iDreamPost
android-app
ios-app

Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వరుసగా మరో 2 రోజులు హాలీడేస్‌.. కారణమిదే

  • Published Jul 26, 2024 | 10:17 AM Updated Updated Jul 26, 2024 | 10:17 AM

TG School Holidays On July 27 28 2024-Bonalu Festival: విద్యార్థులకు పండగలాంటి వార్త అని చెప్పవచ్చు. రేపు ఎల్లుండి అనగా శనివారం, ఆదివారం నాడు వరుసగా 2 రోజులు సెలవులు రానున్నాయి. ఆ వివరాలు..

TG School Holidays On July 27 28 2024-Bonalu Festival: విద్యార్థులకు పండగలాంటి వార్త అని చెప్పవచ్చు. రేపు ఎల్లుండి అనగా శనివారం, ఆదివారం నాడు వరుసగా 2 రోజులు సెలవులు రానున్నాయి. ఆ వివరాలు..

  • Published Jul 26, 2024 | 10:17 AMUpdated Jul 26, 2024 | 10:17 AM
Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వరుసగా మరో 2 రోజులు హాలీడేస్‌.. కారణమిదే

ఈమధ్యకాంలో విద్యార్థులకు వరుసగా సెలవులు వస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా విద్యాశాఖ సెలవులు మంజూరు చేస్తోన్న సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో అయితే వరుసగా వారం రోజులు కూడా హాలీడేస్‌ ప్రకటించాయి ప్రభుత్వాలు. ఈ క్రమంలో తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. రేపు, ఎల్లుండి అనగా జూలై 27, 28 రెండు రోజులు సెలవులు రానున్నాయి. వరుసగా హాలీడేస్‌ రావడంపై విద్యార్థులు సంతోషంగా ఉన్నారు. పైగా ఈ మూడు రోజులు జోరు వానలు ఉండటంతో.. స్కూళ్లకు వెళ్లే సమయంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటి క్రమంలో సెలవులు రావడం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఆ రెండు రోజుల సెలవులు ఎందుకంటే..

తెలంగాణలో జూలై 27, 28 లేదా జూలై 28, 29 తేదీల్లో సెలవులు రానున్నాయి. ఎందుకంటే జూలై 28 సాధారణంగా ఆదివారం.. కనుక ఆ రోజు నార్మల్‌గానే హాలీడేనే.  మరో రోజు సెలవు ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు పండగ సందర్భంగా ఈ సెలవు రానుంది. అయితే బోనాల సెలవును జూలై 27 లేదా జూలై 29వ తేదీన ఉంటుందా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే.. దీనిపై త్వరలోనే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. శనివారం, సోమవారం ఏ రోజు సెలవు వచ్చినా.. విద్యార్థులకు మాత్రం వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి.  మొత్తానికి విద్యార్థులకు మాత్రం వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి.

ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్‌లో బోనాల సందడి షురువైతుంది. గోల్కొండ జగదాంబిక, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాల్లో బోనాలు ఘనంగా నిర్వహిస్తారు. తెలంగాణ ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారు. దాదాపు వందేళ్ల నుంచి ఇక్కడి ప్రజలు బోనాల పండుగ జరుపుకుంటున్నారు. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత.. అప్పట్లో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. అంతేకాదు.. ప్రతి ఏటా ఈ బోనాలు జాతర కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించడంతో ఎంతో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

తెలుగు పంచాంగం ప్రకారం.. జ్యేష్ఠ మాసం అమావాస్య తర్వాత వచ్చే ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా తొలి ఆదివారం రోజున గోల్కొండలోని జగదాంబిక దేవాలయంలో బంగారు బోనంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది జూలై 7 ఆదివారం నుంచి భాగ్యనగరంలో బోనాల సంబరాలు ప్రారంభమయ్యాయి. చివర్లో అంటే ఆగస్టు 4వ తేదీన అమ్మవారి విగ్రహాన్ని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకెళ్లి మూసీ నదిలో నిమజ్జనం చేస్తారు. దీంతో బోనాల సంబురాలు ముగుస్తాయి. అయితే బోనాల సందర్భంగా విద్యాసంస్థలకు సెలవు ఇస్తారు. తెలంగాణ రాష్ట్ర పోర్టల్ క్యాలెండర్ 2024 ప్రకారం జూలై 27న శనివారం రోజున బోనాలు సెలవుదినం ఉంది. జూలై 28వ తేదీన ఆదివారం. దీంతో వ‌రుస‌గా జూలై 27, 28వ తేదీల్లో సెల‌వులు రానున్నాయి. ఒకవేళ మారిస్తే.. 27వ తేదీకి బదులు జూలై 29వ తేదీన సెలవు ఉండనుంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.