Swetha
ఈ ఏడాది వచ్చిన పెద్ద సినిమాలంటే కూడా ఊహించని చిన్న సినిమాలే మంచి లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఈ వారం బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న , మీడియం రేంజ్ సినిమాలు చాలానే రిలీజ్ అయ్యాయి. సాధారణంగా ఈ డేట్ లో ఒకటి రెండు పెద్ద సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యేవి. కానీ ఈసారి ఏంటో సీన్ వేరేలా ఉంది.
ఈ ఏడాది వచ్చిన పెద్ద సినిమాలంటే కూడా ఊహించని చిన్న సినిమాలే మంచి లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఈ వారం బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న , మీడియం రేంజ్ సినిమాలు చాలానే రిలీజ్ అయ్యాయి. సాధారణంగా ఈ డేట్ లో ఒకటి రెండు పెద్ద సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యేవి. కానీ ఈసారి ఏంటో సీన్ వేరేలా ఉంది.
Swetha
ఈ ఏడాది వచ్చిన పెద్ద సినిమాలంటే కూడా ఊహించని చిన్న సినిమాలే మంచి లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఈ వారం బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న , మీడియం రేంజ్ సినిమాలు చాలానే రిలీజ్ అయ్యాయి. సాధారణంగా ఈ డేట్ లో ఒకటి రెండు పెద్ద సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యేవి. కానీ ఈసారి ఏంటో సీన్ వేరేలా ఉంది. ఈసారి అరడజను పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. పైగా వాటి అన్నటికి కూడా పాజిటివ్ టాక్స్ రావడం విశేషం.
ఆది సాయికుమార్ శంబాలా ప్రీమియర్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. పైగా కంటెంట్ కూడా అద్భుతంగా ఉండడంతో టికెట్స్ బానే తెగుతున్నాయి . రెగ్యులర్ షోస్ కి వెళ్లే కామన్ ఆడియన్స్ కూడా ఈ సినిమాకు మంచి రివ్యూస్ ఇచ్చారంటే.. ఆది సాయికుమార్ కు హిట్ దక్కినట్టే. అలాగే దండోరా సినిమా విషయానికొస్తే .. ఇదొక ఇంటెన్స్ డ్రామా. టైం కి ప్రీమియర్స్ పడలేదు కానీ షోస్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం సినిమాకు మంచి రివ్యూస్ ఏ దక్కుతున్నాయి.
అలాగే ఈషా సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా ప్రమోషన్స్ ఏ చాలా డిఫరెంట్ గా చేశారు. సినిమా చూడడానికి వచ్చే ముందు కన్సెన్ట్ ఫార్మ్ మీద సంతకం చేయాలనీ ప్రమోట్ చేశారు. ఈ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ ఏ వస్తుంది. కాకపోతే నార్మల్ ఆడియన్స్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తే అప్పుడు పికప్ చాలా ఈజీగా ఉండే అవకాశం ఉంది. ఇక పతంగ్ , బ్యాడ్ గర్ల్స్ సినిమాకు ప్రస్తుతానికైతే పెద్దగా బజ్ లేదు.. అలా అని నెగిటివ్ టాక్ కూడా లేదు. ఇవన్నీ ఒకెత్తయితే అన్నిటికంటే ఎక్కువగ రోషన్ ఛాంపియన్ సినిమా మీద అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.. సో మొత్తానికి ఏడాది చివర్లో అన్నీ మంచి శకునాలే ఎదురయ్యాయి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.