Swetha
ఇంకో రెండు వారాలలో థియేటర్స్ అన్నీ కళకళలాడుతు ఉంటాయి. ఈసారి సంక్రాంతి పండగ రాజాసాబ్ తోనే మొదలవుతుంది. అసలే డార్లింగ్ నుంచి ఈ ఏడాది ఎలాంటి సినిమా రాలేదు. దీనితో ఫ్యాన్స్ ఆకలితో ఎదురుచూస్తున్నారు. ఈ అందరి ఆకలిని తీర్చడానికి రాజాసాబ్ తో డార్లింగ్ వచ్చేస్తున్నాడు.

ఇంకో రెండు వారాలలో థియేటర్స్ అన్నీ కళకళలాడుతు ఉంటాయి. ఈసారి సంక్రాంతి పండగ రాజాసాబ్ తోనే మొదలవుతుంది. అసలే డార్లింగ్ నుంచి ఈ ఏడాది ఎలాంటి సినిమా రాలేదు. దీనితో ఫ్యాన్స్ ఆకలితో ఎదురుచూస్తున్నారు. ఈ అందరి ఆకలిని తీర్చడానికి రాజాసాబ్ తో డార్లింగ్ వచ్చేస్తున్నాడు. రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ ఎంతలా మారిపోయి మాట్లాడాడో తెలియనిది కాదు. ఈ హ్యాపినెస్ నుంచే ఫ్యాన్స్ ఇంకా బయటకు రాలేదు.. ఇప్పుడు మరో లడ్డు కావాలా నాయనా అన్నట్టు సడెన్ గా రాజాసాబ్ సెకండ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ లో కూడా కథను వీలైనంత తక్కువగానే రివీల్ చేశారు. జరీనా వహబ్ కు తన మనవడు ప్రభాస్ అంటే పంచ ప్రాణాలు. అయితే ఆమె చనిపోయిన తన భర్త సంజయ్ దత్ ని మర్చిపోలేకపోతున్న అని అంటుంది. ఆమెకోసం తన తాత ఆస్తి కోసం పూర్వికులు ఆస్తి అయినా పెద్ద మహల్ లో కి అడుగుపెడతాడు ప్రభాస్. అక్కడ తాత ఇచ్చే వెల్కమ్ డిఫరెంట్ గా ఉంటుంది. అక్కడ దెయ్యాలు భూతలతో పాటు ప్రాణాల మీదకు వచ్చే సంఘటనలు చాలానే ఉంటాయి. అసలు కథ ఏమైఉంటుంది.. దేనికి దేనికి లింక్స్ ఉన్నాయి అనేవి తెలియాలంటే ఈ సినిమా మొత్తం చూడాల్సిందే. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో నుంచి ఓ హర్రర్ సినిమా రావడం అంటే చిన్న విషయం కాదు. ఇక సినిమా రిజల్ట్ అండ్ రివ్యూస్ ఎలా ఉంటాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.