iDreamPost
android-app
ios-app

ఈషా : సంతకం పెట్టాకే సినిమా చూడాలట

  • Published Dec 24, 2025 | 5:46 PM Updated Updated Dec 24, 2025 | 5:46 PM

ప్రస్తుతం హర్రర్ సినిమాలకు క్రేజ్ ఎలా ఉందో తెలిసిందే. ఇంకా తెలుగులో వచ్చే హర్రర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటున్నారు. అటు థియేటర్స్ లో కూడా ఈ సినిమాలకు మంచి మార్కులే పడుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈ వారం థియేటర్స్ లో ఈషా సినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్స్ కూడా చాలా వెరైటీగా చేస్తున్నారు.

ప్రస్తుతం హర్రర్ సినిమాలకు క్రేజ్ ఎలా ఉందో తెలిసిందే. ఇంకా తెలుగులో వచ్చే హర్రర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటున్నారు. అటు థియేటర్స్ లో కూడా ఈ సినిమాలకు మంచి మార్కులే పడుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈ వారం థియేటర్స్ లో ఈషా సినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్స్ కూడా చాలా వెరైటీగా చేస్తున్నారు.

  • Published Dec 24, 2025 | 5:46 PMUpdated Dec 24, 2025 | 5:46 PM
ఈషా : సంతకం పెట్టాకే సినిమా చూడాలట

ప్రస్తుతం హర్రర్ సినిమాలకు క్రేజ్ ఎలా ఉందో తెలిసిందే. ఇంకా తెలుగులో వచ్చే హర్రర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటున్నారు. అటు థియేటర్స్ లో కూడా ఈ సినిమాలకు మంచి మార్కులే పడుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈ వారం థియేటర్స్ లో ఈషా సినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్స్ కూడా చాలా వెరైటీగా చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ సినిమాను చూడాలంటే ఆడియన్స్ ఒక ‘అంగీకార పత్రం’ మీద సంతకం పెట్టాలని చెప్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఎందుకంటే ఇందులో కంటెంట్ చూస్తే హర్రర్ మూవీ లవర్స్ కు పూనకాలు రావడం ఖాయమట. పైగా ఇందులో కొన్ని వార్నింగ్స్ కూడా చాలా క్లియర్ గా ఇచ్చింది. సినిమాలో భయంకరమైన సీన్లు ఉంటాయని, సడన్‌గా వచ్చే షాకింగ్ ఎలిమెంట్స్ వల్ల భయపడితే అది ప్రేక్షకుల బాధ్యతేనని చెప్పొచ్చారు. సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చి ఇంటికి వెళ్లినా సరే ఎవరో మిమ్మల్ని వెంటాడుతున్నట్లు ఉంటుందని.. పక్కనే ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నట్లు ఉంటుందని కానీ అదంతా భ్రమేనని.. రాసారు.

ఒకవేళ భయం వలన ఏదైనా జరిగితే అది వాళ్ళ బాధ్యత కాదు అంటూ కాస్త ఫన్నీగా థ్రిల్లింగ్ గా కన్సెన్ట్ ఫార్మ్ రిలీజ్ చేశారు. దీనితో హర్రర్ మూవీ లవర్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు. ఓ హర్రర్ మూవీకి ఈ రేంజ్ లో ఈ తరహాలో ప్రమోషన్ రావడం ఇదే మొదటిసారి. ఈ విధంగా సినిమా మీద ఇంట్రెస్ట్ ను బాగానే క్రియేట్ చేస్తున్నారు. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.