iDreamPost

Money to Students: ఆ విద్యార్థులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ప్రతి నెల వారికి రూ.1000

  • Published Jun 18, 2024 | 11:50 AMUpdated Jun 18, 2024 | 11:50 AM

విద్యార్థులకు ప్రభుత్వం అదిరే శుభవార్త చెప్పనుంది. ఆగస్టు నుంచి వారి ఖాతాలో రూ.1000 జమ చేయనుంది. మరి ఈ పథకం ప్రారంభించేది ఎక్కడ.. దీనికి ఎవరు అర్హులంటే..

విద్యార్థులకు ప్రభుత్వం అదిరే శుభవార్త చెప్పనుంది. ఆగస్టు నుంచి వారి ఖాతాలో రూ.1000 జమ చేయనుంది. మరి ఈ పథకం ప్రారంభించేది ఎక్కడ.. దీనికి ఎవరు అర్హులంటే..

  • Published Jun 18, 2024 | 11:50 AMUpdated Jun 18, 2024 | 11:50 AM
Money to Students: ఆ విద్యార్థులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ప్రతి నెల వారికి రూ.1000

గత కొంత కాలంగా ప్రభుత్వ విధానాల్లో అనేక మార్పులు వస్తున్నాయి. సమాజంలోని అన్ని వర్గాల వారి అభివృద్ధి కోసం రకరకాల పథకాలు తీసుకువస్తున్నాయి. వీటి ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే నగదు జమ చేస్తూ.. వారు ఆర్థికంగా ఎదిగేందుకు తమ వంతు తోడ్పాటు అందిస్తున్నాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా.. బడికి వెళ్లే విద్యార్థుల నుంచి.. కాటికి కాళ్లు చాపుకున్న ముసలి వాళ్ల వరకు.. ఇలా అన్ని వర్గాల వారి కోసం రకరకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. వీరిలో విద్యార్థులు కూడా ఉండటం గమనార్హం. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆ విద్యార్థుల ఖాతాలో ప్రతి నెలా 1000 రూపాయలు జమ చేయనున్నట్లు వెల్లడించింది. ఆ వివరాలు..

హైస్కూల్‌ విద్యార్థుల కోసం ఓ పథకాన్ని ప్రారంభించింది ప్రభుత్వం. దీని ద్వారా ప్రతి నెల వారి ఖాతాలో రూ.1000 జమ చేస్తామని తెలిపింది. ఇంతకు ఇది ఎక్కడంటే.. తమిళనాడులో. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌.. హైస్కూల్‌ విద్యార్థులకు శుభవార్త చెప్పారు. వారికి ప్రతి నెల 1000 రూపాయలు ఇస్తామని చెప్పుకొచ్చారు. తమిళ్‌ పుదల్వాన్‌ పథకం కింద ఈ మొత్తాన్ని అందజేస్తామని వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్ట్‌ నుంచి ఈ స్కీమ్‌ను ప్రారంభించబోతున్నట్లు స్టాలిన్‌ చెప్పుకొచ్చారు. ఈ పథకం కింద 6-12వ తరగతి చదివే విద్యార్థులకు నెలకు రూ.1000 అందిస్తారు.

తమిళ్ పుదల్వాన్ పథకం పంచాయతీ యూనియన్, ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు, అది ద్రావిడర్ సంక్షేమ పాఠశాలలు, మున్సిపల్, కార్పొరేషన్ స్కూళ్లు, గిరిజన సంక్షేమ పాఠశాలలు, కల్లార్ పునరుద్ధరణ స్కూల్స్‌తో పాటు వెనకబడిన తరగతుల సంక్షేమ పాఠశాలలు, అటవీ పాఠశాలలు, సామాజిక భద్రతా విభాగం స్కూల్స్‌లో చదివే విద్యార్థులకు వర్తిస్తుంది. ఈ పాఠశాలల్లో చదివే 6-12వ తరగతి విద్యార్థులకు ప్రతి నెల 1000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తారు. అలానే డిప్లొమా, డిగ్రీ, అండర్ గ్రాడ్యుయేషన్, వొకేషనల్, పారామెడికల్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు స్టైపెండ్ ఇస్తారు. డిస్టెన్స్ లేదా ఓపెన్ యూనివర్శిటీలో చేరే విద్యార్థులకు ఈ పథకం వర్తించదు అని తెలిపారు. మరో రెండు నెలల్లో అనగా ఆగస్ట్‌లో ఈ పథకం ప్రారంబం కానుంది. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ పథకం ద్వారా స్టాలిన్‌ ప్రభుత్వం.. విద్యార్థులకు ప్రతి ఏటా 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేయనుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి