iDreamPost
android-app
ios-app

హర్రర్ మూవీస్ ని ఆదరిస్తున్న ఆడియన్స్

  • Published Dec 29, 2025 | 11:35 AM Updated Updated Dec 29, 2025 | 11:35 AM

అఖండ 2 తర్వాత థియేటర్లో చెప్పుకోదగిన సినిమాలు వస్తాయా రావా అనే డైలమాలో ఉన్న థియేటర్ ఓనర్స్ కు.. చిన్న సినిమాలు బాగానే ఊరటనిస్తున్నాయి. ఈ క్రిస్టమస్ కు ఏకంగా అరడజనుకు పైగానే చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. పైగా దేనికి కంప్లీట్ గా నెగెటివ్ టాక్ రాలేదు.

అఖండ 2 తర్వాత థియేటర్లో చెప్పుకోదగిన సినిమాలు వస్తాయా రావా అనే డైలమాలో ఉన్న థియేటర్ ఓనర్స్ కు.. చిన్న సినిమాలు బాగానే ఊరటనిస్తున్నాయి. ఈ క్రిస్టమస్ కు ఏకంగా అరడజనుకు పైగానే చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. పైగా దేనికి కంప్లీట్ గా నెగెటివ్ టాక్ రాలేదు.

  • Published Dec 29, 2025 | 11:35 AMUpdated Dec 29, 2025 | 11:35 AM
హర్రర్ మూవీస్ ని ఆదరిస్తున్న ఆడియన్స్

అఖండ 2 తర్వాత థియేటర్లో చెప్పుకోదగిన సినిమాలు వస్తాయా రావా అనే డైలమాలో ఉన్న థియేటర్ ఓనర్స్ కు.. చిన్న సినిమాలు బాగానే ఊరటనిస్తున్నాయి. ఈ క్రిస్టమస్ కు ఏకంగా అరడజనుకు పైగానే చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. పైగా దేనికి కంప్లీట్ గా నెగెటివ్ టాక్ రాలేదు. వీటి అన్నిటిలో బ్రేక్ ఈవెన్ ను దాటేసి లాభాల్లోకి ఫాస్ట్ గా దూసుకుపోయిన సినిమాలు మాత్రం రెండు ఉన్నాయి. పైగా ఆ రెండు సినిమాలు కూడా ఒకటే జోనర్ కావడం విశేషం.

మొదట ఆది సాయికుమార్ శంబాలా సినిమా చాలానే ఎక్స్పెటషన్స్ తో థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో దేవుళ్ళ గురించి ఉన్నప్పటికీ ఆ తర్వాత కాన్సెప్ట్ అంతా కూడా దెయ్యాలు భూతాలతోనే నిండి ఉంటుంది. ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ సస్పెన్స్ కాన్సెప్ట్స్ ను ప్రేక్షకులు మాత్రం ఎందుకు మిస్ చేస్తారు. అందుకే సినిమాను సక్సెస్ అయ్యేలా చేశారు. మండే నుంచి ఎలా ఉన్నా కానీ వీకెండ్ వరకు మాత్రం సినిమా అందరి అటెన్షన్ ను గ్రాబ్ చేసింది. సేఫ్ జోన్ లో కి వెళ్ళిపోయింది.

ఇక ఆ తర్వాత వెరైటీగా ప్రమోషన్స్ చేసిన ఈషా. కన్సెన్ట్ ఫార్మ్ మీద సైన్ చేసిన తర్వాత మాత్రమే సినిమా చూడాలంటు .. సినిమా చూసిన తర్వాత భయపడితే తమకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. కట్ చేస్తే ప్రమోషన్స్ కు తగినట్టే సినిమా కూడా ఉంది. థియేటర్స్ లో ప్రేక్షకులను బాగానే భయపెట్టి మంచి మార్కులతో పాటు బ్రేక్ ఈవెన్ ను కూడా కొట్టేసింది.

మండే నుంచి ఏది ఎలా ఉన్నా జరగాల్సినవన్నీ ఈ మూడు రోజుల్లోనే జరిగిపోయాయి. ఇక నెక్స్ట్ హంగామా అంతా సంక్రాంతికే ఉంటుంది. ఈ ఒక్క వారం ఓపిక పడితే వచ్చే వారం రాజాసాబ్ వచ్చేస్తుంది. అది కూడా హర్రర్ జోనర్ ఏ.. పైగా ప్రభాస్ సినిమా కాబట్టి కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ముందు ముందు ఎలాంటి సినిమాలు వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.