Swetha
పెళ్ళిసందడి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు శ్రీకాంత్ కొడుకు రోషన్. యాక్టింగ్ లోను డ్యాన్స్ లోను మంచి మార్కులే కొట్టేసాడు. అయితే ఆ సినిమాలో రోషన్ కంటే కూడా శ్రీలీలనే ఎక్కువ హైలెట్ అయింది. ఆ తర్వాత శ్రీలీలకు ఎలాంటి ఆఫర్లు వచ్చాయో తెలియంది కాదు. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత రోషన్ ఛాంపియన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

పెళ్ళిసందడి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు శ్రీకాంత్ కొడుకు రోషన్. యాక్టింగ్ లోను డ్యాన్స్ లోను మంచి మార్కులే కొట్టేసాడు. అయితే ఆ సినిమాలో రోషన్ కంటే కూడా శ్రీలీలనే ఎక్కువ హైలెట్ అయింది. ఆ తర్వాత శ్రీలీలకు ఎలాంటి ఆఫర్లు వచ్చాయో తెలియంది కాదు. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత రోషన్ ఛాంపియన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రెండు రోజుల క్రితం రిలీజ్ అయినా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ ఏ వినిపిస్తుంది. కానీ లెక్కల విషయం తేలాలంటే మాత్రం ఈ వీకెండ్ కంప్లీట్ అవ్వాల్సిందే. ఇంకో రెండు రోజులు ఆగితే కానీ కలెక్షన్స్ మ్యాటర్ బయటకు రాదు.
సరే ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు రోషన్ చేతిలో వరుస సినిమా ఆఫర్లు ఉన్నటు కనిపిస్తున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ రోషన్ తో ఓ సినిమా చేయబోతుందట. ఆల్రెడీ రోషన్ కు తగినట్టు ఓ కథను కూడా రెడీ చేసుకున్నారట. ఇది కాకుండా మరోవైపు స్వప్నదత్, ప్రియాంకా దత్ కూడా రోషన్ తో సినిమా చేసే ప్లాన్ లో ఉన్నారట. అలాగే ఇంద్రగంటి మోహనకృష్ణ, శైలేష్ కొలను రోషన్ కోసం కథలు సిద్ధం చేసుకున్నారట. ఇవన్నీ ఒకెత్తయితే ఇప్పుడు వినిపిస్తున్న ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే రోషన్ గౌతమ్ మీనన్ తో కూడా కలిసి నటించబోతున్నాడట.
ఆల్రెడీ ఇరువైపుల నుంచి సంప్రదింపులు జరగడం , కథ రోషన్ కు బాగా నచ్చడం కూడా జరిగిందట. సో అన్ని ఓకే అనుకుంటే ఛాంపియన్ తర్వాత రోషన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే అవ్వొచ్చు. ఈసారైనా రోషన్ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వెంటనే సినిమాలు చేస్తే అవకాశాలు అందిపుచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక ఈసారి రోషన్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.