iDreamPost

సెక్రెటరీతో ప్రేమ.. ఆఫీస్ లోనే.. OTTలో ఓ విచిత్ర ప్రేమకథ!

OTT Suggestions- Best Watch Alone Movie: ఓటీటీల్లో చాలానే ప్రేమకథలు ఉంటాయి. మీకు కూడా చాలా లవ్ స్టోరీలు చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లవ్ స్టోరీ మాత్రం అస్సలు చూసి ఉండరు.

OTT Suggestions- Best Watch Alone Movie: ఓటీటీల్లో చాలానే ప్రేమకథలు ఉంటాయి. మీకు కూడా చాలా లవ్ స్టోరీలు చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లవ్ స్టోరీ మాత్రం అస్సలు చూసి ఉండరు.

సెక్రెటరీతో ప్రేమ.. ఆఫీస్ లోనే.. OTTలో ఓ విచిత్ర ప్రేమకథ!

ఓటీటీలో మీరు చాలానే ప్రేమకథలు చూసి ఉంటారు. కానీ, ఇలాంటి ఒక ప్రేమకథను మాత్రం అస్సలు చూసి ఉండరు. ఈ సినిమా చూస్తే మాత్రం మీరు ఫిదా అయిపోతారు. ఇలాంటి మనుషులు.. ఇలాంటి లవ్ స్టోరీలు కూడా ఉంటాయా అనే ప్రశ్న కచ్చితంగా ఎదురవుతుంది. కానీ, కథ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. చూస్తుంటే ఫీల్ మాత్రం ఎంతో ఫ్రెష్ గా ఉంటుంది. నిజానికి ఈ మూవీ వచ్చి చాలానే ఏళ్లు అవుతోంది. కానీ, ఇప్పటికీ ఇలాంటి ఒక డిఫరెంట్ పాయింట్ తో కథ మాత్రం రాలేదు. మరి.. ఆ ప్రేమకథ ఏది? అందులో ఉన్న ఆ కొత్తదనం ఏంటి? దాని గురించి అంత ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలి చూద్దాం.

ఈ సినిమాలో ఒక యువతి ఉంటుంది. ఆమె సినిమా ఓపెనింగ్ లో తన మెడ మీద ఒక రాడ్ పెట్టుకుని.. తన చేతులు కట్టేసి ఉంటాయి. అలా ఒక రూమ్ లోకి వెళ్లి తలుపు వేస్తుంది. ఆ తర్వాత కథ ఆరు నెలలు ముందుకు వెళ్తుంది. అప్పుడే హీరోయిన్ ఒక మెంటల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతుంది. ఆమెను తన తల్లి వచ్చి కారులో తీసుకెళ్తుంది. ఆరోజు తన సోదరి వివాహం కూడా ఉంటుంది. కానీ, ఈమె మాత్రం ఆ పెళ్లిలో ఒక మూలన నిల్చుని ఉంటుంది. అక్కడ ఆమెను తన స్కూల్ నాటి మిత్రుడు కలుస్తాడు. ఆ తర్వాత వారి మధ్య పరిచయం కాస్త బలపడుతుంది. ఆమె తర్వాత టైపింగ్ నేర్చుకుని ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉంటుంది.

ఆమె గ్రే అనే వ్యక్తి కార్యాలయంలో జాబ్ కోసం వెళ్తుంది. అతను ఆమెను అయిష్టంగానే జాబ్ లో పెట్టుకుంటాడు. ఆమె టైపింగ్ చేయడం కోసం హైర్ చేసుకుంటాడు. కానీ, కొన్ని రోజులకు వారి ఇద్దరి మధ్య మరో బంధం మొదలవుతుంది. అయితే గ్రే.. లీ తన బాయ్ ఫ్రెండ్ ని ముద్దు పెట్టుకోవడం చూస్తాడు. మరుసటి రోజు ఆమెపై వర్క్ పరంగా సీరియస్ అవుతాడు. అప్పటి నుంచి లీ తన యజమానిని సెడ్యూ*స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మెల్లగా గ్రే కూడా ఆమె మాయలో పడిపోతాడు. ఆమెకు పనిష్మెంట్ లో ఉండే ప్లెజ*ర్ ని పరిచయం చేస్తాడు. అలా వాళ్లిద్దరు ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. అప్పుడే గ్రే తన సెక్రటరీ లీని ఉద్యోగం నుంచి తీసేస్తాడు.

లీని ఉద్యోగం నుంచి ఎందుకు తీసేశాడు? వారి మధ్య ఏం జరిగింది? అసలు లీ చేసిన తప్పేంటి? మెంటల్ ఆస్పత్రికి లీ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఇలాంటి చాలానే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానం కావాలి అంటే మీరు ఈ సెక్రటరీ అనే సినిమా చూడాల్సిందే. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కాకపోతే ఈ మూవీ రెంట్ బేసిస్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమా 2012లో వచ్చింది. ఇప్పటికీ రెంట్ లో ఉంది అంటే మీరే అర్థం చేసుకోండి.. సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో? అయితే ఒంటరిగా చూడండి. ఎందుకంటే కాస్త ఇబ్బంది పెట్టే సన్నివేశాలు ఉంటాయి. సినిమా చూసేందుకు క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి