iDreamPost

OTTలో ఓ రేంజ్ ఫ్యూచరిస్టిక్ మూవీ.. ఇదే పరిస్థితి మనకి వస్తే?

OTT Suggestions- Best Futuristic Movie: ఓటీటీల్లో మీరు చాలానే ఫ్యూచరిస్టిక్ మూవీస్ చూసుటారు. కానీ, ఇది మాత్రం మీకు నెక్ట్స్ లెవల్ థ్రిల్ ని అందిస్తుంది. ఇలాంటి ఒక మూవీని మీరు ఇన్ని రోజులు మిస్ అయ్యారు అనే భావన కచ్చితంగా కలుగుతుంది.

OTT Suggestions- Best Futuristic Movie: ఓటీటీల్లో మీరు చాలానే ఫ్యూచరిస్టిక్ మూవీస్ చూసుటారు. కానీ, ఇది మాత్రం మీకు నెక్ట్స్ లెవల్ థ్రిల్ ని అందిస్తుంది. ఇలాంటి ఒక మూవీని మీరు ఇన్ని రోజులు మిస్ అయ్యారు అనే భావన కచ్చితంగా కలుగుతుంది.

OTTలో ఓ రేంజ్ ఫ్యూచరిస్టిక్ మూవీ.. ఇదే పరిస్థితి మనకి వస్తే?

ఓటీటీ వచ్చిన తర్వాత ఎలాంటి అద్భుతమైన సినిమాని మీరు థియేటర్లో మిస్ అయినా కూడా ఎప్పటికైనా ఓటీటీలో చూడచ్చు. అసలు ఓటీటీ కూడా లేని రోజుల్లో వచ్చిన సినిమాలు కూడా ఇప్పుడు ప్లాట్ ఫామ్స్ లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అలాంటి ఒక క్రేజీ ప్యూచరిస్టిక్ మూవీ ఒకటి మీ ముందుకు తీసుకొచ్చాం. ఆ మూవీ చూస్తే మన భూమి కూడా ఇలా అయితే ఏంటి మన పరిస్థితి అనే భయం కలగకుండా ఉండదు. అసలు భూమి మీద బతకడం అంటే నరకంలా అనిపిస్తుంది. కానీ, డబ్బున్న వాళ్లంతా ఒక సెపరేట్ ప్రపంచంలో బతుకుతూ ఉంటారు. ఎవరైతే తినడానికి, ఉండటానికి లేకుండా ఉంటారో వాళ్లే భూమి మీద మిగులుతారు.

హాలీవుడ్ నుంచి ఇప్పటి వరకు చాలానే ఫ్యూచరిస్టిక్ సినిమాలు వచ్చాయి. వాటిలో చాలా వరకు అందరి మన్ననలు పొందాయి. అలాంటి ఒక బెస్ట్ ఫ్యూచరిస్టిక్ యాక్షన్ డ్రామానే ఈ మూవీ. భవిష్యత్తులో మన భూమి ఇలా మారిపోతే.. ఏంటి మన పరిస్థితి అనే ప్రశ్న కచ్చితంగా అందరికీ తలెత్తుతుంది. అలాంటి పరిస్థితి వస్తే చేతిలో కోట్లు ఉన్న వారే బతుకుతారు. వారంతా ఉండేచోట గాలి, నీరు, ప్రకృతి, ఆరోగ్యం అన్నీ ఉంటాయి. అక్కడ ఉండే వారికి చావు కూడా రాదు. వారికి రాబోయే వ్యాధులను ముందే కనిపెట్టి నయం కూడా చేస్తారు. అలాగే అక్కడికి చేరుకోవాలి అంటే అంత తేలిక కాదు. ముందే చెప్పుకున్నాం కదా.. డబ్బు లేనిదే అక్కడకు వెళ్లలేరు. ఆ ప్రాంతాన్ని ఎలీసియం అంటారు.

మన హీరో లక్ష్యం.. ఆ ఎలీసియం ప్రాంతానికి వెళ్లడం. తాను మాత్రమే కాదు.. భూమి మీద ఉన్న ఎంతో మందిని ప్రాణాలను కాపాడటం కూడా. ఆ నేపథ్యంలోనే భూమి మీద పెద్ద విప్లవం ఏర్పడుతుంది. ఎలీసియానికి వ్యతిరేకంగా భూమి మీద పెద్ద ఎత్తున విప్లవకారులు తయారవుతారు. ఎలీసియంలో ఉండే సెక్యురిటీతో తరచుగా యుద్ధాలు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే హీరో మనిషిగా ఉన్నవాడు.. ఓ ప్రమాదం కారణంగా సగం మెషిన్ గా మారిపోతాడు. ఆ తర్వతా ఎలీసియం మీద పెద్ద యుద్ధమే చేస్తాడు.

ఇలా ఎలీసియం వర్సెస్ భూమి మీదున్న విప్లవకారులు మధ్య మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. ఇదంతా 2159లో జరిగిన కథలా చూపిస్తారు. ఈ సినిమా పేరు ఎలీసియం. ఇది 2013లో విడుదలైంది. ప్రస్తుతం జియో సినిమాలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ భాషలో ఈ చిత్రం మీకు అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ బేసిస్ లో అందుబాటులో ఉంది. అయితే యూట్యూబ్ లో కొన్ని ఛానల్స్ లో ఈ మూవీ కాపీ లభిస్తుంది. కానీ, ఫుల్ ఆఫ్ యాక్షన్ థ్రిల్, ఫ్యూచరిస్టిక్ వరల్డ్ ని అనుభూతి చెందాలి అంటే మాత్రం మీరు జియో సినిమాలో ఈ ఎలీసియం మూవీని చూడటం బెటర్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి