iDreamPost

సంచలనం సృష్టిస్తున్న కల్కి థీమ్ సాంగ్.. ఒక్క పాటతో హైప్ పెంచేశారు..

  • Published Jun 25, 2024 | 10:05 PMUpdated Jun 25, 2024 | 10:14 PM

Theme Of Kalki: ఇప్పటి వరకూ కల్కి సినిమా ఎలా ఉంటుందా అన్న సందేహం ఉండేది. కానీ ఇప్పుడది పటాపంచలు అయిపోయింది. కల్కి థీమ్ సాంగ్ సినిమాపై భారీగా హైప్ పెంచేసింది. థీమ్ సాంగ్ తో సినిమా ఎలా ఉంటుందో అనే విషయాన్ని చెప్పేసింది కల్కి టీమ్.

Theme Of Kalki: ఇప్పటి వరకూ కల్కి సినిమా ఎలా ఉంటుందా అన్న సందేహం ఉండేది. కానీ ఇప్పుడది పటాపంచలు అయిపోయింది. కల్కి థీమ్ సాంగ్ సినిమాపై భారీగా హైప్ పెంచేసింది. థీమ్ సాంగ్ తో సినిమా ఎలా ఉంటుందో అనే విషయాన్ని చెప్పేసింది కల్కి టీమ్.

  • Published Jun 25, 2024 | 10:05 PMUpdated Jun 25, 2024 | 10:14 PM
సంచలనం సృష్టిస్తున్న కల్కి థీమ్ సాంగ్.. ఒక్క పాటతో హైప్ పెంచేశారు..

ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా టీజర్, ట్రైలర్ వచ్చినా మూవీ విషయంలో గందరగోళం ఉండేది. మూవీ రిజల్ట్ ఏమవుతుందో అని కొంతమంది అభిప్రాయపడ్డారు. హాలీవుడ్ సినిమా స్టైల్ లో ట్రైలర్ ని కట్ చేయడం వల్ల ట్రైలర్ కొంతమందికి అర్థం కాలేదు. అయితే తాజాగా మూవీ టీమ్ కల్కి థీమ్ సాంగ్ ని రిలీజ్ చేసింది. ఆ సాంగ్ వింటుంటే గూస్ బంప్స్ పక్కా. సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉన్నా గానీ తెలుగు ఛాయలు కరువయ్యాయని డిజప్పాయింట్ అయిన వారికి ఇవాళ ఈ సాంగ్ తో సమాధానం దొరికేసింది. ఈ ఒక్క పాటతో సినిమాకి హైప్ వచ్చేసింది. హనుమాన్ సినిమాలో ‘రఘునందన’ అనే పాట ఏ స్థాయిలో ఉంటుందో.. ఈ పాట కూడా అంతకు మించిన స్థాయిలో ఉంది.

నిజానికి కల్కి సినిమాని డివోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూశారు చాలా మంది ఫ్యాన్స్. వాళ్ళు కోరుకున్నది కూడా ఇదే. సరిగ్గా ఫ్యాన్స్ నాడి పట్టుకున్నారు. కరెక్ట్ గా సినిమా రిలీజ్ కి రెండు రోజుల ముందు సెంటిమెంట్ తో కొట్టారు. అసలు ఆ పాట వింటుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. మళ్ళీ మళ్ళీ వినాలపించేంత గొప్పగా లిరిక్స్, ఆ గాత్రం, సంగీతం ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు, ఇప్పటికీ చాలా తేడా కనిపించింది. ఈ తేడా సినిమా రిజల్ట్ నే మార్చేస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అవ్వలేదనిపించింది. కానీ ఈ సాంగ్ లో మాత్రం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్ లో ఇచ్చి పడేశారు.

దీంతో సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అనే క్లారిటీ వచ్చేసింది. థీమ్ ఆఫ్ కల్కి పేరుతో సినిమా థీమ్ ఏంటి అనేది స్పష్టంగా చెప్పేసారు. దశావతారాల గురించి చాలా క్లియర్ గా చెప్పారు. అధర్మాన్ని అణిచేయగా, యుగయుగాన జగములోన పరి పరి విధాల్లోన విభవించే విక్రమ విరాట రూపమితడే స్వధర్మాన్ని పరిరక్షించగా సమస్తాన్ని ప్రక్షాళించగా సముద్భవించే అవతారమిదే’ అంటూ లిరిక్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ట్రైలర్ చూస్తే సినిమా ఎలా ఉంటుందో అర్థం కాని వారికి ఈ థీమ్ సాంగ్ తో వివరంగా చెప్పేసింది కల్కి టీమ్. కాగా ఈ థీమ్ సాంగ్ విడుదలైన రెండు గంటల్లోనే దాదాపు ఎనిమిదిన్నర లక్షలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. యూట్యూబ్ లో టాప్ 3 ట్రెండింగ్ లో ఉంది.  

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి