హైకోర్టు కార్యాలయాల తరలింపులో ప్రభుత్వానికి చుక్కెదురు

  • Published - 06:41 AM, Fri - 20 March 20
హైకోర్టు కార్యాలయాల తరలింపులో ప్రభుత్వానికి చుక్కెదురు

రాష్ట్ర హైకోర్టు అనుబంధ విభాగాలైన విజిలెన్స్ కమిషనర్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలను కర్నూల్ కి తరలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ను నిలుపుదల చెయ్యాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వైజాగ్ లో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో పరిపాలనా రాజధాని, కర్నూల్ లో న్యాయ రాజధాని ని ఏర్పాటు చెయ్యాలని అసెంబ్లీ లో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసిన నేపథ్యంలో, దానిలో భాగంగా కోర్ట్ సంభందిత న్యాయ కార్యాలయాలన్నింటిని కర్నూల్ కి తరలించాలని భావించిన రాష్ట్రప్రభుత్వం మొదటిదశలో సెక్రటేరియట్ పరిధిలోని విజిలెన్స్ కమిషనర్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలను కర్నూల్ కి తరలిస్తూ జీవో నెంబర్ 13 ను జారీ చేసింది.

కాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని పేరుతొ ప్రభుత్వం జారీచేసిన జీవో నంబర్ 13 లో ఆమె సంతకం లేకపోవడం వంటి సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు గతంలో దీనిపై తీర్పు ని రిజర్వ్ చేసింది. అయితే శుక్రవారం హైకోర్టు జీవో నెంబర్ 13 ను నిలిపివేస్తున్నట్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు కార్యాలయాలను తరలించాలన్న ప్రభుత్వ ఉద్దేశానికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్టయింది.

Show comments