iDreamPost
android-app
ios-app

పవన్ పలికిన బాలయ్య ‘ స్వాగతం’ – Nostalgia

  • Published Mar 29, 2020 | 5:43 AM Updated Updated Mar 29, 2020 | 5:43 AM
పవన్ పలికిన బాలయ్య ‘ స్వాగతం’ – Nostalgia

కొన్ని కాంబినేషన్లు మనం ఎంత కోరుకున్నా వెండితెర మీద నిజం కావు. ఊహలకే పరిమితమవుతాయి. కాకపోతే అప్పుడప్పుడు స్టేజి మీదనో లేదా ఏదైనా ఓపెనింగ్ లోనో చూసుకునే ఛాన్స్ దొరుకుంది. అలాంటిదే ఇది కూడా. పైన పిక్ చూశారుగా. నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటున్న దృశ్యం. 1996లో సుస్వాగతం సినిమా ఓపెనింగ్ కి బాలయ్య ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఆ సందర్భంగానే తీసిన ఫోటో ఇది. ఇదే వేడుకకు చిరంజీవి సహా ఇతర అతిరధ మహారథులు కూడా హాజరయ్యారు.

అప్పటికే స్టార్ హీరోగా బాలకృష్ణ టాప్ లీగ్ లో ఉన్నారు. పవన్ ఇంకా పవర్ స్టార్ గా మారలేదు. మొదట చేసిన సినిమాలు హిట్టయినప్పటికీ మెగా రేంజ్ కు తగ్గట్టు ఆడలేదు. ఆ కొరత తీర్చింది సుస్వాగతమే. తమిళ బ్లాక్ బస్టర్ లవ్ టుడే రీమేక్ గా రూపొందిన ఈ మూవీ 1997లో జనవరి 1 విడుదలై గొప్ప విజయాన్ని అందుకుంది. వన్ సైడ్ లవర్ గా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి ఆఖరికి తండ్రిని కూడా దాని వల్లే పోగొట్టుకున్న ప్రేమికుడిగా పవన్ నటనకు యువత ఫిదా అయ్యింది . ఒకరకంగా చెప్పాలంటే సుస్వాగతం అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్. దీని తర్వాత అదే సంవత్సరం తొలిప్రేమ రూపంలో మరో ఇండస్ట్రీ హిట్ దక్కడంతో పవన్ ఆపై తిరుగులేని స్థానానికి చేరుకున్నాడు. కాని మొదటి బ్రేక్ గా ఇప్పటికీ సుస్వాగతం గురించే చెబుతారు.

ప్రకాష్ రాజ్ మోనార్క్ విలనీ, హీరొయిన్ దేవయాని డీసెంట్ పెర్ఫార్మన్స్, కట్టిపడేసే ఎస్ఎ రాజ్ కుమార్ సంగీతం, తండ్రిగా రఘువరన్ పాత్ర ఇలా అన్ని అంశాలు సుస్వాగతం సక్సెస్ కు దోహద పడ్డాయి. మరి బాలకృష్ణ గెస్ట్ గా వచ్చిన వేళావిశేషమేమో కాని మొత్తానికి పవన్ కళ్యాణ్ సుస్వాగతం రూపంలో బ్లాక్ బస్టర్ బోణీ కట్టేశాడు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆర్బి చౌదరి నిర్మించిన ఈ సినిమాకు అప్పటికే రీమేక్స్ లో ఎక్స్ పర్ట్ గా పేరు తెచ్చుకున్న భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. దీని తర్వాత భీమినేని రేంజ్ అమాంతం పెరిగిపోయి స్టార్ డైరెక్టర్స్ లిస్టు లోకి చేరిపోయారు.