iDreamPost

ఆ రహదారుల్లో టోల్ ఛార్జీలు వసూలు చేయకండి.. ఏజెన్సీలకు నితిన్ గడ్కరీ సూచన!

Nitin Gadkari On Toll Charges: హైవే మీద ప్రయాణం చేసేటప్పుడు టోల్ ప్లాజాల వద్ద టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయంలో నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రోడ్లలో టోల్ ఛార్జీలు వసూలు చేయకండి అంటూ ఏజెన్సీలకు సూచించారు.

Nitin Gadkari On Toll Charges: హైవే మీద ప్రయాణం చేసేటప్పుడు టోల్ ప్లాజాల వద్ద టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయంలో నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రోడ్లలో టోల్ ఛార్జీలు వసూలు చేయకండి అంటూ ఏజెన్సీలకు సూచించారు.

ఆ రహదారుల్లో టోల్ ఛార్జీలు వసూలు చేయకండి.. ఏజెన్సీలకు నితిన్ గడ్కరీ సూచన!

మనం హైవే మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు మధ్యలో టోల్ ప్లాజా కనబడితే అక్కడ టోల్ ఫీజు చెల్లిస్తుంటాము. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చెల్లించాల్సిందే. అయితే తాజాగా టోల్ ఛార్జీలు వసూలు చేయవద్దని ఏజెన్సీలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఆ రహదారుల్లో అస్సలు టోల్ ఛార్జీలు వసూలు చేయకూడదని అన్నారు. ఆయన ఇలా ఎందుకు అన్నారు? ఆయన సూచనను టోల్ ప్లాజాలు పాటిస్తే ఆ రోడ్లలో వెళ్లే వాహనదారులకు టోల్ ఛార్జీలు ఉండవా? అసలు నితిన్ గడ్కరీ ఈ కామెంట్స్ ఎందుకు చేసినట్టు? 

హైవే రోడ్ల మీద వాహనాలను నడుపుతున్నందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు టోల్ ఛార్జీల కింద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. హైవే మీద వెళ్తున్నప్పుడు స్టేట్ మారుతున్నప్పుడు.. కొంత దూరం వెళ్ళాక టోల్ ప్లాజాలు ఉంటాయి. ఇక్కడ వాహనాలను ఆపి యజమానులు టోల్ ఫీజు అనేది చెల్లించాలి. అయితే టోల్ ఫీజు చెల్లిస్తున్నందుకు న్యాయం జరుగుతుందా అంటే కొన్ని చోట్ల లేదనే చెప్పాలి. అందుకే ఈ విషయం మీద భారత రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సీరియస్ అయ్యారు. వాహనదారులకు న్యాయం చేయలేనప్పుడు టోల్ ఫీజు ఎందుకు వసూలు చేయడం అని నితిన్ గడ్కరీ కామెంట్స్ చేశారు.

రోడ్లు సరిగా నిర్వహించలేనప్పుడు టోల్ ఛార్జీలు వసూలు చేయవద్దని.. గుంతలతో కూడిన రోడ్లు, టోల్ ప్లాజా వద్ద రద్దీ ఉండడం వంటివి ఏ మాత్రం మంచిది కాదని అన్నారు. శాటిలైట్ ఆధారిత టోల్ ఛార్జీల వసూలుపై నిర్వహించిన వర్క్ షాప్ లో నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వాహనదారులకు మంచి సేవలు అందించలేనప్పుడు టోల్ ఛార్జీలు వసూలు చేయకండి. రోడ్లు బాగోపోతే వాహనదారులు హర్షించరు. ఇప్పటికే చాలా మంది రోడ్లు బాలేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మంచి రోడ్లు అందించలేనప్పుడు వాహనదారుల నుంచి టోల్ ఫీజు వసూలు చేయకూడదు. గుంతల రోడ్లపై టోల్ ఛార్జీలు వసూలు చేస్తే రాజకీయ నాయకులుగా మేము ప్రజల ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుంది’ అంటూ నితిన్ గడ్కరీ కామెంట్స్ చేశారు.

టోల్ ప్లాజాల వద్ద వాహనదారులకు లేటవ్వకుండా చూడాలని నేషనల్ జాతీయ రహదారి క్షేత్ర అధికారులకు సూచించారు. ఇక వాహనదారులు టోల్ ప్లాజాల వద్ద ఆగే పని లేకుండా శాటిలైట్ ఆధారంగా టోల్ ఛార్జీలు వసూలు చేసే విధానాన్ని ఈ ఆర్థిక ఏడాదిలోనే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు నితిన్ గడ్కరీ వెల్లడించారు. తొలి దశలో 5 వేల కిలోమీటర్ల రహదారులపై ఈ శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని తీసుకొస్తామని అన్నారు. ముందు కమర్షియల్ వాహనాలకు ఒక లేన్ లో అనుమతిస్తామని.. టోల్ వసూలు కోసం కీలకమైన వెహికల్ ట్రాకర్ సిస్టంని వాహనాల్లో అమరుస్తామని అన్నారు. ఈ విధానం వల్ల ప్రభుత్వానికి అదనంగా రూ. 10 వేల కోట్లు ఆదాయం సమకూరనుందని.. ఈ విధానం అందుబాటులోకి వస్తే వాహనదారులు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదని తెలిపారు.                   

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి