Swetha
అందం , టాలెంట్ , ఇండస్ట్రీ బ్యాక్డ్రాప్ ఇలా ఎన్ని ఉన్నా సరే అదృష్టం కలిసిరాకపోతే మాత్రం ... ఫేడ్ అవుట్ అవ్వక తప్పదు. దీనికి ఎవరు అతీతులు కారని ఇదివరకే చాలా మంది హీరోలు ప్రూవ్ చేశారు. ఇక ఇప్పుడు సాయికుమార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆడిసాయికుమార్ విషయంలోనూ ఇదే జరిగింది. ప్రేమకావాలి సినిమా తర్వాత ఆడిసాయికుమార్ కు సాలిడ్ హిట్ పడలేదన్నది వాస్తవం.

అందం , టాలెంట్ , ఇండస్ట్రీ బ్యాక్డ్రాప్ ఇలా ఎన్ని ఉన్నా సరే అదృష్టం కలిసిరాకపోతే మాత్రం … ఫేడ్ అవుట్ అవ్వక తప్పదు. దీనికి ఎవరు అతీతులు కారని ఇదివరకే చాలా మంది హీరోలు ప్రూవ్ చేశారు. ఇక ఇప్పుడు సాయికుమార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆడిసాయికుమార్ విషయంలోనూ ఇదే జరిగింది. ప్రేమకావాలి సినిమా తర్వాత ఆడిసాయికుమార్ కు సాలిడ్ హిట్ పడలేదన్నది వాస్తవం. ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు దూరం అయిపోయాడు. ఇక ఇప్పుడు శంబాలా తో ఆది సాయికుమార్ కు బ్రేక్ దొరికినట్టే. ప్రీమియర్స్ నుంచే ఈ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తుంది.
మరీ ముఖ్యంగా దర్శకుడు కథను తెరిమీద మలిచిన తీరు , ట్విస్ట్ ల ను హ్యాండిల్ చేసిన విధానం , దానిని తీసుకుని వెళ్లి హర్రర్ కు లింక్ చేసిన విధానం అంతా కూడా ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా చేస్తుందంట. ప్రస్తుతం రిలీజ్ అయినా సినిమాల్లో ఛాంపియన్ తర్వాత శంబాలకే ఎక్కువ ఎక్కువ ఓపెనింగ్స్ కనిపిస్తున్నాయంట. ప్రమోషన్స్ లో సాయికుమార్ చాలా పర్సనల్ గా తీసుకున్నారు. తానూ నిర్మాత కాకపోయినా సరే తన కొడుకు కష్టాన్ని గుర్తించి.. దగ్గరుండి పబ్లిసిటీ చేసిన తీరు అందరిని మెప్పించింది. అదే సినిమాకు మంచి ఓపెనింగ్స్ ను రాబట్టిందని కూడా చెప్పొచ్చు. మొత్తానికి ఆది సాయికుమార్ హిట్ కొట్టేసి కంబ్యాక్ ఇచ్చేసాడు.
సో ఇక మీదట కూడా కాస్త ఆచి తూచి అడుగులు వేస్తూ ముందుకు వెళ్తే .. ఆది సాయికుమార్ సక్సెస్ ట్రాక్ ఎక్కేసినట్టే. ఇప్పటివరకు కథల ఎంపికల కాస్త పొరపాట్లు జరిగిన మాట వాస్తవం . ఇప్పుడు ఛాన్స్ దొరికింది కాబట్టి ఇక మీదట దీనిని ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి. ఈ వీకెండ్ కంప్లీట్ అయితే కానీ సినిమా బ్రేక్ ఈవెన్ కు ఎంత దగ్గర్లో ఉంది అనే వివరాలు తెలియవు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.