iDreamPost

OTTలో ఓ పిల్లాడి ప్రేమకథ.. కానీ, పెద్దలకు మాత్రమే..

OTT Suggestions- Best Watch Alone Movie: ఓటీటీలో చాలానే సినిమాలు ఉంటాయి. కొన్ని మాత్రం అస్సలు మిస్ కాకుండా ఉండేవి ఉంటాయి. ఇది కూడా అలాంటి ఒక లవ్ స్టోరీనే.

OTT Suggestions- Best Watch Alone Movie: ఓటీటీలో చాలానే సినిమాలు ఉంటాయి. కొన్ని మాత్రం అస్సలు మిస్ కాకుండా ఉండేవి ఉంటాయి. ఇది కూడా అలాంటి ఒక లవ్ స్టోరీనే.

OTTలో ఓ పిల్లాడి ప్రేమకథ.. కానీ, పెద్దలకు మాత్రమే..

ఓటీటీలో చాలా సినిమాలు ఉంటాయి. కొన్ని కొన్ని మాత్రం వావ్ అనిపిస్తే.. కొన్ని సినిమాలు మాత్రం బాగా ఆలోచింపజేస్తాయి. అలాంటి సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈ మూవీ ఒక ప్యూర్ లవ్ స్టోరీ. అయితే మీరు దానికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. కానీ, అది మాత్రం ప్రేమకథే అవుతుంది. కానీ, కాస్త వయసులో మాత్రం చాలా తేడా ఉంటుంది. అంటే ఒక పిల్లాడు.. ఒక మహిళను ఇష్టపడతాడు.. ఆమెను ప్రేమిస్తాడు కూడా. అయితే అది ప్రేమ కాదు అని వెంటనే జడ్జ్ చేయకండి. సినిమా చూస్తే మీకే ఆ విషయం అర్థమవుతుంది. కొన్నేళ్ల క్రితమే ఒక మంచి పాయింట్ తో అద్భుతమైన సినిమాని తెరకెక్కించారు. కానీ, పిల్లోడి ప్రేమకథే అయినా పెద్దళ్లోకి మాత్రమే.

ప్రేమకు వయసుతో సంబంధం లేదు అంటారు. అయితే చెప్పినవాళ్లు ఏ ఉద్దేశంతో చెప్పినా.. డైరెక్టర్ కి మాత్రం ఇలా అర్థమైనట్లు ఉంది. అందుకే ఒక పిల్లాడికి.. ఒక ఒంటరి మహిళకు సత్సంబంధాలు కనలిపేశాడు. ఒక ఊరిలో ఈ కథ నడుస్తూ ఉంటుంది. అది యుద్ధం జరుగుతున్న రోజులు. అంతా తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకు బతుకుతున్నారు. అలాంటి రోజుల్లో ఆ ఊరికి ఒక మహిళ వస్తుంది. ఆమె ఉద్యోగరీత్యా ఆ ఊరికి వస్తుంది. ఆ తర్వాత అక్కడే తన జీవితాన్ని కొనసాగిస్తుంది. ఆమె ఎవరితో మాట్లాడదు.. ఆమెతోనూ ఎవరూ మాట్లాడరు. కానీ, అందరూ ఆమెను చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆమె చాలా మోడ్రన్ గా ఉంటుంది. అలాంటి దుస్తులే వేసుకుంటుంది.

malena movie

పెద్దలు మాత్రమే కాదు.. కుర్రాళ్లు, పిల్లలు కూడా ఆమెను చూస్తూ ఉంటారు. రోజూ ఆమె ఇంటికి వచ్చే సమయానికి ఒక గోడ మీద కూర్చుని ఆమెవైపే చూస్తారు. అలా కొన్ని రోజులు, నెలలు కూడా గడిచిపోతాయి. మన బుడతడు కూడా అదే పనిలో ఉంటాడు. ఆమెను గోడ మీద కూర్చుని చూడటం మాత్రమే కాదు.. ఇంటి దాకా ఫాలో కూడా అవుతాడు. ఆమె ఇంట్లోకి తొంగి చూస్తూ ఉంటాడు. నిత్యం ఆమె గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఒకరోజు వాడ అదృష్టం బాగుండి గోడ మీద ఒక్కడే కూర్చుని ఉంటాడు. ఆ రోజు ఆ మహిళ ఆ కుర్రాడిని ఇంటికి ఆహ్వానిస్తుంది. అతడిని పిలిచి మాట్లాడుతుంది. అసలే ఒంటరితనంలో ఉన్న మహిళ ఆ కుర్రాడితో స్నేహం చేయడం స్టార్ట్ చేస్తుంది.

అయితే ఈ బుడతడు మాత్రం దానిని మరోలా అర్థం చేసుకుంటూ ఉంటాడు. అసలు వాళ్ల స్నేహం ఎటు దారి తీసింది? ఆ పిల్లాడిది ప్రేమ అనాలా? ఇంకో పేరు ఏమైనా పెట్టాలా? అసలు ఇంత వింత కథను ఇంత బాగా ఎలా తెరకెక్కించారు తెలియాలంటే మీరు ‘మెలీనా’ అనే సినిమా చూడాల్సిందే. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. కాకపోతే రూ.99 రెంట్ కట్టి చూడాల్సి ఉంటుంది. కానీ, ఆ మూవీ అందుకు వర్త్ అనే చెప్పాలి. కాకపోతే పిల్లాడి ప్రేమకథను పెద్దలు మాత్రమే చూస్తే బెటర్. ఈ మూవీ చూడాలి అంటే క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి