చిరంజీవి.. భారతీయ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను ఆయన తన పేరు మీద సొంతం చేసుకున్నారు. ఒక టైమ్‌లో దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న ఫిల్మ్ స్టార్‌గా ఆయన రికార్డులు సృష్టించారు. ‘ఖైదీ’ దగ్గర నుంచి ‘వాల్తేరు వీరయ్య’ వరకు ఆయన ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే సినిమాల్లో ఆయన చూడని విజయం, ఆయన అందుకోని అవార్డు లేదనే చెప్పాలి. అలాంటి మెగాస్టార్‌ను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. సినిమాల్లో అద్భుతంగా నటించడమే గాక బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన చిరును తోటి మూవీ స్టార్స్ కూడా ఎంతో ఇష్టపడుతుంటారు.
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కూడా చిరుకు ఫ్యాన్ అనే విషయం తెలిసిందే. మెగాస్టార్‌పై తనకు ఉన్న ప్రేమను పలు సందర్భాల్లో వెల్లడించారు బన్నీ. మరోమారు మావయ్యపై తనకు ఉన్న ఇష్టాన్ని ఆయన వ్యక్తపరిచారు. ఈ కట్టె కాలేంత వరకు తాను చిరంజీవి అభిమానినేనని బన్నీ చెప్పారు. ఇటీవల రిలీజై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘బేబీ’ మూవీ సక్సెస్ మీట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్ర నిర్మాత ఎస్కేఎన్ కూడా మెగాస్టార్ అభిమాని అని.. తాను కూడా చిరు ఫ్యాన్నేనని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఎస్కేఎన్ను చూస్తే ఎంతో గర్వంగా ఉందన్నారు. ‘బేబీ’ సినిమా అదిరిపోయిందని, చిత్రంలోని ప్రతీ సీన్ అద్భుతంగా ఉందన్నారాయన.
దర్శకుడు సాయి రాజేష్ టాలెంట్‌ను ఆనంద్ దేవరకొండ నమ్మడం వల్లే ఈ రోజు సినిమా ఇంత బాగా వచ్చిందన్నారు బన్నీ. ‘బేబీలో వైష్ణవి చించేసింది. ఆమె కోసమే నేను ఈ ఈవెంట్‌కు వచ్చా. ఇండస్ట్రీలోకి తెలుగమ్మాయిలు రావడం లేదని చాలా ఏళ్ల నుంచి నాకు బాధగా ఉండేది. కానీ ఇప్పుడు వైష్ణవీ చైతన్య వచ్చింది. ఆమె అవార్డులు కొట్టాలి. ఆమె స్ఫూర్తితో మరింత మంది తెలుగమ్మాయిలు పరిశ్రమలోకి రావాలి, నటించాలి. తెలుగు ఇండస్ట్రీ చాలా మంచిది. అందరూ ఇక్కడికి రండి’ అని అల్లు అర్జున్ కోరారు. ‘బేబీ’ నిర్మాత ఎస్కేఎన్ ఎప్పుడు కలసినా ఒక కల్ట్ సినిమా తీస్తున్నా అని చెప్పేవారని బన్నీ అన్నారు. ఆయన కష్టాన్ని తాను చూశానన్నారు.
He said it Earlier many times n said it today when he is a Huge PanIndia star
Tmrw he may open an Allu Studio or an Allu charity or anything Allu,he himself is a brand now n Don’t expect d same dialogue on every stage
He has that gratitude❤️@alluarjun
pic.twitter.com/3L81FzcLSK— WX (@winsttonxavier) July 20, 2023