iDreamPost
android-app
ios-app

మహేష్ ఆలోచిస్తూనే ఉన్నాడా

  • Published Mar 04, 2020 | 4:37 AM Updated Updated Mar 04, 2020 | 4:37 AM
  • Published Mar 04, 2020 | 4:37 AMUpdated Mar 04, 2020 | 4:37 AM
మహేష్ ఆలోచిస్తూనే ఉన్నాడా

సూపర్ స్టార్ మహేష్ బాబు పెద్ద డైలమాలో ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. మెగాస్టార్ ఆచార్య సినిమాలో స్పెషల్ రోల్ చేస్తాడని గత రెండు వారాలుగా మీడియాలో ఎడతెగని ప్రచారం జరుగుతోంది. తన తరఫున ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే పిఆర్ టీం ఎక్కడా ఖండిస్తున్న దాఖలాలు లేవు. ఒకవేళ నిజంగా ఆచార్య చేయడం లేదనుకుంటే నమ్రతా రంగంలోకి దిగిపోయి అలాంటిదేమీ లేదు అని ఒక నోట్ లేదా ట్వీట్ తో దీనికి ముగింపు పలికేది. అలాంటిదేమీ జరగడం లేదు. సో దీని గురించిన తీవ్ర సమాలోచనలు జరుగుతున్న మాట నిజమే అని చెప్పొచ్చు.

నిన్న ఓ వర్గంలో మళ్ళి రామ్ చరణే ఆ పాత్ర చేస్తాడని మహేష్ డ్రాప్ అయ్యాడని కొత్త న్యూస్ వచ్చింది. కాని చెర్రి ఆర్ఆర్ఆర్ షూటింగ్ తప్ప ఇంకేది ఆలోచించే స్టేజిలో లేడు. మరోవైపు రాజమౌళి తన ఆర్ఆర్ఆర్ కంటే ముందు ఇద్దరు హీరోల సినిమా ఏదీ రాకూడదు అనే కండీషన్ మీదే గట్టిగా ఉన్నాడట. 26 సినిమాల ప్రయాణంలో ఎన్నడూ లేనిది ఇప్పుడు స్పెషల్ రోల్ చేయడం అవసరమా అనే పాయింట్ కూడా మహేష్ లో ఉందట. కాకపోతే చిరంజీవితో కలిసి నటించే ఇలాంటి కథ మళ్ళి దొరక్కపోవచ్చు.

అందులోనూ చిరు ఇప్పటి తరంలాగా రెగ్యులర్ హీరో కాదు. రెండేళ్ళకు ఒక సినిమా తప్ప ఎక్కువ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఒప్పుకోవడమా వద్దా అనే విషయంలో కృష్ణ గారి సలహాలు కూడా తీసుకుంటున్నారట. పాత్ర పవర్ ఫుల్ గా ఉంటే చేయొచ్చని గతంలో పెదరాయుడులో రజనికాంత్ పాత్రే హై లైట్ అయినప్పటికీ మోహన్ బాబుకు సైతం అంతే పేరు వచ్చిందని ఆచార్య కనక అంత స్పాన్ ఉన్న స్టొరీ అయితే నిస్సందేహంగా చేయోచ్చనే చెప్పారట. మరి ఇదంతా నిజమో కాదో తెలియాలంటే ఈ సస్పెన్స్ ని ఇంకొద్ది రోజులు భరించక తప్పదు. ఆగష్టు రిలీజ్ టార్గెట్ చేసిన ఆచార్య టైటిల్ ఎలాగూ లీక్ అయిపోయింది కాబట్టి త్వరలోనే అఫీషియల్ ఫస్ట్ లుక్ విడుదల చేసే ప్లాన్ లో ఉంది టీం.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş