iDreamPost
android-app
ios-app

తెలంగాణలో భారీగా పెరగనున్న మద్యం ధరలు..? ఇక మందుబాబులకు కష్టమే!

  • Published Jul 26, 2024 | 8:23 AM Updated Updated Jul 26, 2024 | 8:23 AM

Liquor Price Hike: తెలంగాణ మద్యం ప్రియులకు భారీ షాక్.రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నట్లు వార్తలు వస్తునున్నాయి. ధరలు ఎంత పెరుగుతున్నాయి? ఎప్పుడు పెరగనున్నాయో చూద్దాం

Liquor Price Hike: తెలంగాణ మద్యం ప్రియులకు భారీ షాక్.రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నట్లు వార్తలు వస్తునున్నాయి. ధరలు ఎంత పెరుగుతున్నాయి? ఎప్పుడు పెరగనున్నాయో చూద్దాం

తెలంగాణలో భారీగా పెరగనున్న మద్యం ధరలు..? ఇక మందుబాబులకు కష్టమే!

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మద్యం కొనుగోలు ప్రతిరోజు పెరిగిపోతూనే ఉంది. పండుగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ఖచ్చితంగా మద్యం ఉండాల్సిందే అంటున్నారు మందుబాబులు. మందు లేనిదే పార్టీలో కిక్కే ఉండదని అనడంలో అతిశయోక్తి లేదు. ఇక వీక్ ఎండ్ వచ్చిందంటే చాలు చిల్ అయ్యేందుకు మద్యం షాపుల వద్ద భారీగా క్యూ లైన్లు కనిపిస్తుంటాయి. ఎన్నికల సమయాల్లో మందు ఏరులై పారుతుంది. మద్యంతో ఎంజాయ్ చేస్తున్న మందుబాబులకు అప్పుడప్పుడు షాకింగ్ న్యూస్ లు వినిపిస్తూనే ఉంటాయి. అలాంటిదే ఇప్పుడు తెలంగాణ మద్యం ప్రియులకు ఓ బ్యాడ్ న్యూస్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ మందుబాబులకు భారీ షాక్.. త్వరలో మద్యం ధరలు పెరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.రాష్ట్రంలో మద్యం ధరలే పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఇన్ సైడ్ టాక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సాధారణంగా రాష్ట్రంలో రెండేళ్లకు ఒకసారి మద్యం ధరలు పెంచడం తెలిసిన విషయమే.. ఈసారి కూడా మద్యం ధరలు పెంచే యోచలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. రెండేళ్ల క్రితం కేసీఆర్ గవర్నమెంట్ మద్యం ధరలు పెంచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రేవంత్ సర్కార్ అదే యోచనలో ఉన్నట్లు బడ్జెట్ సమావేశాల తర్వాత స్పష్టమవుతుంది. రాష్ట్ర రెవెన్యూ లో ఎక్కువ భాగం ఎక్సయిజ్ ఆదాయం నుంచే సమకూరుతుందన్న విషయం తెలిసిందే. దాదాపు 10 వేల కోట్ల ఆదాయం వరకు వస్తుందని బడ్జెట్ లో పేర్కొన్నారు. స్టేట్ ఎక్సయిజ్ సుంకం గత ఏడాది రూ.20,290 కోట్ల ఆదాయం సమకూరిందని, ఈ ఏడాది అదనంగా రూ.5,400 వేల కోట్ల ఆదాయం వస్తుందన్న అంచనాలో ఉందని తెలిపారు.

ఇక లిక్కర్ పై వ్యాట్ రూపంలో ఆదాయం మరో 4 వేల కోట్ల ఆదాయం ఉంటుందని అంచనా వేశారు. ఇక రెండేళ్లకు ఒకసారి మద్యం ధరలు పెంచుతున్న ప్రభుత్వం ఈ ఏడాది కూడా పెంచే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.. దసరా పండుగక ముందే ఆ నిర్ణయం తీసుకోనుందా? అంటే ఆదాయ అంచనాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త సంక్షేమ పథకాలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా పెరిగిన ఆదాయం అవసరానికి పనికి వస్తుందని ఆలోచన. అందుకే ధరలు పెంచే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతారు అంటూ వస్తున్న న్యూస్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.