iDreamPost
android-app
ios-app

ప్రభాస్ ఫ్యాన్స్​కు ‘సలార్’ టీమ్ బంపర్ ఆఫర్.. మీ దగ్గర టాలెంట్ ఉందా?

  • Author singhj Published - 03:38 PM, Tue - 4 July 23
  • Author singhj Published - 03:38 PM, Tue - 4 July 23
ప్రభాస్ ఫ్యాన్స్​కు ‘సలార్’ టీమ్ బంపర్ ఆఫర్.. మీ దగ్గర టాలెంట్ ఉందా?

ఈ ఏడాది మూవీ ఆడియెన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘సలార్’ ఒకటి. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడాల్లేకుండా మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా మూవీ ఇది. ఈ ప్రాజెక్టుకు ఇంత హైప్ రావడానికి ఇందులో డార్లింగ్ ప్రభాస్ నటిస్తుండటం ఒక కారణమైతే.. మరో కారణం డాషింగ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండటమేనని చెప్పొచ్చు. ‘కేజీఎఫ్’ సిరీస్​తో హీరోకు ఎలివేషన్ సీన్లను ఎంత బాగా తీయొచ్చో ప్రశాంత్ నిరూపించారు. రాకింగ్ స్టార్​ యష్​ను ప్రశాంత్ నీల్ చూపించిన విధానం, యాక్షన్ సీక్వెన్స్​లు, డైలాగ్స్, బీజీఎం ఒక రేంజ్​లో ఉండి అందర్నీ ఆకట్టుకున్నాయి.

మాస్​లో ప్రభాస్​కు ఉన్న యాక్షన్ ఇమేజ్​తో పాటు హీరోలను స్టైలిష్​గా చూపించడంలో, ఎలివేషన్ సీన్లు తీయడంలో ప్రశాంత్​ నీల్​ పనితనం ‘సలార్’ పై అంచనాలను పెంచేస్తోంది. ఈ మూవీపై ఎక్స్​పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రం బాక్సాఫీస్​ను షేక్ చేయడం పక్కా అని ట్రేడ్ అనలిస్టులు అంటున్నారు. సెప్టెంబర్ 28న ‘సలార్’ బిగ్​ స్క్రీన్స్​లో విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన అప్​డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వారి కోసం క్రేజీ అప్​డేట్​ వచ్చేస్తోంది. జులై 6న ఉదయం 5 గంటల 12 నిమిషాలకు ‘సలార్’ టీజర్​ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

‘సలార్’ టీజర్​ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే బజ్​ను మరింత పెంచడానికి మూవీ యూనిట్ ప్రయత్నిస్తోంది. దీంట్లో భాగంగా ప్రభాస్ ఫ్యాన్స్​కు ఒక ఆఫర్ ఇచ్చింది. వారి టాలెంట్​కు పరీక్ష పెట్టింది. ‘సలార్’పై స్టన్నింగ్ డిజైన్స్, అద్భుతమైన వీడియో ఎడిట్​లు చేసి ప్రతిభను నిరూపించుకోవాలని సూచించింది. మోస్ట్ వయోలెంట్ మేన్ (ప్రభాస్) గురించి ఈ డిజైన్లు, వీడియో ఎడిట్ల ద్వారా మరింత ఎక్కువ మందికి తెలిసేలా చేయాలని చెప్పింది. ఈ పోటీలో ‘సలార్’ టీమ్​ను మెప్పించే వారిని మూవీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రజలకు చూపిస్తామని వెల్లడించింది. మరి.. మీలో టాలెంట్ ఉందా? అయితే ఎడిట్​లు చేసేందుకు సిద్ధమైపోండి.