iDreamPost
android-app
ios-app

పాన్ ఇండియా ట్రాప్ లో క్రేజీ కాంబో

  • Published Feb 29, 2020 | 7:01 AM Updated Updated Feb 29, 2020 | 7:01 AM
  • Published Feb 29, 2020 | 7:01 AMUpdated Feb 29, 2020 | 7:01 AM
పాన్ ఇండియా ట్రాప్ లో క్రేజీ కాంబో

వరల్డ్ ఫేమస్ లవర్ తో షాక్ తిన్న విజయ్ దేవరకొండ దాన్ని పిచ్చ లైట్ తీసుకుని పూరి జగన్నాధ్ రూపొందిస్తున్న లైగర్(రిజిస్టర్ చేసిన టైటిల్)షూటింగ్ లో యమా బిజీ అయిపోయాడు. హీరోయిన్ గా జాన్వీ కపూర్ కోసం చాలా ట్రై చేసి ఆఖరికి అనన్య పాండేకు ఫిక్స్ అయ్యారన్న టాక్ ఇప్పటికే ఉంది. తను ఆల్రెడీ టీమ్ తో జాయినైన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి కూడా. ఇదిలా ఉండగా కొత్తగా వస్తున్న టాక్ ప్రకారం ఇది కూడా పాన్ ఇండియాను టార్గెట్ చేసుకునే తీస్తున్నారట. అంటే మల్టీ లాంగ్వేజ్ అన్నమాట.

ఒరిజినల్ గా హిందిలోనే రూపొందించి అవసరమైన సీన్లను తెలుగులో రీ షూట్ చేసి మిగలిన బాషలకు డబ్బింగ్ చేస్తారు. కాని విజయ్ దేవరకొండ ఇలా అన్ని రాష్ట్రాల్లో గుర్తింపు రావాలనే తపనతో చేసిన నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ మూడు దారుణమైన ఫలితాలు ఇచ్చాయి. ఇప్పుడు లైగర్ ని కూడా అదే కోవలో రూపొందించాలనుకోవడం ఏమిటోనని కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి తెలుగు హీరోలు బాలీవుడ్ లేదా ఇతర రాష్ట్రాల మార్కెట్ ని టార్గెట్ చేసి లాభం లేదు. బాహుబలి లేకపోతే ప్రభాస్ కూడా అక్కడ తెలియని హీరోగానే మిగిలిపోయేవాడు.

మహేష్ బాబు ఈ కారణంగానే తన ఫోకస్ ని కేవలం ఇక్కడికే పరిమితం చేసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు సైతం ఆ ఆలోచన కూడా చేయడం లేదు. ఒక ఆర్ఆర్ఆర్ మాత్రమే దీనికి మినహాయింపుగా నిలుస్తుంది. మరి పూరి జగన్నాధ్-విజయ్ దేవరకొండల కాన్ఫిడెన్స్ ఏమో కాని ఇది అభిమానులను కొంత టెన్షన్ పెడుతోంది. ప్రొడక్షన్ లో కరణ్ జోహార్ ఉన్నాడు కాబట్టి సినిమా తెగ ఆడేస్తుందన్న గ్యారెంటీ లేదు. ఆయనవే గత కొంత కాలంగా చేదు ఫలితాలను అందుకున్నాయి. ఇస్మార్ట్ శంకర్ తో మళ్ళి ప్రూవ్ చేసుకున్న పూరి జగన్నాథ్ ఇప్పుడీ లైగర్ తో కనక ఇంకో హిట్ కొడితే తిరిగి స్టార్ హీరోల నుంచి ఆఫర్లను దక్కించుకోవచ్చు. మార్షల్ ఆర్ట్స్ నేపధ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో ఎమోషన్ కూడా హెవీగా ఉంటుందట.

Jojobet GirişJojobetşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetStarzbetStarzbetJojobetjojobet güncel girişgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom