సాయికుమార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్ నుంచి ఇప్పటివరకు చాలానే సినిమాలు వచ్చాయి. మొదట్లో వచ్చిన ప్రేమకావాలి , లవ్లీ లాంటి సినిమాలు ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. కానీ ఆ తర్వాత కొంతకాలం ఆది చేసిన కొన్ని సినిమాలు ఊహించినంత రేంజ్ లో హిట్ అనిపించుకోలేదు. అయినా సరే ఆది సాయికుమార్ వెనుక అడుగు వేయకుండా ఈసారి ఎలా అయినా కంబ్యాక్ ఇవ్వలని శంబాల తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది.. ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది రివ్యూలో చూసేద్దాం.
సాయికుమార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్ నుంచి ఇప్పటివరకు చాలానే సినిమాలు వచ్చాయి. మొదట్లో వచ్చిన ప్రేమకావాలి , లవ్లీ లాంటి సినిమాలు ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. కానీ ఆ తర్వాత కొంతకాలం ఆది చేసిన కొన్ని సినిమాలు ఊహించినంత రేంజ్ లో హిట్ అనిపించుకోలేదు. అయినా సరే ఆది సాయికుమార్ వెనుక అడుగు వేయకుండా ఈసారి ఎలా అయినా కంబ్యాక్ ఇవ్వలని శంబాల తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది.. ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది రివ్యూలో చూసేద్దాం.
DV Raju
సాయికుమార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్ నుంచి ఇప్పటివరకు చాలానే సినిమాలు వచ్చాయి. మొదట్లో వచ్చిన ప్రేమకావాలి , లవ్లీ లాంటి సినిమాలు ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. కానీ ఆ తర్వాత కొంతకాలం ఆది చేసిన కొన్ని సినిమాలు ఊహించినంత రేంజ్ లో హిట్ అనిపించుకోలేదు. అయినా సరే ఆది సాయికుమార్ వెనుక అడుగు వేయకుండా ఈసారి ఎలా అయినా కంబ్యాక్ ఇవ్వలని శంబాల తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. ప్రమోషనల్ కంటెంట్ కూడా వర్కవుట్ కావడంతో సినిమా మీద పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ అయింది. పైగా ఓ రోజు ముందే ప్రీమియర్స్ ను కూడా ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది.. ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది రివ్యూలో చూసేద్దాం.
కథ :
ఇది 1980ల కాలంలో సాగే కథ. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఓ ఊరు శంబాల. అనుకోకుండా ఓ రోజు అక్కడ ఆకాశం నుంచి ఓ ఉల్క పడుతుంది. అప్పటినుంచి ఊరిలో ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అక్కడి ప్రజల్లో భయం పెరిగి.. మూఢ నమ్మకాలూ పుట్టుకొస్తాయి. దీనితో దాని మీద రీసెర్చ్ చేయడానికి గవర్నమెంట్ విక్రమ్ (ఆది సాయికుమార్) ను ఆ ఊరికి పంపుతుంది. ఆ తర్వాత ఊరిలో వరుస హత్యలు మొదలవుతాయి. సైన్స్ ని నమ్ముకుని పని చేసే విక్రమ్ ఊరి జనం మూఢ నమ్మకాలకు చెక్ పెడతాడా ? హత్యలు జరగడం వెనుక కారణాలను కనిపెడతాడా ? ఆ ఉల్క కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా ? చివరికి ఆ ఊరి వారిని ఆ హత్యల నుంచి కాపాడాడా ? అనేది తెలియాలంటే సినిమాను వెండితెరమీద చూడాల్సిందే.
నటీనటులు , టెక్నీకల్ టీం పనితీరు :
నటీ నటుల విషయానికొస్తే ఇక్కడ ముందుగా చెప్పుకోవాల్సింది ఆది సాయికుమార్ గురించే. విక్రమ్ క్యారెక్టర్ ను ఆది కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ తో చేసాడని చెప్పి తీరాల్సిందే. చాలా కాలం తర్వాత ఆదికి సెట్ అయ్యే ఓ క్యారెక్టర్ దొరికింది. కంప్లీట్ యాక్షన్ సీన్స్ తో పాటు నటించడానికి స్కోప్ దొరికింది. ఆ తర్వాత సినిమాలో ఆ రేంజ్ లో ఆకట్టుకున్న క్యారెక్టర్స్ రవి వర్మ , మీసాల లక్ష్మణ్ . అలాగే అర్చన అయ్యర్ ఎవరూ ఊహించని పాత్రలో కనిపిస్తుంది. ఇక ఇంద్రనీల్, మధునందన్, శైలజ ప్రియ, శ్రావణ సంధ్య, శ్వాసిక విజయ్,బేబి ఛైత్ర, శివకార్తిక్ లాంటి మిగిలిన వారంతా కూడా… వారి వారి పాత్రలలో ఒదిగిపోయి న్యాయం చేశారు.
ఇక టెక్నీకల్ టీం విషయానికొస్తే.. ఈ సినిమాలో టెక్నీకల్ టీం ది చాలా కీలకమైన పాత్ర అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అద్భుతంగా సినిమాకు సింక్ అయింది. ఇలాంటి జోనర్ సినిమాలకు ఇదే కీలకం. సో ఈ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. ఇక విజువల్స్ శంబాలా ప్రపంచాన్ని చాలా కొత్తగా చూపించాయి. కథ , కథనం చాలా అద్భుతంగా ఉన్నాయి. సినిమా మొత్తంలో అక్కడక్కడా చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ.. అవన్నీ మేకింగ్ లో కవర్ అయిపోయాయని చెప్పొచ్చు.
విశ్లేషణ :
ఒక పీరియడ్ ఆఫ్ టైం లో కొన్ని జానర్స్ ప్రేక్షకులను బాగా ఇంప్రెస్ చేస్తూ ఉంటాయి. అలా కొంతకాలంగా ప్రేక్షకులను మెప్పిస్తున్న జానర్ మిస్టరీ థ్రిల్లర్. ఈ జానర్ ను సెలెక్ట్ చేసుకునే ఆది సాయికుమార్ ఓ మంచి నిర్ణయం తీసుకున్నాడని చెప్పొచ్చు. ప్రేక్షకులను భయపెట్టే అంశాలు , తెలియని రహస్యాలు , దెయ్యాలు , ఆత్మలు , దేవుళ్ళు ఇలా అన్నిటిని ఓ కథలో ఉంచి .. దానిని ప్రొపర్ గా తీర్చిదిద్ది తెర మీదకు తీసుకుని వస్తే చాలు.. సినిమా సక్సెస్ అయినట్టే. దీనిని శంబాల మరోసారి ప్రూవ్ చేసింది.
సినిమా స్టార్ట్ అయినా కొన్ని నిమిషాలకే ప్రేక్షకులు శంబాలా వరల్డ్ లోకి ఎంటర్ అయిపోతారు. ఊరు, దాని వెనక చరిత్ర, మూఢ నమ్మకాలు, సైన్స్ ను మాత్రమే నమ్మే హీరో ఇలా అన్నీ ఇంట్రెస్టింగ్ గా సాగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఊరి జనాలు ఊరిలో ఓ భూతం ఆవహించింది అని నమ్ముతూ ఉంటారో అప్పటినుంచి అసలు కథ మొదలవుతుంది. హర్రర్ , సస్పెన్స్ ఎలిమెంట్స్ ను ప్రేక్షకులు ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ప్రీ ఇంటెర్వెల్ సీన్ వచ్చేసరికి ప్రేక్షకుడి మదిలో బోలెడన్ని ప్రశ్నలు మొదలవుతాయి.
కట్ చేస్తే హాఫ్ స్టార్ట్ అవుతుంది. ఊరి దేవత చరిత్ర, ఉల్క పడటంతో జరిగిన పరిణామం ఇలా ఒక్కొక్క విషయాన్ని రివీల్ చేస్తూ వెళ్లిన విధానం బావుంది. అలా ఒక్కో సీన్ ను పక్కాగా రాసుకుని , పకడ్బందీగా తెరమీదకు తీసుకుని వచ్చాడు దర్శకుడు. నిజానికి మిస్టరీ థ్రిల్లర్ అనే పదానికి వంద శాతం న్యాయం చేసారని చెప్పి తీరాల్సిందే. ఆ ఊరిలో పడ్డ ఉల్క కారణంగా ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి, అసలు ఆ సమస్యలకు కారణం ఏమిటి , వాటి కోసం హీరో చేసే పోరాటం ఏంటి , అసలు హీరో సమస్యకు ఎలా పరిష్కారం కనుక్కుంటాడు అని ఇలా ప్రతి సీన్ ను చివరివరకు ఉత్కంఠభరితంగా సాగుతుంది. అక్కడక్కడా కాస్త ల్యాగ్ ఫీలింగ్ వచ్చినా .. సినిమా అంతా కంప్లీట్ అయ్యేసరికి ప్రేక్షకులకు ఓ మంచి సినిమా చూశామనే ఫీలింగ్ కలుగుతుందని చెప్పొచ్చు.
ప్లస్ లు :
నటీ నటులు
కథ , కథనం
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్
విజువల్స్
మైనస్ లు :
ల్యాగ్ సీన్స్ ( కొన్ని చోట్ల)
రేటింగ్ : 3/5
చివరిగా : శంబాల ప్రపంచం ప్రేక్షకులను కొత్త థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది
(ఈ రివ్యూ సమీక్షకుని వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)