 2024-Rs 723 Crore For Subsidy Gas Cylinder Scheme: తెలంగాణ ప్రభుత్వం.. గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..
Dharani
తెలంగాణలో గ్యాస్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల వేళ ఆరు గ్యారెంటీల పేరుతో అనేక హామీలను ఇచ్చిన సంగతి తెలిసిందే. దానిలో మహిళల కోసం ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణంతో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్‌తో పాటు నెలకు 2500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి రాగానే.. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి హామీలను ముందుగా అమలు చేసింది. ఇక ఇప్పుడు కీలకమైన 2 లక్షల రైతు రుణమాఫీ హామీ అమలుకు ముందుకు వచ్చింది. మూడు విడతల్లో దీన్ని అమలు చేస్తామని తెలిపారు. ఇప్పటికే మొదటి విడతలో భాగంగా లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేశారు. జూలై చివరి నాటికి రెండో విడత, ఆగస్టు 15 నాటికి మొత్తం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలోని గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..
తెలంగాణలో మొదటిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్దపీట వేసింది. బడ్జెట్‌లో ప్రధానంగా.. కాంగ్రెస్ పార్టీకి అధికారం తెచ్చిపెట్టిన ఆరు గ్యారెంటీల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే.. బడ్జెట్‌లోనూ ఆరు గ్యారెంటీల అమలుకు సరిపోయేలా నిధుల కేటాయింపులు చేసింది. ముఖ్యంగా.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌తో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ల పథకాల కోసం.. రేవంత్ సర్కార్ బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది.
ఈ సందర్భంగా తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరల నుంచి సామాన్యులకు ఊరట కల్పించేందుకుగానూ.. తమ ప్రభుత్వం, మహాలక్ష్మి పథకం కింద రూ.500కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 39, 57,637 కుటుంబాలకు లబ్ధి చేకూరిందని తెలిపారు. వీరందరికి సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌ను అందించామని చెప్పుకొచ్చారు. కాగా.. ఇప్పటికే ఈ పథకం కోసం 200 కోట్లను ప్రభుత్వం వెచ్చించిందని తెలిపారు. కాగా… ఈ బడ్జెట్‌లో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల కోసం రూ.723 కోట్లు కేటాయిస్తున్నట్టు భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. దీంతో.. గ్యాస్ సిలిండర్ల లబ్దిదారులకు ఇక ఎలాంటి పెండింగులు లేకుండా.. సబ్సిడీ డబ్బు అందనుంది. దీనిపై తెలంగాణ గ్యాస్ సిలిండర్ వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.