iDreamPost
android-app
ios-app

శివాజీరాజాకు గుండెపోటు

శివాజీరాజాకు గుండెపోటు

తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు సినీనటుడు, మా అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు శివాజీరాజాకు గుండెపోటు వచ్చింది. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను హైదరాబాద్‌లోని స్టార్‌ ఆస్పత్రికి తరలించారు. శివాజీ రాజా గుండెపోటుకు గురయ్యారనే వార్తతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

ఒక్కసారిగా బీపీ తగ్గిపోవడంతో శివాజీరాజాకు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. శివాజీరాజాకు త్వరలో శస్త్రచికిత్స చేసి స్టెంట్‌ వేసే అవకాశమున్నట్లు సమాచారం.

శివాజీరాజా లాక్‌డౌన్ సమయంలో సినీ కార్మికులను ఆదుకొనేందుకు తన వంతుగా సహాయం అందించారు. తన ఫాంలో పండించిన కూరగాయలు, పండ్లను పంచిపెట్టారు. అవిశ్రాంతంగా సమాజసేవతోపాటు,పలు రకాల పని ఒత్తిడులతో అస్వస్థతకు గురయ్యారు. శివాజీరాజా ఆరోగ్యం కుదుటపడిందని తెలిసి సినీ ప్రముఖులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Jojobet Girişİmajbetcasibomjojobetjojobetcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobet