విజయసాయిరెడ్డి – నాగబాబు ట్విట్టర్ వార్

ట్విట్టర్ వేదికగా వైసీపీ ముఖ్య నేత, ఎంపీ విజయసాయిరెడ్డి.. జనసేన నేత, నటుడు నాగబాబు లు మాటల యుద్ధానికి దిగారు. వారిద్దరి మధ్య విమర్శలు శృతిమించి వ్యక్తిగత దూషణల వరకు వెళ్లాయి. కరోనా వైరస్ పై మొదలైన రాజకీయం చివరికి 2019 ఎన్నికలు, పొత్తులు గెలుపోటముల వరకు వెళ్ళింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా ఘాటు వ్యాఖ్యలు చేసుకున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి సర్కారు తీసుకుంటున్న చర్యలపై ప్రతిపక్ష పార్టీలు తరచూ విమర్శలు చేస్తున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల కన్నా ఏపీలో కరోనా వైరస్ కట్టడి చర్యలు మెరుగ్గా జరుగుతున్నాయని జాతీయ మీడియా కధనాలను ప్రచురించింది. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య లో ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉంది. వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు ప్రభుత్వం ఇప్పటికే మూడు సార్లు ఇంటింటి సర్వే చేపట్టింది.

అత్యున్నత స్థాయిలో ప్రభుత్వం పని చేస్తున్న సమయంలో ప్రతిపక్షాల విమర్శలు అధికార పార్టీ నేతలకు విసుగు తెప్పిస్తున్నాయి. ఈ క్రమంలో వైఎస్ఆర్ సీపీ ముఖ్య నేత, ఎంపీ విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి…” కరోనా ఆపత్కాలంలో రాజకీయాలు చేయకుండా జనసేన స్వయం నియంత్రణ పాటిస్తోందట. రాజకీయాలు చేయడానికి నీకు గ్రౌండే లేదు కదా పవన్. ఎక్కడో హైదరాబాదులో కూర్చొని ‘నేను లేస్తే మనిషిని కాదు’ అని చిటికెలు వేసినట్టుగా ఉంది నీ వాలకం. ప్రజాతీర్పు అప్పుడే మర్చిపోతే ఎలా..” అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

విజయసాయిరెడ్డి ట్వీట్ కు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు స్పందించారు. విజయసాయిరెడ్డి ట్వీట్ను కోట్ చేస్తూ .. ”నువ్వు చెప్పింది కరెక్ట్. ఈ ఎదవ రాజకీయాలు చేయడానికి నీలాంటి గుంటనక్కలు ఉన్న సంగతి మాకు తెలుసు విజయ సాయి రెడ్డి. మన ఇద్దరికీ కామన్ స్నేహితుడి ద్వారా నా ఇంటికి వచ్చి పవన్ తో దోస్తీకి రెడీ అన్న మీ గుంటనక్క రాజకీయాలు నాకు గుర్తున్నాయి..”అని నాగబాబు ట్వీట్ చేశారు.

నాగబాబు విమర్శల పై స్పందించిన విజయసాయిరెడ్డి.. ” పావలా బ్యాచ్ కి రోషం పొడుసుకొచ్చింది. సినిమాలు, టీవీ షోలు చేసుకుంటూ పార్టీని గాలికొదిలేసినోళ్ళకు రాజకీయాలు ఎందుకు..? 2014లోనే మేం పొత్తులు పెట్టుకోలేదు. పొత్తులు ఉండవని మా పార్టీ అధినేత జగన్ గారు మా విధానాన్ని స్పష్టంగా ప్రకటించారు. చిరంజీవి గారికిి తమ్ముళ్లు కాకపోతే కుక్కలు కూడా మొరగవు. చంద్రబాబు కోసం ప్యాకేజీ తీసుకొని పుట్టిన పార్టీ అది. రిజిస్టర్ చేసిన అప్పటి నుంచి ఎవరి కోసం తోక ఊపుకుంటూ మాట్లాడాడో ప్రజలందరికీ తెలుసు. అలాంటి పార్టీతో వైఎస్సార్ కాంగ్రెస్ పొత్తు కోరుకుంటుందని కల ఏమైనావచ్చిందా. పార్టీ అధ్యక్షుడు రెండు చోట్లా చిత్తుగా ఓడిపోతాడని అందరికీ ముందే తెలుసు..” అని విజయ సాయి రెడ్డి విమర్శించారు.

హాయిగా దొంగ లెక్కలు వేసుకుంటూ, దోచుకుంటూ బ్రతికేయగలవని మాకు తెలుసు. అవార్డ్స్ అందుకోగల పారిశ్రామికవేత్తలను జైలుపాలు చేసింది తమరి ప్రతిభే. చిన్న విషయం మీరు వైయస్సార్ ఆడిటర్ కాకపోయి ఉంటే శతకోటి గొట్టం గళ్ళలో ఒక గొట్టం గాడివి అని వదిలేసే వాడిని. నీలాంటి గొట్టం గాళ్ళు నాతో ట్విట్ చేసే బదులు ఫ్యూచర్ లో జైల్లో ఎలా టైం పాస్ పాస్ చేయాలో అని డే టు డే ఒక షెడ్యూల్ వేసుకో. టైం కలిసి వస్తుంది..” అని నాగబాబు ఘాటుగా విమర్శలు చేశారు.

Show comments